
తన రెమ్యునేషన్ పై వస్తున్న వార్తలకు,గాసిప్ లకు సమాధానంగా ప్రకాష్ రాజ్ తాజాగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో..."నేను రోజుకు పదిలక్షలు రెమ్యునేషన్ గా తీసుకున్నానంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి వింటూంటే చాలా కోపంగా ఉంది. నాన్సెన్స్....మీకు ఎంత ధైర్యం నేను మరీ అంత తక్కవ రేటుకు వస్తానని రాయటానికి...గ్రో అప్ గైస్"అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.
పూరీ జగన్నాధ్ బద్రీలో ప్రకాష్ రాజ్,పవన్ కళ్యాణ్ ఇద్దరూ పోటా పోటీగా ..నందా..నందా..నందా అంటే...నువ్వు నందావైతే నేను బద్రీ..బద్రీనాధ్ అంటూ చెప్పిన డైలాగులు ఎవరూ మర్చిపోరు. మళ్లీ వీరిద్దరూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని సమాచారం. ప్రత్యేకమైన మ్యానరిజంతో ప్రకాష్ రాజ్ పాత్రను తీర్చిదిద్దాడని,అది విన్న ప్రకాష్ రాజ్ వెంటనే ఓకే చేసాడని చెప్తున్నారు.