Vinaya Vidheya Rama – Boyapati Mark Again ! ‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘వినయ విధేయ రామ’ ‘వినయ విధేయ రామ’ Mega Power star Ramcharan action episodes right from his dialogue delivery is resembled to be a Boyapati flavoured movie for sure. Product #: 89493 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘వినయ విధేయ రామ’

  • బ్యానర్  :

    డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌

  • దర్శకుడు  :

    బోయపాటి శ్రీను

  • నిర్మాత  :

    డీవీవీ దానయ్య

  • సంగీతం  :

    దేవి శ్రీ ప్రసాద్‌

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు

  • నటినటులు  :

    రాంచరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు

Vinaya Vidheya Rama Moive Review

విడుదల తేది :

2019-01-11

Cinema Story

ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, రామ్‌ చరణ్‌ ఐదుగురు అన్నదమ్ములు.. ఈ అందమైన కుటుంబంలో అందరి కన్నా చిన్నవాడు రాం కొణిదెల. అత‌నంటే అంద‌రికీ ఇష్టం. అలాగే కుటుంబం అంటే రాం కూడా చాలా ఇష్టం. రాం పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను రాం పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది.

అది నచ్చని పరశురాం.. రాం కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్ లో ఉన్న మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రాం కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రాం ఎలా ఎదుర్కొన్నాడు?. రాంచరణ్‌ని ‘వినయ విధేయ రాముడి’గా బోయపాటి ఎలా చూపించారు.? మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు.? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాలంటే చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

cinima-reviews
‘వినయ విధేయ రామ’

విశ్లేషణ

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా అన‌గానే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. అవి రెండూ పుష్క‌లంగా ఉన్న సినిమా `విన‌య విధేయ రామ‌`. న‌లుగురు అనాథ‌లు క‌లిసి పెంచుకున్న మ‌రో అనాథ రామ్‌. సొంతంగా ఆసుప‌త్రి ఉన్న డాక్ట‌ర్ వీరికి ఆశ్ర‌య‌మిస్తాడు. కొన్నేళ్ల పాటు న‌లుగురు అన్న‌ద‌మ్ములూ క‌లిసి త‌మ్ముడిని చదివించుకుంటారు. కానీ ఒక సంద‌ర్భంలో త‌మ్ముడు త‌న అన్న‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల‌ని చ‌దివిస్తాడు.

అయితే ఈ మొత్తం చిత్రంలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. త‌న హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. రాంచ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. మొత్తానికి మాస్ హీరోగా రాంచరణ్ ను చూపించాలన్న ఆసక్తిగత బోయపాటి హింసాను మాత్రం అమాంతం పెంచేశాడని అనిపించక తప్పదు.

నటీనటుల విషాయానికి వస్తే..

ర‌ంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఒక ఎగ్రెసివ్ పాత్ర చేశాడు. రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా అనేక కోణాల్లో సాగుతుంది. అన్నింటిక‌న్నా ఫైట‌ర్ మాత్ర‌మే ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు నచ్చుతాయి. కియారా అడ్వాణీ అందంగా క‌నిపించింది. అయితే, ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ముఖ్యంగా ప్ర‌శాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆర్య‌న్ రాజేష్ కూడా ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు. రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. బాలీవుడ్ నుంచి వివేక్‌ను తీసుకొచ్చినందుకు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్లో విల‌న్‌ డామినేష‌న్ క‌న‌ప‌డ‌టం బోయ‌పాటి స్టైల్‌. అదే ఈ సినిమాలోనూ కొన‌సాగింది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సినిమాలో నిర్మాణ పరంగా బాగుంది. సినిమా అద్యంతం రిచ్ గా వుంది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు మాస్‌ అడియన్స్ కు న‌చ్చేలా ఉన్నాయి. పాట‌ల్లో సాహిత్యం, బీట్ క‌న్నా రాంచ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. రంగ‌స్థలంలో పెద్ద‌గా స్టెప్‌లు వేసే అవ‌కాశం రాని చెర్రీ ఇందులో ఆ లోటు తీర్చుకున్నాడు.

సంభాష‌ణ‌ల్లో ప‌దునుంది. రామ్ కొ..ణి..దె..ల‌.. అంటూ చెప్పే డైలాగ్‌లు మాస్ కు బాగా న‌చ్చుతాయి. క‌థ‌కుడిగా బోయ‌పాటి.. రామ్ కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌ు అని అనిపిస్తుంది. కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు అదనపు అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సినిమా మొత్తం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో మాస్ అడియన్స్ ను టార్గెట్ చేసి తీసినట్లుగా వుంది.

 

తీర్పు..

మాస్ సినిమాల దర్శకుడి మరో మాస్ చిత్రం.. మాస్ హీరోగా రాంచరణ్ ను ఎలివేట్ చేయడంలో హింసకు అధిక ప్రాధాన్యమిచ్చి చిత్రం వినయ విధేయ రామ..చరణ్ అభిమానులకు పండగ విందు..

చివరగా... మాస్ ఇమేజ్ తో అడియన్స్ ను అకట్టుకునే బోయపాటి చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh