
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'జులాయి' పై హీరో తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ అసంతృప్తితో ఉన్నాడా? ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి కారణం ఇదేనా? మొదల జూలై 13 న విడుదల అవుతుందన్న ఈ సినిమా దాదాపు నెల రోజులు వాయిదా పడటానికి రీ షూట్ కారణమౌతోందా? జులాయి చూసిన అల్లు అరవింద్ ఈ సినిమాలో కొన్ని మార్పుల సూచించినట్టు తెలుస్తోంది. ఈ మార్పులకు దర్శకుడు కూడా ఓకే చెప్పాడనేది మరో విశేషం.
రచయితగా మంచి పేరు ఉన్నప్పటికీ దర్శకుడిగా తిరుగులేని విజయం కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతగా అరవింద్ సీనియారిటీకి వేల్యూ ఇస్తూ రీ షూట్ పనిలో పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఏకంగా నెల రోజుల వెనక్కు వెల్లిపోయింది. అయితే ఈ విషయంపై ఎటువంటి ధ్రువీకరణ లేదు.