బాలీవుడ్ హాట్ ఐటం బాంబ్ గా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కు పరాభవం జరిగింది. ఆమెకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తాన్ని బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి పక్కన పెట్టేశాడు. సినిమాలో సన్నీ ఉంటే తాను నటించను అని తెగేసి చెప్పేసాడట. ప్రస్తుతం షూట్ అవుతున్న ‘ఉంగ్లీ’ సినిమా విషయంలో ఇది జరిగింది. బాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇమ్రాన్ హష్మీ తో ‘ఉంగ్లీ’లో ఓ ఐటం సాంగ్ పెట్టాలని యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకు హీరో కూడా ఒప్పుకున్నాడట. ఇక ఇమ్రాన్ పక్కన ఎవరైతే బాగుంటుందా అని బాగా చర్చించి.. చివరకు సన్నీ లియోన్ అయితే సెట్ అవుతుంది అని డిసైడ్ చేశారట.
ఐటం సాంగ్ లు, అందాల ఆరబోతలకు పిలిస్తే పలికే పేరుగా ఉన్న సన్నీ అయితేనే సరైన జోడిగా ఉంటుందని ఒకప్పటి ముద్దుల మగాడు... తిరిగి పాత అలవాటు పాటించినా కూడా ఏమి అనుకోదులే అని సన్నీ ఫిక్స్ అనేశారు. ఈ విషయం తెలుసుకున్న హష్మీ సన్నీ అయితే ఐటం పాట వద్దు అని చెప్పేశాడట. హాట్ బాంబ్ పక్కన ఉంటే తాను డాన్స్ చేయలేను అని చెప్పినట్లు సినిమా యూనిట్ లో ఒకరు వెల్లడించారు. దీతో ఇప్పుడు కొత్త మోడల్ లేదా పాపులర్ అయిన మరో హీరోయిన్ కోసం ‘ఉంగ్లీ’ టీం వెతుకుతోంది.
బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు ఉన్న ఇమ్రాన్ హష్మీ.., సన్నీ లియోన్ తో నటిస్తే తన పేరు దెబ్బ తింటుంది అని భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. అందువల్లే ఈ అందాల తారను వద్దన్నాడు అని తెలుస్తోంది. ఈ వార్త తెలిస్తే సన్నీ ఎలా ఫీల్ అవుతుందో అని ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఇమ్రాన్ తో కలిసి నటించేది ఎవరో అని బాలీవుడ్ లో మళ్ళీ చర్చ మొదలైంది. ముద్దులు పెట్టడంలో ఎక్స్ పర్ట్ అయిన హష్మీతో ఆడే ఐటం ఎవరో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more