Aravindha Sametha Jr.NTR delivers another fine performance ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘అరవింద సమేత వీరరాఘవ’ ‘అరవింద సమేత వీరరాఘవ’ Aravindha Sametha Veera Raghava makes a decent one time watch because of the top notch performances by NTR and the other lead actors. Emotional drama has been well narrated. Product #: 88837 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘అరవింద సమేత వీరరాఘవ’

  • బ్యానర్  :

    హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌

  • దర్శకుడు  :

    త్రివిక్రమ్ శ్రీనివాస్

  • నిర్మాత  :

    ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)

  • సంగీతం  :

    తమన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    పీఎస్ వినోద్‌

  • ఎడిటర్  :

    న‌వీన్ నూలి

  • నటినటులు  :

    ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, న‌వీన్ చంద్ర‌, దేవ‌యాని, సితార‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ త‌దిత‌రులు

Aravindha Sametha Moive Review

విడుదల తేది :

2018-10-11

Cinema Story

వీర‌రాఘ‌వ (ఎన్టీఆర్‌) విదేశాల నుంచి సొంతఊరికి వస్తాడు. విషయం తెలుసుకన్న ప్రత్యర్థి వర్గం అతడ్ని హత్యకు ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో వీరరాఘవకు బదులు అతని తండ్రి(నాగ‌బాబు) చనిపోతాడు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు ‘హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. ఒక‌సారి అర‌వింద‌పై అటాక్ జ‌రుగుతుంది.

ఆ ప్ర‌మాదం నుంచి అర‌వింద‌ను ర‌క్షిస్తాడు వీర రాఘ‌వ‌. అప్ప‌టి నుంచి అర‌వింద‌కు సంర‌క్ష‌కుడిగా మార‌తాడు వీరరాఘవ. అనుకోని ప‌రిస్థితుల్లో అర‌వింద ఇంటికి వెళ్లిన వీర రాఘ‌వకు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ఆమె నేప‌థ్యం ఏంటి? నాయ‌న‌మ్మ చెప్పిన‌ మాట‌ను నిలబెట్టుకుంటూ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని వీర రాఘ‌వ ఎలా అడ్డుకున్నాడు? అనేదే ముఖ్యకథ. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా అకట్టుకుందో తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

cinima-reviews
‘అరవింద సమేత వీరరాఘవ’

విశ్లేషణ

‘వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్ ను బేస్ చేసుకుని కథ సిద్దం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఫ్యాక్షనిజాన్ని మరో కోణంలో ఎలివేట్ చేసి.. ఫ్యాక్షనిజంలోకి వెళ్లే భర్తల కోసం భార్యలు, తండ్రుల కోసం పిల్లలు పడే అవేదన.. అందోళనను చూపాడు త్రివిక్రమ్. అయితే రక్తపుటేరులు పారించే కుటుంబం నుండి ఓ ధృవతార వచ్చి.. హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఆ ఊరిని కాపాడటం.. మాటల మాంత్రికుడు తన శైలికి భిన్నంగా తెరకెక్కించిన కథే ‘అరవింద సమేత వీర రాఘవ’.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌తో తొలి చిత్రం ఇదే కావడంతో పాటు.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా తెరక్కించారు. ఆయన శైలికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘అరవింద సమేత’ చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందినడటంలో సందేహమే లేదు.

మొద‌టి ఇర‌వై నిమిషాల క‌థ చాలా ప‌క‌డ్బందీగా సాగుతుంది. ఎమోష‌న‌ల్ గా బాగా డ్రైవ్ చేశాడు. ఈ సినిమాలో ఎమోష‌న్ కంటెంట్ ఉంటుంద‌ని ఒక ర‌కంగా ప్రేక్ష‌కుడిని ముందే సిద్ధం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. క‌థ హైద‌రాబాద్ చేరిన త‌ర్వాత తేలిక ప‌డుతుంది. ద్వీతీయార్థంలో అసలు కోణం బయటపడుతుంది. ఈ కథంటే్న్నది కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తాడు త్రివిక్రమ్. ప్రీ క్లైమాక్స్ కాస్త‌ సాగ‌దీసిన‌ట్లు అనిపించినా, క్లైమాక్స్ లో మ‌ళ్లీ క‌థ‌ను ఫామ్ లోకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. ఒక ర‌కంగా ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం.

