Varun sandesh new girl friend

varun sandesh girlfriend, varun sandesh latet gilrl friend, varun sandesh ee varsham sakshiga movie updates, ee varsham sakshiga movie review, ee varsham sakshiga photos songs, hari priya kannada movies, hari priya varun sandesh affair, tollywood latest gossips

varun sandesh new girl friend : happy days hero varun sandesh have habit of acting in movies and dating with heroines, first he dated with arya 2 heroine shraddha das but its not workout with some of reasons, tollywood rumors that he now dating with his latest movies heroine

కొత్త ప్రియతో యవ్వారమట..! ఎన్నాళ్ళు నాయనా...?

Posted: 12/12/2014 11:01 AM IST
Varun sandesh new girl friend

హ్యాపిడేస్ హీరో వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకాలు బాగానే చూస్తున్నాడు. ఒక లోకంలో బోర్ కొడితే.., ఏమైంది ఈ వేళ అనుకుంటూ మరో లోకంలోకి జంప్ అవుతున్నాడు. సినిమాలతో పాటు డేటింగ్ లో బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం కొత్త అమ్మాయితో కలిసి తిరుగుతున్నట్లు తెగ పుకార్లు వస్తున్నాయి. సినిమా షూటింగుల పనిమీదనో.., లేక ఇంకేదో కార్యక్రమం కోసమో హీరోయిన్ తో కలిసి అప్పుడప్పుడూ బయట కన్పించాడట. ఇంకేముంది డేటింగ్ పార్ట్ 2 షురూ అంటూ పుకార్లు వచ్చేస్తున్నాయి.

ఫిలింనగర్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.., వరుణ్ బాబు హీరోయిన్ హరి ప్రియతో ప్రేమాయణం సాగిస్తున్నాడట. ఇద్దరూ కలిసి తిరుగుతుండటంతో ఇదే నిజమని అనుకుంటున్నారంతా. ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ సెట్స్ పై వీరిద్దరి చూపులు కలిసి, క్రష్ పుట్టడంతో వర్షం సాక్షిగా అనుబంధం కొనసాగిస్తున్నారని అనుకుంటున్నారు. అటు వరుణ్ తన సినిమాలకు హరి ప్రియను హీరోయన్ గా తీసుకోవాలని డైరెక్టర్, నిర్మాతలకు సూచిస్తున్నాడట. ఈ సాఫ్ట్ కార్నర్ కు పేరు పెట్టుకోని సంబంధమే కారణమని కొందరు అంటుంటే.. కాదు హరికి తెలుగులో చాన్సులు ఇప్పించే మంచితనం అని సందేశం సన్నిహితులు అంటున్నారు.

ఈ పుకారు నిజమా.. అబద్దమా కన్ఫర్మ్ కాకముందే... ఎన్నాళ్లుంటుంది బాబూ ఈ బంధం అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో వరుణ్ ఆర్య2 హీరోయిన్ తో డేటింగ్ చేశాడు. ఈ విషయాన్ని శ్రద్ధా దాస్ స్వయంగా ప్రకటించింది. కాని కొద్ది కాలం క్రితమే డేటింగ్ బంధానికి ఎక్స్ పైరీ డేట్ వచ్చింది. మళ్ళీ గ్యాప్ తీసుకుని కొత్త కొంగు పట్టుకున్నాడు. అందుకే ఇది ఎన్ని రోజులు అని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తెలుగులో హరిప్రియకు అమ్మడికి ఎక్కువగా ఆఫర్లు లేవు. ‘అత్తారింటికి దారేది’ కన్నడ రీమేక్ లో ఈమె నటిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more