Chi La Sow: Romance, as real as it gets ‘చి ల సౌ’ అకట్టుకుంది..

Teluguwishesh ‘చి ల సౌ’ మూవీ రివ్యూ ‘చి ల సౌ’ మూవీ రివ్యూ With Chi La Sow, Rahul has not only etched a cute love story, but given his audience a lot more to dwell upon. Rahul is known to be a feminist, and he has tried to incorporate that too into his script. Product #: 88342 3.00 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘చి ల సౌ’

  • బ్యానర్  :

    అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ కార్పొరేష‌న్‌

  • దర్శకుడు  :

    రాహుల్ ర‌వీంద్ర‌న్‌

  • నిర్మాత  :

    నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల

  • సంగీతం  :

    ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి

  • సినిమా రేటింగ్  :

    3.003.003.00  3.00

  • ఛాయాగ్రహణం  :

    ఎం.సుకుమార్‌

  • ఎడిటర్  :

    ఛోటా కె.ప్ర‌సాద్‌

  • నటినటులు  :

    సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌కిశోర్‌, అనుహాస‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

Chi La Sow Moive Review

విడుదల తేది :

2018-08-03

Cinema Story

అర్జున్‌ (సుశాంత్‌) ఇర‌వైయేడేళ్ల కుర్రాడు. మంచి ఉద్యోగం చేస్తుంటాడు. అత‌ని త‌ల్లిదండ్రులు(అను హాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌) పెళ్లి చేసుకోమ‌ని పోరు పెడుతుంటారు. అర్జున్ కేమో ఐదేళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకోకూడ‌ద‌నే ఆలోచ‌న ఉంటుంది. ఎవ‌రో ఇంటికి వెళ్లి అమ్మాయిని చూసి.. జీవితాంతం క‌లిసి ఉండ‌బోయే అమ్మాయిని ఐదు పది నిమిషాల్లో ఎలా నిర్ణ‌యించుకుంటా అనేది అర్జున్ వాద‌న‌. ఇలాంటి త‌రుణంలో అర్జున్ వాళ్ల‌మ్మ.. ఇంట్లోనే ఎవ‌రూ లేకుండా కేవ‌లం అర్జున్ మాత్రమే ఉండేలా అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది.

అంజ‌లితో పెళ్లి ఇష్టం లేద‌ని ముందు అర్జున్ చెప్పేసిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల కార‌ణంగా ఆమెతో ఓ క‌నెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. దాంతో ఆమె అంటే ఇష్టం ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో అంజ‌లి త‌ల్లి (రోహిణి)కి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో అర్జునే ఆమెకు స‌హాయంగా నిలుస్తాడు. త‌ర్వాత జ‌రిగే ప‌రిస్థితులు అర్జున్‌, అంజ‌లి మ‌ధ్య ఎలాంటి బంధాన్ని ఏర్ప‌రుస్తాయ‌నేది తెలుసుకోవాలంటే వెండితెరపై తొలిసారి దర్శకత్వ బాధ్యతలను చేపట్టినా.. అటు ఎమెషన్స్, ఇటు రోమాన్స్ అన్నింటిని మేళవించి.. నూటికి తొంబై మార్కులు సాధించిన రాహుల్ రవీంద్రన్ ను కొనియాడాల్సిందే.

cinima-reviews
‘చి ల సౌ’ మూవీ రివ్యూ

విశ్లేషణ

లైఫ్‌లో ఏది కావాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉండే అర్జున్ (సుశాంత్) పెళ్లి ఊసు ఎత్తితేనే పారిపోతాడు. అలాంటి అర్జున్ జీవితం అంజలి (రుహానీ)తో పెళ్లిచూపులతో మలుపు తిరుగుతుంది. అంజలి పెళ్లిప్రయత్నాలు ఒక్కొక్కటిగా తన తల్లికి ఉన్న అనారోగ్యం కారణంగా చెడిపోతూ ఉంటాయి. దీంతో తాను బ్రతికి ఉంటే తన కూతురు పెళ్లి జరగదని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి కుటుంబానికి ఆసరాగా ఉన్న అంజలి ఎలాగైనా తల్లి కోరికను తీర్చడానికి అర్జున్‌తో పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది. ఒక్కరాత్రిలో అర్జున్‌తో అంజలి పెళ్లి చూపులు పెళ్లిపీటలకు చేరాయా?

