
మెగా స్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయను...నాని లాంటి చిన్న హీరోలతోనే వారితోనే చేస్తాను అని ఈగ సక్సెస్ టూర్లలో పదే పదే వ్యాఖ్యానిస్తున్న రాజమౌళి అలా అనడానికి అనేకారణాలు ఉన్నాయంటున్నారు సినీ జనాలు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి మెగా ఫ్యామిలీ చేసిన నిర్వాకం వల్లనే రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2009లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి ‘మగధీర'చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 హిట్ చిత్రంగా నిలిచింది. దీనికి కారణం రాజమౌళి దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అని అందరూ అనుకున్న విషయం తెలిసిందే.
అయితే చిరు ఫ్యామిలీ మాత్రం ఆ క్రెడిట్ అంతా రామ్ చరణ్‌కే దక్కేలా పబ్లిసిటీ స్టంట్ చేశారని, మెగాస్టార్ వారసత్వం వల్లే సినిమా హిట్టయిందనే ఒక వాతావరణం సృష్టించి, రాజమౌళికి ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేశారని, ఆ కారణంగానే రాజమౌళి తన పంథాను మార్చుకున్నాడని అనుకుంటున్నారు. తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకోవడానికి సునీల్ తో సినిమా తీసి కూడా హిట్టు కొట్టాడని, తాజాగా హీరోనే లేకుండా ‘ఈగ' చిత్రం తీసి సినిమా హిట్ కొట్టి దర్శకుడిలో సత్తా చాటుకున్నాడని అనుకుంటున్నారు.
అందుకే ఆ తరువాత నుండి రాజమౌళి మెగా ఫ్యామిలీ హీరోలంటేనే ఒక రకమైన ఫీలింగ్ లో ఉన్నాడని, అందుకే వారితో సినిమాలు చేయడం లేదని సినీ వర్గాల టాక్.
