Trisha latest comments on rana

trisha latest comments, trisha comments on rana, trisha comments on varun engagement, trisha latest movie offers, trisha latest news updates, tollywood latest gossips, rana next movie, rana in bahubali movie photos

trisha latest comments on rana : senior heroine trisha recent comments on rana had creating sensation on internet and also in tollywood, trisha says that she is not engaged and also says about relationship with rana that, she never confirmed about relation with rana so why she comment on break up rumor

రానాతో రిలేషన్ పై సంచలన కామెంట్లు

Posted: 11/26/2014 11:25 AM IST
Trisha latest comments on rana

ఇండస్ర్టీలోకి వచ్చి పుష్కరం పూర్తవుతున్నా.., ఇప్పటికీ చెన్నై భామకున్న క్రేజు మాత్రం తగ్గటం లేదు. చుక్కలెన్ని ఉన్నా చందమామ వెన్నెలకే ఓటు అన్నట్లుగా.., ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా త్రిషకు మాత్రం అవకాశాలు తగ్గటం లేదు. తాజాగా ఈ అమ్మడిపై రెండు వరుస పుకార్లు సంచలనం సృష్టించాయి. ఒకటి బంధం తెంచుకోవటం గురించి అయితే మరొకటి కొత్త బంధం కలవటం గురించి పుకార్లు వచ్చాయి. వీటిపై అందాల భామ తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చుకుదంి. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.

వరుణ్ తో ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వచ్చిన ఊహాగానాలను త్రిష తోసిపుచ్చింది. తనకు నిశ్చితార్థం కాలేదని చెప్పింది. అయితే మాత్రం తప్పకుండా తానే ముందుగా చెప్తానని మరోసారి తెలిపింది. పెళ్ళి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ప్రతి అమ్మాయికి నిశ్చితార్దం, పెళ్ళి అనేది సంతోషకరమైన విషయమనీ.., అలాంటి అంశాన్ని ఎందుకు దాచి ఉంచడం అని ప్రశ్నించింది. వరుణ్ తన స్నేహితుడే అయినా.., పెళ్ళి చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన ఏదీ లేదు అని చెప్పింది.

ఇక రానాతో సంబంధంపై కూడా వివరణ ఇచ్చింది. గతంలో రానాతో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్లు వచ్చాయి. వాటికి అవును అని ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అలాంటి సందర్బంలో విడిపోయినట్లు మళ్ళీ పుకార్లు వస్తే ఎందుకు స్పందించటం అని చెప్పింది. ప్రస్తుతం ఇది చర్చించాల్సిన విషయం, సమయం కాదు అని సమాధానమిచ్చింది. ఖచ్చితంగా తనకు పెళ్ళి జరుగుతుందనీ.., అయితే అది ఎవరితో, ఎప్పుడు అనేది ఇంకా తెలియదు అని పేర్కొంది. 12సంవత్సరాలుగా ఇండస్ర్టీలో వచ్చిన ఆఫర్లు, చేసిన సినిమాలు సంతృప్తి ఇచ్చాయి అని తెలిపింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  rana  varun manian  engagement  relationship  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more