
మరో కొద్ది రోజుల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్ళి జరగనుందనే విషయం తెలిసిందే. కానీ రామ్ చరణ్ మాత్రం పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఇది నిజమేనా అంటే అవును నిజమే ? సహజీవనం నిజమే కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో ? ఇంతకీ అసలు విషయం ఏంటేంటే...
తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ లో ‘జంజీర్’ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా పాత్రలు వివాహం కాకుండా సహజీవనం చేసే వ్యక్తులుగా నటిస్తున్నారు. వీరి రొమాన్స్ ని దర్శకుడు అపూర్వ లఖియా వెండి తెర వేడిక్కేలా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ట్రెండ్ కి అణుగుణంగా అప్పటి జంజీర్ ని మార్చి మరీ తెరకెక్కిస్తూండటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అమిత్ మెహ్రా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో హాట్ రొమాన్స్ ఈ చిత్రంలోనే కనపడుతుందని అంటున్నారు.
