Kajal agarwal rejects puri jagannath movie

Kajal Agarwal Rejects NTR movie, Kajal Agarwal Rejects puri movie, Kajal Agarwal Rejects puri ntr movie, Kajal Agarwal out from ntr movie, Kajal Agarwal Rejects, puri jagannath, ntr

the beautiful kajal agarwal rejected from the ntr puri jagannath latest movie. Kajal Agarwal Rejects puri ntr movie, Kajal Agarwal out from ntr movie, Kajal Agarwal Rejects, puri jagannath, ntr

ఎన్టీఆర్ కు హ్యండిచ్చిన కాజల్

Posted: 08/05/2014 03:54 PM IST
Kajal agarwal rejects puri jagannath movie

తమిళ, హిందీ సినిమాల్లో ఒక్కసారి ఆఫరొస్తే చాలు.. ఇక తెలుగులో నటించిన ఏ హీరోయిన్ ఐనా సరే... తెగ హడావిడి చేస్తుంటారు. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న కూడా బాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు అదేదో పెద్ద వరంలాగా భావించేస్తుంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వున్న కాజల్ కు ప్రస్తుతం తెలుగులో రాంచరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తప్ప మరో సినిమా చేతిలో లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యినట్లే.

అయితే ఈ సినిమా కాకుండా పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టును కాదనుకొని కాజల్ వెళ్లిపోయినట్లుగా తాజా సమాచారం. మొన్నటి వరకు కాజల్ కు ఒక్క సినిమా ఛాన్సు కూడా రాకపోవడంతో తెగ అల్లాడిపోయిన కాజల్ కు... ఎన్టీఆర్ హీరోయిన్ గా తన సినిమాలో అవకాశం ఇప్పించాడు. అయితే అన్నీ అనుకుని.. త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమైన ఈ సినిమాకు కాజల్ దూరమవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

అయితే తాజాగా ఈ అమ్మడికి రెండు హిందీ ప్రాజెక్టులతో పాటు, ఒక తమిళ సినిమా ఆఫర్ కూడా వచ్చాయంట. దీంతో అనుకోకుండా వచ్చిన ఈ అదృష్టాన్ని వదులుకోలేక వెంటనే ఒప్పేసుకుందట. దీంతో పూరీ సినిమాను వదిలేసుకుందట. పూరీ కూడా తన సినిమా విడుదల డేట్ ను ప్రకటించేసాడు కాబట్టి... ఇక షూటింగ్ ను ఆలస్యం చేయడానికి సిద్ధంగా లేడు.

అందుకే కాజల్ ను తీసేసి... వేరే హీరోయిన్ కోసం వెతుకులాటలో పడ్డాడట పూరీ. ఇందుకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ నటించబోయే ఆ హాట్ హీరోయిన్ ఎవరు అవుతారో త్వరలోనే తెలియనుంది. కాజల్ కు ఇక పూరీ, ఎన్టీఆర్ తరువాతి చిత్రాలలో నటించే అవకాశం కోల్పోయినట్లేనని అర్థమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more