నటీనటుల విషానికి వస్తే

ఈ సినిమాలో వీరరాఘవ ప్రాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. క‌థ‌కు, ద‌ర్శ‌కుడు రాసుకున్న వీర‌రాఘ‌వ పాత్రకు తారక్ ఇచ్చిన ఫర్మామెన్స్ అదుర్స్. ఈ చిత్రంతో తన తండ్రిని దూరం చేసుకున్న బాధను కూడా దిగమింగుకుని ఎన్టీఆర్ చేసిన నటన, అభినయానికి సెంట్ పర్సెంట్ మార్కులు ఇవ్వోచ్చు. ఇన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయ‌లేదు. తొలి ఇర‌వై నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే క‌నిపిస్తాడు. ప్యాక్షన్ చిత్రాలలో హీరో అనేందుకు పూర్తి భిన్నంగా వుంటాడు తారక్.

పూజా హెగ్డే కూడా తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది. ఆమె పాత్ర కూడా క‌థ‌లో కీల‌క‌ం కావడం... ఒక ర‌కంగా క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు రావ‌డానికి బ‌లంగా దోహ‌దం చేసింది. వెండితెర‌పై క‌నిపించే ప్ర‌తి చిన్న పాత్ర‌నూ చాలా బ‌లంగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. అందుకే ఏ పాత్ర‌నూ ప్రేక్ష‌కుడు అంత త‌ర్వ‌గా మ‌ర్చిపోలేడు. బాలిరెడ్డిగా జ‌గ‌ప‌తిబాబును చాలా క్రూరంగా చూపించాడు. ఆయ‌న కూడా ఎక్క‌డా బోరింగ్ కొట్ట‌కుండా న‌టించారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు మ‌రో మంచి పాత్ర దొరికింది. నీలాంబ‌రిగా సునీల్ ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తి పాత్రా క‌థ‌ను ముందుకు న‌డిపించేందుకు దోహ‌ద‌ప‌డేదే. బసిరెడ్డి కొడుకుగా బాలిరెడ్డి పాత్రలో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఆకట్టుకున్నారు. నరేష్, రావు రమేష్, శుభలేక సుధాకర్, సితార, దేవయాని, బ్రహ్మాజీ, జబర్దస్త్ చంద్ర ఇలా ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలించింది. హీరో తారక్ ను చూపించిన తీరు, యాక్షన్ సన్నివేశఆలు తెరకెక్కించిన విధానం అకట్టుకుంటాయి. అయితే ద్వీతీయార్థంలో ప్రీ క్లైమాక్స్ కు ముందు సినిమా సాగదీసినట్టు అనిపించడం.. నిడివి కాసింత ఎక్కవగా వుందని అనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలీ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేదని అనిపిస్తుంది.

‘అరవింద సమేత’ చిత్రంతో కెరియర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు తమన్. ‘రం.. రుధిరం.. సమరం.. శిశిరం, రం.. మరణం.. గెలవమ్.. ఎవరం’ అంటూ సాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ‘పెనిమిటి’,‘అనగనగనగా’, ‘ఏడపోయినాడో’, ‘రెడ్డి ఇక్కడ సూడు’ అన్ని సాంగ్స్ విజువల్‌గా బాగా కుదిరాయి. ముఖ్యంగా పెనిమిటి, ఏడపోయినాడో సాంగ్స్‌ ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించాయి. త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా కథను ఎంపిక చేసుకుని తెరకెక్కించిన భావోద్వేగంతో కూడిన చిత్రం.. అందుకు అనుగూణంగా రాసుకున్న మాటలు ఈ చిత్రానికి మరో బలం.

తీర్పు..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరి తొలి కాంభినేషన్ లో ఫాక్షన్ నేపథ్యంలో వచ్చిన భావోద్వేగాల చిత్రం..

చివరగా... శాంతికామకుడు అరవింద సమేత వీరరాఘవుడు..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh