
ఈ మధ్యనే బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన ‘‘డర్టీపిక్చర్’’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని దక్షిణాది లో కూడా రీమేక్ చేయాలని దర్శకురాలు ఏక్తాకపూర్ చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తుంది. కానీ సరైన మంచి గ్లామర్ ఉండే హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే మలయాళంలో సిల్క్ స్మిత పాత్రలో అందాలను ఆరబోయడానికి సనాఖాన్ రెడీ అని ప్రకటించేసింది.
ఇక తెలుగులో నటించడానికి నవరసాలు అన్నీ ప్రభుదేవాకి ఇచ్చేసి, చీకేసిన మామిడి పండులా ఉన్న నయనతార తమిళ, తెలుగు భాషల్లో సిల్క్ స్మిత రోల్ చేసేందుకు అందాల తార నయనతార నో చెప్పేసింది. ఆ తరువాత నమిత తెరపైకి వచ్చింది. సిల్క్ స్మిత రోల్ తాను చేస్తానని నమిత నిర్మాతలను వేడుకుంది. కానీ నిర్మాతలు మాత్రం నమిత సిల్క్ కాదు.. బల్క్ క్యారెక్టర్ చేయొచ్చునని చెప్పి మెల్లగా జారుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. నమిత సిల్క్ స్మిత పాత్రకు అందాలు ఆరబోసినా.. చూసేందుకు అభిమానులు జడుసుకుంటారని టాక్. ఎందుకంటే అమ్మడు భారీగా బాడీని పెంచేసింది. ఎక్స్‌పోజింగ్‌కు తావులేకుండా నమిత బాడీ బల్క్‌గా తయారైందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. మొత్తానికి నమిత 80 కేజీలు పెరిగిందట. దీంతో సిల్క్ క్యారెక్టర్ తాను చేస్తానని పారితోషికం కూడా తక్కువగా తీసుకుంటానని నమిత ఎంత చెప్పినా నిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఈవిడని పెట్టుకుంటే సిల్క్ స్మితా సినిమా కాదని, షకీలా సినిమా లాగా ఉంటుందని అనుకుంటున్నారు.