Vv vinayak to direct kaththi movie with pawan kalyan in telugu

pawan kalyan next movie, pawan kalyan in kaththi movie, pawan kalyan vv vinayak movie, pawan kalyan goapala gopala movie images, goapala gopala movie images, gopala gopala release date, gopala gopala movie latest updates, tollywood latest news, vijay kaththi movie colletions

vv vinayak to direct kaththi movie with pawan kalyan in telugu : vv vinayak to direct kaththi movie in telugu with pawan kalyan if he agrees. with this vv vinayak wish to direct pawan will also fulfill

ఆలు లేదు.., చూలు లేదు డైరెక్టర్ పేరేమో...

Posted: 10/27/2014 10:01 AM IST
Vv vinayak to direct kaththi movie with pawan kalyan in telugu

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి వస్తున్న వార్తలు వింటుంటే ‘ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అనే పాత సామెత గుర్తుకు వస్తోంది. తమిళంలో విడుదల అయిన కత్తిని తెలుగులో పవన్ తో రిమేక్ చేయిస్తారని చెప్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఇస్తున్నట్లు కానీ.., తీసుకుంటున్నట్లు కానీ ఎవరూ ప్రకటన చేయలేదు. ఇలా ఏదీ లేకముందే ఈ ప్రాజెక్టును నేను డైరెక్ట్ చేస్తానంటూ ఓ పెద్దాయన ముందుకు వచ్చారు. ఆయనే వి.వి. వినాయక్.

పవన్ తో ‘కత్తి’ సినిమా తెలుగులో తీస్తే.., ఆ మూవీకి తాను డైరెక్ట్ చేసేందుకు సిద్దమని వినాయక్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో పవన్ తో సినిమాను చేయాలన్న తన కోరికను తీర్చుకోవాలని వినాయక్ తహతహలాడుతున్నాడు. వినాయక్ అభిప్రాయంపై సినీ ప్రముఖులు కొందరు నవ్వుకుంటున్నారు. రీమేక్ పై సస్పెన్స్ ఇంకా వీడలేదు, అప్పుడే తాను ఈ సినిమా చేస్తానని చెప్పటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా అని మరికొందరు అంటున్నారు. ఇదెలాగంటే.., గతంలో ప్రకటించిన ప్రకారం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఈ నెల 31. గడువు దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రచార ఆర్బాటాలు చేయలేదు. దీన్నిబట్టి సినిమా విడుదల లేనట్లే అని అంటున్నారు.

దీపావళి కానుకగా తమిళనాడులో విడుదల అయిన ‘కత్తి’ విజయవంతంగా ఆడుతోంది. భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ.., సినిమాపై ఉన్న అంచనాలు నిలబెట్టుకుంది. అయితే గతంలో పవన్ తో తెలుగు, తమిళ సినిమాలు మార్చుకున్న విజయ్ ఈ విషయంలో మాత్రం కాస్త బెట్టు వీడటం లేదని తెలుస్తోంది. ‘కత్తి’ని రీమేక్ కు బదులు డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి కూడా. అయితే తెలుగులో పవన్ తో విడుదల చేస్తే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని డైరెక్టర్, నిర్మాత భావిస్తున్నారు. అందువల్లే తెలుగులో సినిమా విడుదల ఆగిపోయిందని తెలుస్తోంది. మరి దీనిపై సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  pawan kalyan  vv vinayak  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more