
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతరుగా వెండితెర పై ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ చాలా సినిమాల్లో నటించినా ఒక్క హిట్టు కూడా రాకపోవడంతో ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శ్రుతి హాసన్ కి ఆ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. దాంతో ఈ అమ్ముడుకి అవకాశాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీగా ఉంది. తాజాగా పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్ తో తీయబోయే ‘‘ ఇద్దరమ్మాయిలు ’’ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలక్ట్ అయింది. కానీ తాజాగా అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం ఏంటని శ్రుతి హాసన్ ని అడిగితే బన్నీతో నటించడానికి నాకు కాల్షీట్లు లేవని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నానని, అవకాశం కోల్పోయినందుకు బాధగా కూడా లేదని, పనితో నేను చాలా బిజిగా ఉన్నాననీ, బాధ పడేందుకు తీరికలేదు అని చల్లని కబుర్లు చెబుతూ సెలవిచ్చింది.
కానీ సినీ జనాలు మాత్రం... శ్రుతి హాసన్ కంటే అల్లు అర్జున్ కొద్దిగా పొట్టిగా ఉంటాడు, ఆయనతో జోడీ కుదరదనీ భావించే సినిమా నుండి తప్పుకుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏంటంటే... సీనియర్ హీరో రవితేజ బలుపు చిత్రంలో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.