Actress sheela and dil raju finally speaks about the rumours about their live in relationship

actress sheela, sheela latest news, parugu sheela news, sheela dil raju affair news, sheela producer dil raju affair news, producer dil raju news, sheela hot photos, sheela latest gallery

actress sheela and dil raju finally speaks about the rumours about their live in relationship

రాజుతో షీలా సీక్రెట్ ఎఫైర్.. ఫైనల్ గా రివీలయ్యింది!

Posted: 10/25/2014 12:11 PM IST
Actress sheela and dil raju finally speaks about the rumours about their live in relationship

చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షీలా.. ‘‘పరుగు’’ సినిమాతో తెలుగుచిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ ఆమె కెరీర్ నే మార్చేసింది. తర్వాత వరుసగా పలు చిత్రాల్లో చిత్రాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఆమె చివరగా నటించిన ‘‘పరమవీర చక్ర’’ మూవీ తర్వాత కనిపించకుండా పోయింది. తాను ఎక్కడుందో.. ఎలా వుందోనన్న విషయాలు చిత్రవర్గాలతోపాటు మీడియా కూడా గుర్తించలేకపోయింది. చిత్రరంగంలో వున్నవారితో ఎవ్వరితోనూ ఆమె టచ్ లో లేకుండా పోయింది. దాదాపు మూడేళ్లపాటు కనుమరుగైన ఈ అమ్మడు.. తెలుగు నిర్మాత దిల్ రాజుతో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ మళ్లీ వెలుగులోకి వచ్చింది. గతకొన్నిరోజుల నుంచి షీలా ఒక నిర్మాతతో సహజీవనం చేస్తోందంటూ ఇదివరకే వార్తలు షికార్లు చేశాయి. చివరగా ఆ నిర్మాత దిల్ రాజు అని తెలియగానే పెద్ద సంచలనంగా మారిపోయింది. వీరిమధ్య సంబంధం వున్నట్లు వచ్చిన వార్తలు దాదాపు నిజమేనని అనుకున్నారు.

అయితే తనకు, నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఎటువంటి సంబంధం లేదని... కనీసం తన దగ్గర అతని ఫోన్ నెంబర్ కూడా లేదని షీలా క్లారిటీ ఇచ్చేసింది. గతంలో నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘‘పరుగు’’ సినిమాలో ఈ అమ్మడు కథానాయికగా నటించిన విషయం తెలిసిందే! అప్పట్లోనే వీరిమధ్య ఎఫైర్ తారాస్థాయికి చేరుకుందంటూ బాగానే ప్రచారాలు జరిగిపోయాయి. అయితే ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని షీలా చెబుతున్నప్పటికీ... రూమర్లు మాత్రం ఆగకుండా ఇప్పటికీ వస్తూనే వున్నాయి. పైగా ఈమె ఒక్కసారిగా కనిపించకుండాపోయేసరికి.. దిల్ రాజు ఆమెను ఎక్కడో రహస్యంగా దాచి సహజీవనం చేస్తున్నాడని... ఆమె గర్భవతి కూడా అయిందనే వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. దీంతో ఈ అమ్మడు తెరమీదకు వచ్చి.. తనకు, రాజు మధ్య సంబంధం వున్నట్లు వస్తున్న వార్తలు పక్కా త్రాష్ అని ప్రకటన ఇచ్చేసుకుంది. ఇటువంటి వార్తల్లో అసలు వాస్తవమే లేదంటూ తేల్చి పారేసింది.

‘‘అసలు నిర్మాత దిల్ రాజు ఫోన్ నెంబరే నా దగ్గర లేదు. ఆయనతో చివరిసారిగా ‘‘అదుర్స్’’ సినిమా ఆడియో వేడుకలో మాత్రమే మాట్లాడాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయనతో కలవనేలేదు. అలాంటిది మా మధ్య సంబంధం వుందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అలాంటి ప్రచారాలను నమ్మకండి. అయినా ఇటువంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో..? ఎవరు సృష్టిస్తారో..? అర్థం కావడం లేదు’’ అంటూ ఆమె స్పష్టం చేసింది. అలాగే తాను గత ఏడాది కాలం నుంచి లండన్ లోనే వుంటున్నట్లు తెలిపింది. ఇన్నాళ్లవరకు సరైన స్ర్కిప్ట్ లభించక తాను సినిమాలు ఒప్పుకోలేదని.. మంచి క్యారెక్టర్ తో కూడిన కథతో తన దగ్గరకు ఎవరైనా వస్తే ఖచ్చితంగా తిరిగి సినిమాల్లో నటిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. అలాగే.. ఈ పుకార్లపై దిల్ రాజు స్పందిస్తూ.. హీరోయిన్ షీలాతో మాట్లాడి చాలా కాలమైందని, నిరాధారమైన వార్తలపై తానెలా కామెంట్ చేస్తానని తెలిపారు. మొత్తానికి వీరిద్దరి మధ్య వస్తున్న ఈ రూమర్లకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress sheela  producer dil raju  tollywood news  actresses affair news  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more