
సినీ పరిశ్రమకు చెందిన ఏ ఇద్దరు పెండ్లి చేసుకున్నా వారి సంసారం చివరి వరకు కొనసాగదని చాలా మంది అంటుంటారు. అలా జరిగిన సంఘటనలు కూడా మనం అప్పుడుడప్పుడు చూస్తుంటాం. ఈ మధ్యనే ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్న టాలీవుడ్ ఫ్యామిలీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న స్నేహ గుర్తుందా ? ఈమె తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే. అప్పటి నుండి అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటున్న వీరి పై తమిళ తంబీలు ఓ పుకారు లేపారు.స్నేహా – ప్రసన్నలు ఇద్దరు విడిపోయారంటూ తమిళ పత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించడమే కాకుండా, పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా స్నేహా ప్రసన్న విడిపోతారు మీకు తెలుసా అంటూ ఎస్సెమ్మెస్ లు పంపుతూ, సమాధానం ఫలానా నెంబర్ కి పంపండి అని మరీ ప్రచారం చేస్తున్నారు.
అదేంటయా.. అంటే ఆషాఢమాసానికి స్నేహ తన పుట్టింటికి వెళ్లింది. కనుక అత్తవారింటిని...అంటే భర్తను విడిచి తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాన్ని తంబీలు ఇలా రాసిపారేశారు. ఇది నిజమేనా అనుకున్న చాలామంది లోపల మేటర్‌ను చూస్తే మరోలా ఉంది. వీరిద్దరు ఓ కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటించారు. దాని తాలూకు పోస్టర్లలో స్నేహ వెళ్లి పోతున్నట్లు, ప్రసన్న వెంటబడ్డట్లు ఉన్నది. ఇది చూసిన జనాలు నిజమోనేనని అనుకొని అసలు విషయం వేరేలా ఉండటంతో వారి అభిమాను ఊపిరి పీల్చుకున్నారు. తమిళ తంబీలు చేసిన ఈ పుకార్ల పై కొన్ని విర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.