Actress sneha ullal torchered by unknown person in mumbai

sneha ullal, sneha ullal news, sneha ullal latest news, sneha ullal torchered, sneha ullal unknown person torchered, sneha ullal hot photos, sneha ullal hot photo shoot, salman khan, bollywood news, salman khan latest news, sneha ullal movies, sneha ullal flat, mumbai police

actress sneha ullal torchered by unknown person in mumbai

స్నేహ ఉల్లాల్ జీవితంలో ఎంటరైన అపరిచితుడు!

Posted: 10/20/2014 06:46 PM IST
Actress sneha ullal torchered by unknown person in mumbai

‘‘ఉల్లాసంగా ఉత్సాహంగా’’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ ఉల్లాల్.. మొదటి సినిమాతో సక్సెస్ సాధించడంతో మంచి కథానాయిక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు.. అటు బాలీవుడ్ లో కూడా ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా హీందీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చుకున్న ఈ అమ్మడు.. జూనియర్ ఐశ్వర్యగా కూడా పేరు సంపాదించుకుంది. రెండు పరిశ్రమల్లో ఎంట్రీ ఇచ్చుకున్న మొదటిసారే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. చాలాకాలం వరకు దానిని పదిలం చేసుకోలేకపోయింది. సినిమా ఆఫర్లు రాకపోవడం వల్ల ఒక్కసారిగా ఆమె పాపులారిటీ కిందిస్థాయికి దిగిపోయింది. దీంతో అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసుకోవడం లేదా ఖాళీగానే కాలాన్ని కాలక్షేపం చేసుకుంటూ వుండిపోయింది. ఈమెను ఎవ్వరూ అంతగా పట్టించుకునేవాళ్లు కాదు. కావాలసిన అందం వున్నప్పటికీ.. అవకాశాలు మాత్రం శూన్యం!

దీంతో ఈ అమ్మడు బయటికి ఎక్కువ రావడమే మానేసింది. ఎవ్వరితోనూ అంతగా కలిసేది కాదు కూడా! ఒక్కతే తన జీవితాన్ని ఏదో ఒకరకంగా నెట్టుకు వచ్చేది. అయితే ఇంతలోనే ఎవరో అపరిచితుడు ఈమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి చాలా టార్చర్ పెడుతున్నాడని తెలిసింది. అతనెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి పేరేంటో ఎవ్వడికి తెలియదు... కానీ నేరుగా ఈ అమ్మడి ఇంట్లోకి దూరి ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. కాదంటే నిన్ను చంపేస్తా’’నంటూ బెదిరిస్తున్నాడట! ముంబలోని బాంద్రా ప్రాంతంలో వుంటున్న ఈ అమ్మడి ఇంటికి ఈనెల 18వ తేదీన ఉదయం సమయంలో ఎవరో ప్రత్యక్షమై, ఇలా అల్లరి పెట్టాడని స్నేహ వాపోతోంది. అంతేకాదు.. ఈమె సెక్యూరిటీగార్డులు అతడిని ఎంత ఆపడానికి ప్రయత్నించినా.. వాళ్లతో గొడవ పడ్డాడట! ఆ వ్యక్తితో తన తండ్రి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయనపట్ల దురుసుగా ప్రవర్తించాడట! అయితే చుట్టుపక్కల వున్నవాళ్లు ఆ ఆకతాయిని దేహశుద్ధి చేశారని, చివరికి పోలీసులకు అప్పగించారని తెలిపింది.

ఈ సంవత్సరం జరిగిన వినాయకచవితి పండగ నుంచి ఆ ఆకతాయి ఈమెను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడని, ఎన్నోసార్లు ఫోన్లు కూడా చేసి తనను విసిగించాడని ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకోకపోతే స్నేహతోపాటు ఆమె కుటుంబాన్ని కూడా నాశనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడని తెలిపింది. ఈ విషయాన్ని అప్పట్లో పోలీసులకు తెలిపినా ఫలితం లేకపోయిందని చెబుతోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి కూడా ఈ విషయం ముందు చెప్పినట్లు వాపోయింది. ఇప్పుడైతే అతనిని దేహశుద్ధి, అరెస్ట్ చేయించాము కానీ.. జైలునుంచి విడుదలైన తర్వాత అతనితో ప్రాణహాని వుంటుందోమోనని నిత్యం భయాందోళనలకు గురవుతోందట ఈ అమ్మడు. అందుకే.. ఒంటరిగా ఇంటినుంచి బయటికి రావడమే మానుకున్నానని, అతనిలాగే మరెవరైనా తన జీవితంలో అపరిచితులు వస్తారేమోనని అనుక్షణం భయపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది ఈ అమ్మడు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sneha ullal  salman khan  mumbai unknown person  mumbai police  bollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more