Samantha controversial comments on 30 plus aged heroines which goes viral

samantha, samantha latest news, samantha hot photos, anushka shetty latest news, anushka shetty hot photo shoot, samantha anushka, samantha latest news, samanatha movies, samantha kaththi movie, 30 plus aged heroines

samantha controversial comments on 30 plus aged heroines which goes viral

బొమ్మాళిపై నోరుపారేసుకున్న సమంత!

Posted: 10/27/2014 06:13 PM IST
Samantha controversial comments on 30 plus aged heroines which goes viral

సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. అప్పుడప్పుడు తన నోటిదురుసును ప్రదర్శించుకోవడం పరిపాటిగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో మహేష్ బాబు ‘‘వన్’’ మూవీ, ‘‘ఆగడు’’ సినిమాల మీద వ్యంగ్యంగా సెటైర్లు వేసి అభిమానుల విమర్శలకు గురైన సమంత.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కేసింది. ‘‘ఏజ్ బార్ హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకొని సెటిలైపోవడం బెటరని.. 30 ఏళ్ళు వస్తే నేను కూడా పరిశ్రమ నుంచి తప్పుకుంటాను’’ అంటూ ఈ గ్లామర్ డాల్ పేర్కొంది. దీంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మూడుపదుల వయస్సు దాటిన తారలు చాలామందే వున్నారు. యంగ్ హీరోయిన్లతో బాగానే పోటీ ఇస్తూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అందులో ముఖ్యంగా అనుష్క ఒకరు! మూడుపదుల వయస్సు దాటినా కూడా తన గ్లామర్ ను ఇంకా పెంచుకుంటూపోతూ ‘‘రుద్రమదేవి, బాహుబలి’’ వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమాలతోపాటు తమిళ్‌లో రజనీకాంత్ సరసన ‘‘లింగా’’, అజిత్‌తో ‘‘తలా 55’’ అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు కొన్ని కథలను పెండింగ్ లో కూడా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు దాదాపు ఇంకా మూడేళ్లవరకు ఫుల్ బిజీగా వుండే అవకాశాలున్నాయి. ఈమెను దృష్టిలో పెట్టుకునే సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

వరుసగా భారీ చిత్రాలు చేసుకుంటూపోతూ ఇతర హీరోయిన్లకు ఆప్షన్ ఇవ్వడంలేదనే అసూయతోనే సమంత ఈవిధంగా తన కోపాన్ని ఇన్ డైరెక్ట్ గా అనుష్కపై కామెంట్ చేసి తీర్చుకుందని సినీవిశ్లేషకులు సైతం చెప్పుకుంటున్నారు. మరి సమంత ఇలా కామెంట్ చేసింది అనుష్కని దృష్టిలో పెట్టుకునేనా.. లేక ఇతర తారల మీద కావాలనే సెటైర్ వేసిందా అనేది మాత్రం తెలియదు. ఇదిలావుండగా.. తనేదో కేవలం తన మనసులో మాట చెప్పానని.. అందుకే దానిమీద ఇలా కథలు అల్లేయడం ఏం బాగోలేదంటూ కవర్ చేసుకుని పనిలో సమంత పడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. సమంత ఇలా తనకు నచ్చినట్లు కామెంట్లు చేయడం తగదని అందరూ సూచిస్తన్నారు.

AS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : samantha  anushka  30 plus aged heroines  kollywood  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more