
తనూ శ్రీ దత్తా ఈ అమ్మడు పేరు వినగానే కుర్రకారు గుండెల్లో నరాలు జివ్వు మంటాయి. తెలుగులో ఆ మధ్యకాలంలో బాలక్రిష్ణ సరసన వీరభద్ర సినిమాలో నటించిన ఈ అమ్మడు తరువాత బాలీవుడ్ కే పరిమితం అయ్యి అక్కడ ఉన్న అందాలన్నీ ఆరబోసి చూపించడానికి ఏమీ (అవకాశాలు ) లేక ప్రస్తుతం ఖాళీగా ఉంటుంన్న ఈ భామ మనస్సు ఆద్యాత్మికం వైపు మళ్లినట్లుంది.. ఎలాగు ఖాళీగా ఉంది కాబట్టి గుళ్ళు గోపురాలు తిరిగి ఏకంగా గుండు గీయించుకుంది. ఈ గుండుకి పెద్ద స్టోరీ ఉన్నదని కూడా చెబుతుంది.
"పదేళ్ళు సినిమా రంగంలో ఉన్నాను. ఎన్నెన్నో ఒత్తిడులు, నిత్యం షూటింగ్‌లు, సెట్‌లో లైట్లు.. మరెన్నో కారణాల వల్ల నేను విసిగిపోయాను.అందుకే గుండు గీయించుకున్నాను అంది.
అలాగే నేను చాన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగాను. హిమాలయాలకు కూడా వెళ్ళాను. కానీ నాకు ఇంకా ఏదో లోటుగానే అనిపించింది. అందుకే గుండు గీయించుకున్నాను. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పిందీ తనుశ్రీ దత్తా. ఇక వీరి బాటలో భవిష్యత్తుల్లో ఇంకెంతమంది హీరోయిన్స్ పయనిస్తారో చూడాలంటోంది బాలీవుడ్ మీడియా.