
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ భారీ విజయం సంపాదించుకోవడమే కాకుండా, సినీ ఇండస్ట్రీ కలెక్షన్ల రికార్డులను కూడా తిరగరాయబోతుందనే ప్రచారం సాగుతుంది. ఈ చిత్రం నేటితో యాభైరోజులు అత్యధిక సెంటర్లలో పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం పై తాజాగా ఓ వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లబోతుందట. దీనికి ఓ కారణం కూడా ఉందంటున్నారు సినీ జనాలు.
గబ్బర్ సింగ్ చిత్రానికే హైలెగ్ గానిలిచిన కామెడీ సీన్ అంత్యాక్షరి సీన్. ఈ సీన్ కారణంగా ఈ సినిమా 14 కోట్లు కోల్పోవలసి వస్తుందట. ఎదెలాగంటే... ఈ సీన్ కోసం చాలా సినిమాల్లోని సాంగులను ఉపయోగించారు. అయితే తమ పాటలను వాడుకున్నందుకుగాను ఆయా పాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు కాపీరైట్ యాక్ట్ ద్వారా తమ వాటా కోరేందుకు సిద్ధం అవుతున్నారని, 100 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రంలో 14 శాతం డిమాండ్ చేస్తున్నారని ఓ పుకారు షికారు చేస్తోంది. మరి దీనిని పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
