Namrata shirodkar controls mahesh babu namrata permission to meet mahesh babu mahesh babu new movie mahesh babu movie updates namrata mahesh babu

namrata shirodkar controls mahesh babu namrata permission to meet mahesh babu mahesh babu new movie mahesh babu movie updates namrata mahesh babu

namrata shirodkar controls mahesh babu namrata permission to meet mahesh babu mahesh babu new movie mahesh babu movie updates namrata mahesh babu

కూతురు వెనకాల తల్లి... ! భర్త వెనకాల భార్య

Posted: 11/22/2014 03:37 PM IST
Namrata shirodkar controls mahesh babu namrata permission to meet mahesh babu mahesh babu new movie mahesh babu movie updates namrata mahesh babu

సినిమా ఇండస్ర్టీ గురించి తెలిసిన వారికి ‘కూతురు వెనకాల తల్లి’ అనే వాక్యంకు అర్థమేంటో తెలుసు. అంటే ఒక అమ్మాయి హీరోయిన్ అయిందంటే చాలు.., ఇక ఆమె తల్లి ఎల్లపుడూ వెంట ఉంటుంది. షూటింగ్ స్పాట్ కు కూతురుతో కలిసి వస్తుంది. అక్కడే భోజనం వగైరా అన్ని కూడా ఉంటాయి. రెమ్యునరేషన్లు, షూటింగ్ డేట్లు ఇవ్వటం, చివరకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తల్లి డిసైడ్ చేస్తుంది. అంటే కూతురు మనకు కన్పించే టీవీ అయితే తల్లి వెనకాల ఉండి నడిపించే రిమోట్ కంట్రోలర్ అన్నమాట. భర్త వెనక భార్య అనే మాట కాస్త కొత్తగా ఉంది.

 అయితే అర్ధం మాత్రం ఒకటే. అంటే కూతుర్ని తల్లి కంట్రోల్ చేసినట్లు భర్తను భార్య కంట్రోల్ చేస్తోంది. ఇది మహేష్ విషయంలో జరుగుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇండస్ర్టీలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ తాజా చిత్రం ‘ఆగడు’ భారీ బడ్జెట్, అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. దీంతో సినిమాల ఎంపిక, డైరెక్టర్లు, డైలాగులు, బడ్జెట్ విషయంలో మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని తెలిసిందే. అయితే మహేష్ విషయంలో నమ్రత కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటుంది అని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

గతంలో మాదిరిగానే ముందస్తు అపాయింట్ మెంట్ వంటి పార్మాలిటీస్ లేకుండా ఈ మద్య కొందరు నిర్మాతలు మహేష్ ను కలవటానికి ఇంటికి వచ్చారట. వారు కలిసి వెళ్లిన తర్వాత సెక్యురిటీ సిబ్బందిపై మాజీ నటి చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపవద్దని సెక్యురిటి సిబ్బందికి గట్టిగా చెప్పిందట. అదేవిధంగా సూపర్ స్టార్ చుట్టూ కొంతమంది చేరి భజనబృందంగా మారి సినిమాలు ప్రభావితం చేస్తున్నారని నమ్రత గుర్తించింది. వీరందర్ని ఆయనకు దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తోందని కూడా తెలుస్తోంది. ఇలా మహేష్ విషయంలో పలు కఠిన నిబంధనలు అమలు చేస్తూ సినిమా విషయాల్లో నమ్రత జోక్యం చేసుకుంటోంది. మరి ఈ కంట్రోలింగ్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  namrata shirodkar  tollywood  control  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more