Tamanna bhatia feeling bad her roles in movies praises bahubali her character

tamanna bhatia, tamanna bhatia latest news, tamanna bhatia hot photos, tamanna bhatia news, tamanna bhatia hot gallery, tamanna bhatia bahubali movie, bahubali movie news

tamanna bhatia feeling bad her roles in movies praises bahubali her character

చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఫీల్ అవుతోంది!

Posted: 10/21/2014 09:00 PM IST
Tamanna bhatia feeling bad her roles in movies praises bahubali her character

చిత్రపరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఏ అమ్మడు అయినా దేనికైనా రెడీ అంటూ ముందుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ మంచిదైతే గంతులేస్తారు కానీ.. అదే ఫెయిల్ అయితే మాత్రం ఎవ్వరికంట పడకుండా రహస్యంగా తిరుగుతుంటారు. తిరిగి కొత్త ఆఫర్లకోసం డైరెక్టర్ల - ప్రొడ్యూసర్లు - హీరోల వెంటపడటం... వారిని అప్పుడప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం లాంటివి మొదలుపెట్టేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ప్రస్తుతం తమన్నా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. స్టార్ డమ్ వున్నంతవరకు డేట్స్ ఇవ్వడానికిగానీ, రెమ్యునరేషన్ విషయంలోగానీ, ఎక్స్ పోజింగ్ విషయంలోగానీ కండిషన్లు పెట్టే తమన్నా... ఇప్పుడు అలా కాకుండా మళ్లీ కొత్త అమ్మాయిల ట్రాక్ లోకి చేరిపోయినట్లు మాట్లాడుతోందని అనుకుంటున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసిన మిల్కీ బ్యూటీ.. తన స్టార్ డమ్ పెరిగేకొద్దీ ఒక్కొక్క కండీషన్ ను పెట్టుకుందిపోయింది. అనంతరం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చుకుని, కొన్నాళ్లపాటు ఇటువైపు తిరిగి చూడలేదు. అయితే అక్కడ నటించిన సినిమాలు ఒక్కొక్కటి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న తరుణంలో మళ్లీ టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ‘‘ఆగడు’’ సినిమాలో నటించింది. అలాగే ‘‘బాహుబలి’’ చిత్రంలో ఒక పాత్రను కొట్టేసింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ మీద కన్నేసిన ఈ భామ.. హిందీలో వరుస ఫ్లాపులు రావడంతో అక్కడినుంచి తన దుకాణాన్ని తిరిగి తెలుగు చిత్రపరిశ్రమకు మార్చేసింది. ‘‘బాహుబలి’’ షూటింగ్ లో పూర్తిగా లీనమైపోయి, తన పాత్రవరకు మొత్తం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఫ్రీగానే వుంది. అయితే ‘‘బాహుబలి’’ సినిమాలో తాను నటిస్తున్న పాత్ర గురించి మాట్లాడిన ఈ మిల్కీ బ్యూటీ... కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇటీవలి కాలంలో తనకు లభించిన అతికొన్ని మంచి పాత్రలలో ‘‘బాహుబలి’’ సినిమా ఒకటి అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలోనే మట్లాడుతూ.. ‘‘ఆమధ్య చేసిన 100% లవ్, ఊసరవెల్లి సినిమాల తర్వాత నా మనసుకు నచ్చిన, మెచ్చిన పాత్రలు రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిలో కాస్త బెటర్ అనుకన్నవి ఎంచుకునే చేశాను. అయితే ప్రస్తుతం ‘‘బాహుబలి’’ చిత్రంలో మాత్రం మంచి పాత్రే లభించింది. అయిందేదో అయిపోయింది.. ఇకనుంచి మాత్రం సినిమాలు ఒప్పుకునేముందు చాలా కేర్ ఫుల్ గా వుంటాను’’ అని చెప్పుకొచ్చింది భామ! అంతేకాదు.. ‘‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’’ లాంటి సినిమా వస్తే తప్పకుండా నటిస్తానని... ప్రత్యేక పాత్రల్లో నటించాలనే కోరిక వుందంటూ తన మనసులోని మాటను పేర్కొంది. దీంతో ఈ అమ్మడు మాట్లాడిన మాటలు విని సినీ విశ్లేషకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

అవకాశాలు వచ్చాయి కదా అని ఓ ఎగేసుకుని బాలీవుడ్ కి చెక్కేసినప్పుడు ఇటువంటి బుద్ధిరాలేదా..? అంటూ అభిప్రాయపడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫీల్ అయితే ఏముంది..? పోవాల్సిన ఇమేజ్ ఎలాగో పోయింది..? ఇప్పుడు దానిని తిరిగి పొందేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదిలావుండగా.. రాజమౌళికి గాలం వేయడానికే ఈ అమ్మడు తనకు బాహుబలి చిత్రంలో మంచి పాత్ర లభించిందని చెబుతోందని వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  bahubali movie  tollywood news  bollywood movies  telugu news  rajamouli  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more