సౌత్ లో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకున్న తమన్నా బాలివుడ్ లో బోర్లా పడింది. అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ అన్నట్లుగా., ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. హిందీ తెరపై భాటియా భామ నిలవలేకపోయింది. తెల్లతోలుకు తెగ ఆఫర్లు వస్తాయని వెళ్తే ఇప్పుడక్కడ అంత లేదని తెలుసుకుంది. ఇంకేముంది తిరిగి లగేజి సర్దుకుంటోంది. మకాం సౌత్ కు మార్చేసేందుకు చకచకా ప్లాన్ వేసుకుంటోంది. సరైన ఆఫర్లు రాకపోవటంతో ఈ బాలివుడ్డు మనకేందుకు అనుకుంటోందట మిల్కీ బ్యూటి. దీంతో ఐ యామ్ బ్యాక్ అన్నట్లుగా తిరిగి తెలుగు, తమిళ తెరలపై తళుక్కుమనేందుకు తన్నుకుంటూ వస్తోంది.
ప్రస్తుతం తెలుగులో తమన్నా పెద్ద సినిమాలే చేస్తోంది. ఇందులో ఆగడు సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక రాజమౌళి క్రియేషన్ బాహుబలిలో కూడా మిల్కీ మ్యాజిక్ చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాతో తనకు మరింత మహర్ధశ వస్తుందని చాలా ఆశగా ఉంది. ఇందుకోసం చాలా కష్టపడుతోంది కూడా. అటు మరో సినిమా కూడా చేసేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఇంకో ఏడాది పాటు బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని డైరీలో పేజీలు ముందే నింపేసింది. ఆగడు సినిమా విడుదల అయితే వచ్చే రెస్పాన్స్ బట్టి అమ్మడి అదృష్టం తేలిపోనుంది. తెరపై వెలుగులు వస్తాయా.. లేక వెలిసిపోతుందా ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
"శ్రీ’’ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన తమన్నా మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలా మెగా ఫ్యామిలీతో పాటు ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలతో సినిమాలు చేసింది. అయితే కొద్దికాలం క్రితం గంపెడాశలతో బాలీవుడ్ ఇండస్ర్టీకి వెళ్లింది. అక్కడ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే సెటిల్ అయిన హీరోయిన్లు చాలామంది ఉండటంతో.., వారితో బుక్ చేసుకున్న సినిమాలు చేయటంలో అంతా బిజీగా ఉన్నారు. ఇక వాటికోసం ఆగితే ఉన్న సమయం వృధా అవుతుందని గ్రహించి వెనక్కి వచ్చేస్తోంది. తిరిగి పిలుపు వస్తే వెళ్దాం.. లేకపోతే ఇక్కడ ఎలాగూ మంచి పేరు ఉంది కాబట్టి కొనసాగుదాం అని అనుకుంటోంది. సో.. తమన్నా మిల్కీ బ్యూటియే కాదు.., టాలెంటెడ్ గాల్.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more