Junior ntr temper movie audio release in guntur

ntr audio release in nimmakuru, ntr temper audio release in nimmakuru, temper audio release date in guntur, ntr temper latest updates, ntr tollywood latest news updates puri jagannath movie updates, ntr next movie, nandamuri fans, tollywood latest updates

junior ntr temper movie audio release in guntur : junior ntr latest movie temper getting ready to release for sankranti, temper movie unit says film audio release function will held in guntur instead of nimmakuru

నిమ్మకూరు అంటే భయపడుతున్న ఎన్టీఆర్

Posted: 11/26/2014 12:40 PM IST
Junior ntr temper movie audio release in guntur

కన్నతల్లిని.., సొంత ఊరిపై ప్రేమలేని వారు మనుషులే కాదని పెద్దలు చాలాసార్లు చెప్పారు. ఇక పూర్వికులు పుట్టిన ఊరు అంటే ఎక్కడలేని అభిమానం, మమకారం పొంగుకొస్తుంది. అయితే.., జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం నిమ్మకూరు అంటే భయమేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎంతగానో అభిమానించే తాతయ్య.. నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరుపై ఎనలేని ప్రేమ ఉండాల్సింది పోయి ఈ భయం ఏమిటి అని సినీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు.., దాన్ని తలుచుకుని భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్లే ముందు ప్రజెంట్ సీన్ కాస్త చూస్తే.., ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో వస్తున్న ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. షూటింగ్ తో పాటే, ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ టైం వేస్ట్ చేయకుండా కష్టపడుతున్నారు. ఇక ఈ సినిమా పాటలను నిమ్మకూరులో విడుదల చేయాలని ముందుగా డిసైడ్ అయినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా గుంటూరులో ఆడియో రిలీజ్ ఉంటుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. డిసెంబర్ నెలలో గుంటూరులో వేడుకను నిర్వహిస్తారని ఆఫ్ బీట్ టాక్.

ఈ ప్లేస్ చేంజ్ కు కారణం తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం. ‘టెంపర్’కు ముందు ఎన్టీఆర్ పూరితో అప్పట్లో చేసిన సినిమా ‘ఆంధ్రావాలా’ అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా ఆడియో విడుదల నిమ్మకూరులో జరిగింది. ‘సింహాద్రి’ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలతో.., జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యేక రైళ్లు, బస్సులతో నిమ్మకూరు వెళ్లటం అప్పట్లో సంచలనం కల్గించింది. మళ్ళీ ఎన్టీఆర్ వచ్చాడంటూ అంతా పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న సమయంలో సినిామ విడుదలై షాక్ ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పూరితో సినిమా.. అదే నిమ్మకూరు ఆ తర్వాత రిజల్ట్ కూడా అదే అవుతుంది అని అదురుకుని.., ప్లేస్ మార్చారని పుకార్లు వస్తున్నాయి. నిమ్మకూరు, గుంటూరు ఎంతవరకు నిజమనేది సినిమా యూనిట్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. అయితే మూవీ హిట్, ఫ్లాపుకు కధతో సంబందం తప్ప ఊరితో పనిలేదని మాత్రం చెప్పగలము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  temper  audio release  guntur  nimmakuru  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more