New movie with simbu and nayan combination

New movie with Simbu and Nayan combination, Nayan acts with old lover Simbu, Simbu Nayan romance again in new movie

New movie with Simbu and Nayan combination

ఆవిడే మా ఆవిడ- నయనతారతో పాత ప్రియుడు!

Posted: 07/20/2014 11:54 AM IST
New movie with simbu and nayan combination

"ఇదు నమ్మాళ్" (ఆవిడే మా ఆవిడ) అనే టైటిల్ తో వస్తున్న తమిళ సినిమాలో శింబు, నయనతారలు జంటగా నటిస్తున్నారు.  ఇందులో విశేషమేముంది అని సినిమా ప్రియులెవరూ అనరు.  ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అన్యోన్యత ఏమిటో తెలుసు కాబట్టి.  

అరమరికలు లేకుండా తెరమీద సినిమా కోసం, తెర వెనుక తమకోసం ప్రేమను పండించుకున్నారన్న వార్తలు వాళ్ళిద్దరి మధ్య వచ్చి కూడా పది సంవత్సరాలైంది.  కానీ వాళ్ళిద్దరు మర్చిపోయినా సినీ ప్రేమికులు మర్చిపోలేదు.  పెదవుల పెనవేతలతో పాత్రలలో చక్కగా ఒదిగిపోయి నటించిన వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయి తిరిగి పది సంవత్సరాల తర్వాత కలిసి జంటగా నటించబోతున్నారంటే, ఇంతకాలం ఆనకట్ట వేసి వుంచిన వాళ్ళ ప్రేమ ఎలా కట్టలు తెంచుకుంటుందో అని  వాళ్ళిద్దరి లవ్ రెన్యూవల్ ని చూడటానికి ప్రేక్షకజనం ఉవ్విళ్ళూరుతోంది.  

ఒకసారి నటించిన జంట మరోసారి నటిస్తే వాళ్ళిద్దరి మధ్య కొత్తదనం పోయి అండర్ స్టాండింగ్ వస్తుందట.  అలాంటిది ప్రేమలో మునిగితేలిన జంటగా ప్రసిద్ధికెక్కిన ఈ జంట నటిస్తే అది నటనలా ఉండదని వాళ్ళని మళ్ళీ తెరమీద చూడటానికి తమిళ తంబీలు తెగ ఆరాటపడిపోతున్నారట.

ప్రేక్షకులను సినిమాకి రప్పించటానికి పబ్లిసిటీ చాలా అవసరం.  వచ్చిన తర్వాత అలరించటానికి తగ్గ కథ, కథనం, ఇతర మసాలాలు ఉంటే కొంతకాలం ఆడుతుందా సినిమా.  కానీ ఆ సినిమా మీద క్రేజ్ పుట్టించటమైతే అవసరమే.  అందుకు నిర్మాత దర్శకులు కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటారు.  అందులో ఒక పద్ధతే ఇలా సినీ జంటలను నిర్ణయించటం. 

వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ మాత్రమే కాకుండా ఇలా హిస్టరీ కూడా కలిస్తే నిర్మాతలకు పండగే మరి!

-శ్రీజ

ఆవిడే మా ఆవిడ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more