krishnarjuna yuddham movie review and ratings అర్జున్ పాత్రలో నాని ఆకట్టుకోలేదట.. కానీ..

Teluguwishesh కృష్ణార్జున యుద్దం కృష్ణార్జున యుద్దం Amidst a lot of expectations, young hero Nani in dual role with anupama parameswaran and ruksar meer teamed up in krishnarjuna yuddham, only krishna role is accepted but not arjun by the audience. Product #: 87474 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కృష్ణార్జున‌యుద్ధం

  • బ్యానర్  :

    షైన్ స్క్రీన్స్‌

  • దర్శకుడు  :

    మేర్ల‌పాక గాంధీ

  • నిర్మాత  :

    సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది

  • సంగీతం  :

    హిప్ హాప్ త‌మిళ‌

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    2.75

  • నటినటులు  :

    నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు, ర‌వి అవానా, సుద‌ర్శ‌న్‌ త‌దిత‌రులు

Krishnarjuna Yuddham Movie Review

విడుదల తేది :

2018-04-12

Cinema Story

కృష్ణ‌(నాని), అర్జున్‌(నాని) ఇద్దరూ ఎటువంటి ర‌క్త సంబంధం లేని వ్య‌క్తులు. కృష్ణది చిత్తూరు జిల్లా అకుర్తి. ఊళ్లో క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయిని ప్రేమించాల‌ని అనుకుంటాడు. అర్జున్ యూర‌ప్‌లో ఒక రాక్‌స్టార్‌. అత‌డిని చాలామంది అమ్మాయిలు ఇష్ట‌ప‌డుతుంటారు. అలాంటి అర్జున్ సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. కృష్ణ‌ను కూడా ఆ ఊరి స‌ర్పంచ్ మ‌న‌వ‌రాలు, హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన‌ రియా(రుక్సార్‌) ప్రేమిస్తుంది. ఇంత‌లో ఈ రెండు ప్రేమ క‌థ‌ల్లో ఓ అనూహ్య‌మైన మ‌లుపు. ఇంత‌కీ ఆ మ‌లుపు ఏంటి? ఈ రెండు ప్రేమ జంట‌లూ ఒక్క‌ట‌య్యాయా?  లేదా?. ఈ ఇద్దరూ ఎప్పుడు..? ఎలా కలుస్తారు..? ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తారు.?  రాక్ స్టార్ అర్జున్, కృష్ణలకు మధ్య సత్సంబంధాలే కొనసాగుతాయా.? లేక ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే.

cinima-reviews
కృష్ణార్జున యుద్దం

విశ్లేషణ

చాలా రోటిన్ కధల మాదరిగానే సాగే క‌థ. తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఎక్కడ కనిపించకుండా.. ప్రేక్షకుడు ఇప్పుడు ఫలానా జరుగుతుందని ఊహించుకునే విధంగా సాగే చిత్రమిది. ఫస్టాప్ లో కృష్ణుడు ప్రేక్షకులను తెగ నవ్వించేస్తాడు. అయితే సెకెండాఫ్ లో మాత్రం కథలో పలు సన్నివేశాలకు అసలు లింక్ వుండదు. కధ సహా స‌న్నివేశాలు సాదాసీదాగా అనిపించినా, క్లైమాక్స్ కు కథ చేరుతున్న కొద్దీ అకట్టుకుంటుంది. కృష్ణ పాత్ర, అత‌ని అల్ల‌రి, అత‌ను ప‌లికే చిత్తూరు యాస న‌వ్వులు పంచుతుంది.

కృష్ణుడిగా మెప్పించిన నాని.. అర్జునుడిగా మాత్రం రాక్ స్టార్ గా మాత్రం మొప్పించలేదు. బ్ర‌హ్మాజీ(బ్ర‌హ్మాజీ) సంగీతం అంటే చెవి కోసుకునే సుబ్బ‌ల‌క్ష్మి పిన్ని(దేవ‌ద‌ర్శి‌ని) నేపథ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్వులు పంచుతాయి. కేవలం వినోద‌మేనా.. అని అనుకుంటున్న క్ర‌మంలో క‌థ ఓ మ‌లుపు తిరుగుతుంది. ఇద్ద‌రు హీరోయిన్‌లు, హీరోలు ఒకే విధ‌మైన స‌మ‌స్య‌లో చిక్కుకుంటారు. దీంతో వారి అచూకీని అన్వేషిస్తూ హీరోలు హైదరాబాద్ చేరుకుంటారు. ఇంత‌కు కృష్ణ‌, అర్జున్‌లు క‌లుస్తారా? సుబ్బ‌ల‌క్ష్మి, రియాలు ఎమ‌వుతారు? చివ‌ర‌కి క‌థ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందన్నదే చిత్రం.

అయితే ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా ద్వితీయార్థంలో బ‌లం లేక‌పోవ‌డం సినిమాకు కాస్త ప్ర‌తికూలం. తాము ప్రేమించిన అమ్మాయిల‌ను హీరోలు ర‌క్షించ‌డ‌మే అస‌లు క‌థ‌. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే వినోదం పాళ్లు త‌గ్గ‌డంతో పాటు, క‌థ‌లోనూ పెద్ద‌గా విష‌యం లేక‌పోవ‌డంతో సినిమా కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ కృష్ణ పాత్ర‌లో నాని త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డం సినిమాకు క‌లిసొచ్చే విష‌యం.

నటీనటుల విషయానికోస్తే..

నాని రెండు పాత్ర‌ల్లో ఒదిగిపోయినా, కృష్ణ‌గానే ఎక్కువ‌గా న‌చ్చుతాడు. ఒక‌వైపు రాక్‌స్టార్‌లా స్టైలిష్‌గా ఉంటూనే.. కృష్ణ అనే పల్లెటూరి యువ‌కుడిగా ఆస్లాంగ్‌ను మాట్లాడిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా కృష్ణ గెట‌ప్‌లో సీరియ‌స్‌గా ఫైట్స్ చేయ‌డ‌మే .. కామెడీ పండించ‌డంలో కూడా నాని స‌క్సెస్ అయ్యాడు. ఊళ్లో త‌న స్నేహితుల‌తో క‌లిసి పండించిన వినోదం ఆద్యంతం న‌వ్వులు పంచుతుంది. క‌థానాయిక‌లు ఇద్ద‌రూ అందంగా క‌నిపించారు. ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌థ‌మార్ధంలో బ్ర‌హ్మాజీ, నాని స్నేహితులుగా క‌నిపించిన న‌టులు, సుబ్బ‌ల‌క్ష్మి పిన్నిగా న‌టించిన దేవ‌ద‌ర్శిని, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు న‌వ్వులు పంచారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా బాగుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా యూర‌ప్‌తో పాటు, చిత్తూరు జిల్లా ప‌ల్లెటూరి అందాల‌ను చాలా అందంగా చూపించింది. హిప్ హాప్ త‌మిళ ట్యూన్స్‌లో మూడు సాంగ్స్ బావున్నాయి. నేప‌థ్య సంగీతం కూడా బావుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. ఈ సీనిమా ద‌ర్శ‌కుడు గాంధీ హ్యుమ‌న్ ట్రాఫికింగ్ అంశాన్ని కాస్త ప్రత్యేకంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. క‌థ‌లో కొత్త‌గా ఏమీ లేక‌పోయినా.. స్క్రీన్‌ప్లే, హీరో న‌ట‌న సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్, నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. క‌థానాయకుల పాత్ర‌ల‌ను స‌మాంత‌రంగా న‌డిపించిన విధానం, కామెడీ విష‌యంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది.

తీర్పు:

ఇద్దరు యువకుల ప్రేమ కథ మధ్య అల్లుకుపోయిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణార్జున యుద్దంలో ప్రథమార్థంలో సాగే హస్యం అకట్టుకుంటుంది. గ్రామీణ యువకుడి పాత్రలో నాని మెప్పిస్తాడు. అయితే అర్జున్ గా మాత్రం అకట్టుకోలేకపోతాడు. కామెడీ సీన్స్, మూడు పాటలు ఇందులో ఆకట్టుకునే అంశాలు. చాయాగ్రహనం బాగుంది. సెకాండాఫ్ లో రోటిన్ గా సాగడం, సాగదీసాడ్రా బాబోయ్ అన్నట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కు ముందు వచ్చే పాట అవసరమా అనిపించేలా వుంది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుడు ఎంతలా అదరిస్తారో వేచి చూడాలి.

చివరగా.. కథలో మాత్రం కొత్తదనం లేదు.. అయితే కృష్ణ పాత్ర మాత్రం ప్రేక్షకులను అకట్టుకుంటుంది. మొత్తంగా కృష్ణార్జునులు ప్రేక్షకులను అలరిస్తారు.

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh