చెట్టోటి అయితే విత్తనం మరోటి అవుతుందా అనే సామెత అక్కినేని నాగచైతన్యకు బాగా సరిపోతుంది. తన తాత, తన తండ్రి మంచి రోమాంటిక్ హీరోలు. సినిమాల్లో హీరోయిన్లే కాకుండా బయట లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా వీరికి ఎక్కవే. టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున కొడుకు నాగచైతన్య కూడా మంచి రొమాంటిక్ ఫెలోనే కానీ బయటకు కనిపించడు.
సినిమాల్లో ఎదైనా రొమాన్స్ సన్నివేశం ఉంటే హీరోయిన్ తో బాగా ఎంజాయ్ చేసే ఈయన ఇప్పుడు ఓ అమ్మడు తో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడని టాక్. ఇప్పటి వరకు ఎవరితో ఎఫైర్లు నడిపినట్లు వార్తల్లో లేని చైతూ ప్రస్తుతం ‘లైలా కోసం ’ సినిమాలో పూజా హగ్దేతో స్విజ్జర్లాండులో షూటింగులో ఉన్నాడు. ఈ సినిమా షూటింగు మధ్యలో గ్యాప్ దొరికితే చాలు ఈ అమ్మడుతో కలిపి షికార్లు చేస్తున్నాడట. అంతే కాదు తాజాగా వీరిద్దరు కలసి పారా గ్లైడింగ్ చేశారు.
ఆ ఫోటోలను పూజా ట్విట్టెర్ ద్వారా అభిమానులకు చేరవేసింది. సోషల్ మీడియాలో రిలీజ్ చేసి నాగచైతన్య వల్లే పారాగ్లైడింగ్ చేయగలిగానని చెప్పుకొచ్చింది. నిజానికి పూజాకి ఎత్తయిన ప్రదేశాలంటే చాలా భయం అని, చైతూ ధైర్యం చెప్పడంతోనే చేశానని, ముందు భయపడినా ఆ తర్వాత మంచి అనుభూతి లభించిందని చెప్పుకొచ్చింది.
చైతూ మంచి కో-స్టార్ కావడమే కాదు చాలా కో-ఆపరేటివ్ గా ఉంటాడని పొగడ్తల్లో ముంచేసింది. చైతూతో మంచి అనుభూతి పొందుతున్న ఈ అమ్మడు వ్యవహారం చూస్తుంటే ఆయన పై మనస్సు పారేసుకుట్లే ఉంది కదూ. ఏ విషయం అయినా వారు స్విస్ నుండి వస్తేగానీ తెలియదు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more