
రీమాసేన్...దాదాపు దశాబ్దం కిందట స్క్రీన్ కు పరిచయం అయ్యి...బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్...ఇలా ఏదో ఒక ఇండస్ట్రీలో ఒకటీ అర అవకాశాలతో కెరీర్ నెట్టుకొస్తున్న హీరోయిన్. ఈ మధ్యనే వివాహం చేసుకొన్న ఈ బెంగాలీ భామ పెళ్లి తర్వాత కూడా 'గ్యాంగ్స్ ఆప్ వసేపూర్' అనే సినిమాలో నటించింది. తన పాత పరిచయాలతో ఈ అవకాశాన్ని సంపాదించుకొన్న రీమా, ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉంది. దీంతో మళ్లీ తన కెరీర్ ఒక గాడిన పడుతుందని రీమా ఆశిస్తోంది.
అయితే ఈ సినిమాలో రీమా కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ బెడ్రూమ్ సన్నివేశాలపై తన భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడని రీమా అంటోంది. అది కూడా ఆయన మనసులో ఆ సీన్ పై నొచ్చుకొన్నాడని రీమా అభిప్రాయపడుతోంది! దీంతో ఇకపై సినిమాల్లో పడక గది సీన్లకు దూరంగా ఉంటానని రీమా స్పష్టం చేస్తోంది. భర్తకు నచ్చిన రీతిలో నడుచుకోవడం వరకూ బాగానే ఉంది కానీ, ఇలాంటి షరతులు పెడితే ఈమెకు ఇప్పుడు వస్తున్న అవకాశాలు కూడా పకలరిస్తాయా? అనేది అనుమానమే!