Pawan kalyan power test

Pawan Kalyan power test, Rey movie, Basanti movie, Brahmanandam, Sai Dharam Tej,

Pawan Kalyan power test, Rey movie, Basanti movie

పవన్ పవర్ కి ఎన్నిసార్లు మచ్చు చూస్తాం ?

Posted: 02/11/2014 10:55 AM IST
Pawan kalyan power test

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అంటుంది విజయం సాధించి చలనచిత్రం.  సినిమా విజయానికి అందులో పనిచేసిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వారి వారి స్థాయిలో వారి వంతుగా ఉంటుంది.  అటువంటి విజయాన్ని ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా ఆపాదించటం ఎంత అసమంజసమో అలాగే అపజయానికీ ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా బాధ్యులను చెయ్యటం సరైనది కాదు.  పూర్తి బాధ్యత మాత్రం దర్శకుడిదే అని చెప్పుకోవచ్చు.  ఎందుకంటే ముందుగా ఆ సినిమాను తన మనసులో నిర్మించుకుని దానికనుగుణంగా ఫిల్మ్ లోకి ఎక్కించవలసినవాడు, దానికి తగ్గట్టుగా నటీనటులకు సన్నివేశాన్ని వివరించి చెప్పి వాళ్ళ చేత నటింపచేసేవాడు దర్శకుడే కనుక. 

అయితే సినిమాలలో ఎన్నో నమ్మకాలు పెట్టుకోవటం వలన ముహూర్తం పెట్టుకోవటం, పూజలు చెయ్యటం, పెద్దవాళ్ళను పిలవటం, వాళ్ళ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను అందుకోవటం చేస్తుంటారు.  అలాగే పవన్ కళ్యాణ్ పవరేంటో అర్థమైంది కాబట్టి రెండు ఆడియా విడుదలలకు ఆయనను పిలవటం జరిగింది.  ఒకటి మేనల్లుడు సాయిధర్మతేజ రే చిత్రానికి, మరొకటి బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ బసంతి చిత్రానికి. 

ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కాలు పెట్టిన చోట బంగారం పండుతుందని, లేదంటే ఆయనది ఐరన్ లెగ్ అని అర్థమౌతుందని కొందరు భావిస్తున్నారట! బంగారాన్ని ఎన్నిసార్లు గీచి మచ్చు చూస్తారు?  ఒక్కసారి చూస్తే దాని కేరట్లు ఎంతో అర్థమైపోతుంది కదూ!  లేదూ, పొద్దున్నే లేవగానే ఒకసారి మళ్ళీ గీచి చూస్తాను అంటే అది కొన్నాళ్ళకి అరిగి పోయి కంటికి కనపడకుండా పోతుంది! 

పవన్ కళ్యాణ్ పవరేమిటో నిరూపించటం జరిగిపోయింది.  ఇక అన్నిట్లో దాన్ని నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుని రంగంలోకి దిగలేదు కదా!  పైగా ఆయనెప్పుడైనా తన పవర్ గురించి ఎవరితోనైనా సవాల్ చెయ్యటం జరిగిందా?  మనమే ఆయనకు శక్తులు ఆపాదించి, దానికి అనుగుణంగా మాకు ఫలితాలనివ్వమనటం అన్యాయం కదూ!  పైగా పవన్ పవర్ కి ఇదో పరీక్షలాగా చూడటం సరైనది కాదని ఒప్పుకుంటారు కదూ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more