Manchu vishnu to do a film with sampoornesh babu

sampoornesh babu, sampoornesh babu images, sampoornesh babu comedy, sampoornesh babu hrudaya kaleyam, hrudaya kaleyam movie download, latest news, tollywood, hyderabad, film news, manchu vishnu, manchu manoj, manchu laxmi, current teega movie, mohan babu

manchu vishnu ready to do movie with sampoornesh babu soon days : manchu vishnu own production house now to make film with sampoornesh babu

త్వరలో.. సంపూతో మంచు ఫ్యామిలి సినిమా

Posted: 09/18/2014 12:57 PM IST
Manchu vishnu to do a film with sampoornesh babu

గ్లామర్, హీరోయిజంకు పెద్ద పీట వేసే తెలుగు తెరపై ఆ రెండూ లేకుండా క్లిక్కుమన్నది ఎవరయ్యా అంటే సంపూర్ణేష్ బాబు అని ఠక్కున గుర్తుకువస్తుంది. ‘హృదయ కాలేయం’ అని వెరైటీ టైటిల్ పెట్టడంతో పాటు సినిమాను కూడా వెరైటీగా తీసి పర్లేదు అన్పించుకున్నాడు. ‘‘కొనడానికి నేను షాంపును కాదు.., సంపూని’’ అంటూ సీరియస్ డైలాగును సిల్లీగా చెప్పి.., అందర్ని నవ్వించిన సంపూ ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్త బిజీ హీరోగానే కన్పిస్తున్నాడు. ఆయనతో సినిమాలు చేసి అదృష్టం పరీక్షించుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. ఆ వరుసలో ముందుంది మంచు ఫ్యామిలీ అని చెప్పవచ్చు. కొందరు హీరోయిన్లను ఎంపిక చేసి వారిని పర్మనెంటుగా ఫ్యామిలీ హీరోయిన్లుగా చేసుకునే మంచు ఫ్యామిలీ తొలిసారి హీరోపై పడింది.

ఈ మద్య జరిగిన ‘‘కరెంటు తీగ’’ సినిమా ఆడియో కార్యక్రమంలో బాబు కన్పించటం ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది. ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన మంచు విష్ణు త్వరలోనే సంపూర్ణేషు బాబుతో సినిమా తీస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు మాత్రం రాలేదు. అయితే వెరైటీ టైటిల్ అదీకాక పాపులర్ అయి ఉండాలని భావించి సూర్య ఫేమస్ సినిమా ‘సింగం2’ టైటిల్ ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సంపూ కోసం సినిమా పేరు అంకెల్లో ముందు వెనక అతుకులు వేసి ‘సింగం123’ పేరుతో సినిమా తీస్తారట. ఇది కూడా కామెడిగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు సింగం సినిమాలానే ఇందులో కూడా బాబు పోలిస్ గెటప్ లో నవ్వించే డ్యూటీ చేస్తాడని ఫిలింనగర్ టాక్.

ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న మంచు ఫ్యామిలి, నేరుగా స్ర్ర్కీన్ పైకి రాకుండా ఇతరుల్ని ప్రయోగించి చూస్తోంది. ఆ కోవలోనే సంపూతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వల్ల సంపూకి కెరిర్ లో ఒక సినిమా పెరగటంతో పాటు, మంచు ఫ్యామిలికి మరో కొత్త సినిమా తీశామన్న ఆరాటం తగ్గుతుంది. త్వరలో మంచు మనోజ్ నటించిన ‘కరెంటు తీగ’ విడుదల కానుంది. మరి విష్ణు సంపూ అస్ర్తం ఎలా దూసుకెళ్తుందో చూడాలంటే ముందు సినిమా తెరకెక్కాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  manchu vishnu  tollywood  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more