Varma low budget in ice cream movie fire on movie workers

varma low budget in ice cream movie, fire on movie workers, Ramagopal Varma, Ice Cream, Cost 2,11,832 Only, Tejaswi, Nacadeep, RGV

varma low budget in ice cream movie - fire on movie workers, Ramagopal Varma’s Ice Cream To Cost 2,11,832 Only. The director known for his blunt style, had conversations with the movie actors, technicians, equipment suppliers,

వర్మ ఐస్ క్రీమ్ తగ్గించాడు? రోడ్డునపడ్డ సిబ్బంది?

Posted: 07/18/2014 01:05 PM IST
Varma low budget in ice cream movie fire on movie workers

ప్రస్తుతం టాలీవుడ్ హిట్టైన సినిమాల్లో కూడా నిర్మాతలకు ఏమి మిగలటం లేదు. కోట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మాతకు భారంగా మారిపోయింది తెలుగుసినిమా. ఐస్ క్రీమ్ వర్మ బాగా తగ్గించాడు. .కేవలం రెండంటే రెండు లక్షలతో ఐస్ క్రీమ్ సినిమా తీసి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. .సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తెలుగు సినిమా టెక్నిక్ ను సమూలంగా మార్చివేసిన వర్మ....తాజాగా తెలుగు సినిమా బడ్జెట్ ట్రెండ్ ను కూడా మార్చివేశారు.

టాలీవుడ్ లో వర్మ ప్రయోగం సక్సెస్ అయ్యిందని నిర్మాతలు చాలా ఆనందంగా ఉన్నారు. కేవలం రెండు లక్షల పదకొండు వేల రూపాయలతో ఐస్ క్రీమ్ సినిమాను తీశారు వర్మ. ముందు అందరం కలిసి పని చేద్దాం...సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా పంచుకుందాం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు వర్మ.

ఐస్ క్రీమ్ షూటింగ్ లో రెగ్యులర్ గా వాడే లైట్లు,ట్రాలీలు,క్రేన్ లు,జిమ్మీజిప్ లు,స్టడీ క్యామ్ లు,హ్యారీ కెమెరాలు లాంటివి వాడలేదు. ఇవి వాడక పోవడం వల్ల చిత్ర బృందం సంఖ్య 90 శాతం తగ్గిపోయింది.కేవలం ఒకే ఒక ఫ్లోక్యామ్ కెమెరాతో ఐసీక్రీమ్ సినిమా షూటింగ్ ను ముగించారు వర్మ. షూటింగ్ వచ్చేముందు అందరు టిఫిన్ చేసి రావడం...మధ్యాహ్నాం కేరేజ్ తెచ్చుకోవడంతో ఖర్చు చాలా వరకు తగ్గిపోయింది. ఐస్ క్రీమ్ సినిమా షూటింగ్ చేసిన ఇంటి రెంట్...టీ,కాఫీ ఖర్చులు ఆ రెండు లక్షలు అయ్యిందని వర్మ తెలిపారు.

ఐస్ క్రీమ్ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అయ్యింది.ఐస్ క్రీమ్ లో తనకు రూపాయికి రూపాయి లాభం మిగిలిందని ఆ సినమా తీసిన రామసత్యనారాయణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు అనుకున్నట్టుగానే ఐస్ క్రీమ్ సక్సెస్ మీట్ లో చిత్రంలో పని చేసిన వ్యక్తులకు లాభాల్లో వాటా కింద పారితోషకాన్ని పంపిణీ చేశారు. జయాపజయాలు పక్కన పెడితే..చాలా విషయాల్లో టాలీవుడ్ కు రాంగోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేశారని విమర్శకులు భావిస్తున్నారు.

కానీ వర్మ బడ్జెట్ ప్రయోగం వల్ల .. సినిమాపై ఆధారపడి బతికే..చిన్న చిన్న కుటుంబాలు బాగా దెబ్బతిన్నాయి. నిర్మాతలకు బడ్జెట్ తగ్గించి, సినిమా షూటింగులకు పనిచేసే సిబ్బందికి అన్నం లేకుండా చేసాడని.. కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు. వర్మ సినిమాషూటింగ్ అంటే.. సినిమా సిబ్బంది.. దూరంగా జరుగుతున్నారు. తినటానికి అన్నం ఉండదు.. లేబర్ చార్జీలు చాలా తక్కువుగా ఇస్తారనే ఫిలింనగర్లో పనిచేసి సిబ్బంది అంటున్నారు.

నిర్మాతలకు బడ్జెట్ తగ్గించటం అంటే.. సినిమా యూనిట్ సభ్యుల పొట్టకొట్టడం కాదు., హీరోలు, హీరోలన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే, నిర్మాతలు సేప్ జోన్లో ఉంటారు. అంతేగానీ .. ‘‘ఏనుగులు పోయే దారిని వదిలిపెట్టి, చీమలు పోయే దారిని మూసినట్లుగా వర్మ ప్రయోగం ఉందని .. టాలీవుడ్ లోని సినిమా సిబ్బంది అంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు ఎక్కువ రోజులు నిలబడవని టాలీవుడ్ టాక్. వర్మ కొంచెం ఆలోచించవయ్యా!!!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more