అంజలి.. అర్జున్‌కు ఎందుకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది? చివరికి చి.ల.సౌ కథలో సౌ. ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే. పెళ్లి అనే సింపుల్‌ లైన్‌ను తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘చి.ల.సౌ’ కథను అందంగా మలిచాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. దర్శకుడిగా తొలి చిత్రమే అయినా కన్ఫ్యూజన్ లేకుండా లాజిక్‌లు, మ్యాజిక్‌ల జోలికి పోకుండా సున్నితమైన భావోద్వేగాలతో రియలిస్టిక్ ప్రేమకథను అందించారు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య ఒక రాత్రిలో జరిగే పెళ్లి చూపుల్ని కథాంశంగా తీయడం అనేది ప్రయోగం అనే చెప్పాలి.

నటీనటుల విషానికి వస్తే

హీరోగా సుశాంత్‌కు ‘చి.ల.సౌ’ మైల్ స్టోన్ మూవీ అనే చెప్పాలి. బహుశా సుశాంత్ నుండి ఇలాంటి సినిమాను ఊహించడం కష్టమే. చాలా ఏళ్ల తరువాత సుశాంత్‌లోని నటుడ్ని బయటకు తీసుకువచ్చాడు దర్శకుడు. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌ను బాగానే పండించ గలిగాడు. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రంతో సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ు. ఇక కథలో ఎమోషనల్ జర్నీ మొత్తం హీరోయిన్ అంజలి (రుహాని) పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమెకు తొలి చిత్రమే అయినప్పటికీ ఫైర్‌ క్రాకర్‌ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అంజలి పాత్రలో చాలా అందంగా కనిపించింది.

ఆమె పాత్రకు చిన్మ‌యి డ‌బ్బింగ్ మరింత బలాన్ని ఇచ్చింది. సినిమా మొత్తం ఒకే డ్రెస్‌లో కనిపించి పాత్రలో ఒదిగిపోయి నటించింది. మేకప్ లేకుండా పింపుల్స్‌తో నటించి పాత్రకు రియాలిటీని తెచ్చింది రుహాని. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, అనుహాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు. ఇక హీరో స్నేహితుడి పాత్ర‌లో న‌టించి వెన్నెల‌కిషోర్ పండించిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కాసేపు ఆకట్టుకోగలిగారు. ఇక హీరోయిన్ చెల్లిగా నటించిన విద్యుల్లేఖ రామన్‌ ఉన్నంతలో పర్వాలేదనిపించింది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఒక పెద్ద ఫ్లాట్, మరో చిన్న ఇల్లు, హాస్పటల్ లోనే సినిమాను షూట్ చేసినా అన్ని ఫ్రేమ్స్ చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ప్రశాంత్ విహారి సమకూర్చిన పాటలు సందర్భానుసారంగా వస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా తెలిసిన కథనే తికమక పెట్టకుండా నీట్ అండ్ క్లీన్ స్క్రీన్‌ప్లేతో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు మినిమన్ గ్యారంటీ మూవీ ఇచ్చాడు దర్శకుడు.

బోర్ కొట్ట‌కుండా ‘చి.ల.సౌ’ క‌థ న‌డిపించడంలో పాత నటుడు, కొత్త దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స‌క్సెస్ అయ్యాడనే చెప్పాలి. యూత్‌ బేస్డ్ మూవీ కావడంతో మల్టీప్లెక్స్ లలో ‘చి.ల.సౌ’ చిత్రానికి రెడ్ కార్పెట్ పరుస్తారు. మాస్ ఆడియన్స్‌ని మెప్పించే ఎలిమెంట్స్ లేకపోవడంతో బి, సి సెంటర్స్‌ ఆడియన్స్ కి ‘చి.ల.సౌ’ సాగదీతలా అనిపించవచ్చు. అయితే ఈ సినిమాలో చాలా రియల్‌ మూమెంట్స్‌ ఉండటం వల్ల యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్‌ అవుతుంది.

తీర్పు..

నటుడిగా గుర్తింపును తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ‘చి. ల. సౌ’ చిత్రంతో తొలిసారి మెగా ఫోన్ పట్టారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ తానే సమకూర్చుకున్నారు. తొలిచిత్రంతోనే సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ థియేటర్లకు అహ్వానిస్తూ తన తొలిచిత్రంతో దర్శకుడిగా నూటికి తొంభై ఐదు మార్కులు సాధించాడు.

చివరగా... సకుటుంబసపరివార సమేతంగా దీవించవచ్చు..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh