Chiranjeevi 150th movie with boyapati srinu

chiranjeevi 150th movie with boyapati srinu, Boyapati Srinu Next Film With chiranjeevi, Boyapati-Ram Charan Combo Film Details, Ram Charan next movie in Boyapati Seenu Direction, BOYAPATI SRINU UPCOMING FILMS, allu arjun in boyapati direction, Allu Arjun, Boyapati Srinu

chiranjeevi 150th movie with boyapati srinu

మెగా ఫ్యామిలీతో ఫిక్సయిన బోయపాటి

Posted: 07/09/2014 10:02 AM IST
Chiranjeevi 150th movie with boyapati srinu

చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి మరో దర్శకుడు వచ్చి చేరారు. ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రంపై ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘సింహ’, ‘లెజెండ్’ వంటి వరుస చిత్రాల తర్వాత బోయపాటి ఫుల్ ఫాంలో ఉండటంవల్ల ఈ దర్శకుడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది.

త్వరలోనే రాంచరణ్ తో బోయపాటి ఓ చిత్రం తెరకెక్కించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాంచరణ్ కోసం బోయపాటి ఓ పక్కా కమర్షియల్ మాస్ మసాలా స్ర్కిప్టును సిద్ధం చేసాడని తెలిసింది. అయితే చరణ్ కు ఆ కథ నచ్చినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లుగా తెలిసింది. కానీ తన తండ్రి కోసం ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమని చరణ్ కోరడంతో... బోయపాటి ఓ పవర్ ఫుల్ కథను చిరు, చరణ్ లకు వినిపించాడట. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే స్క్రిప్టు రెఢీ చేయమని చెప్పారట చరణ్. ప్రస్తుతం బోయపాటి కథను పక్కాగా సిద్ధం చేసే పనిలో పడ్డాడని తెలిసింది. కానీ ఈలోపు మరే ఇతర దర్శకుడు, రచయితైనా మంచి కథతో చిరును సంప్రదిస్తే బోయపాటికి అవకాశం పోయినట్లే మరి.

ఒకవేళ చిరు ప్రాజెక్టు బోయపాటికి దక్కకపోయినా కూడా తన కొడుకు చరణ్ తో కలిసి ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నాడు బోయపాటి. చరణ్, అల్లు అర్జున్ లకు విడివిడిగా ఓ కథను చెప్పాడంట బోయపాటి. ఆ కథలు బన్నీ చెర్రీలకు నచ్చాయంట. కాబట్టి... చిరు ప్రాజెక్టు బోయపాటికి దక్కకపోతే మెగా ఫ్యామిలీ హీరోలో ఎవరితోనైనా సినిమా మాత్రం పట్టాలెక్కడం ఖాయమని తెలిసింది. మరి బోయపాటి దర్శకత్వంలో నటించబోయే ఆ మెగా ఫ్యామిలీ లక్కీ హీరో ఎవరో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more