
బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబుసు ప్రేమాయణం గురించి దాదాపుగా తెలియని వారుండరు. జాన్ అబ్రహం, బిపాసా అంటే ఈ కాలం ఓ లైలా మజ్ను లాగా చెప్పుకునే స్థాయికి వారి ప్రేమ వెళ్ళింది. ఏమైందో ఏమో కానీ వీరిద్దరు అనుకోకుండా విడిపోయారు. ఇప్పుడు ఈమె ఆ ప్రేమ గురించి మరచిపోయింది కానీ, తన చిన్ననాటి ప్రేమ సంగతులు చెబుతోంది. అసలు ఈ ప్రేమ అనేది నాకు 15 ఏళ్ళకే పుట్టింది. న్కూల్లో ఉన్నప్పుడే ఒకబ్బాయి నన్ను ప్రేమించాడు. మనిషి చాలా మంచివాడు. మార్వాడీ కుటుంబం. అమ్మకు చెబితే పిల్ల చేష్టలని కొట్టిపారేసింది. కానీ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంటానంటే అమ్మ ఆశ్చర్యపోయింది. తను శాఖాహారి.. నేను కూడా అలా మారిపోయాను. కొన్నాళ్ళపాటు ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని తిరిగాం. ఐతే ఆ తర్వాత తేడా వచ్చి మేం విడిపోయాం.. అమ్మ చాలా హ్యీపీగా ఫీలయిందంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.