chal mohan ranga movie review and ratings పాజిటివ్ టాక్ తో నితిన్.. ఛల్ మోహన్ రంగ

Teluguwishesh ఛల్ మోహన్ రంగ ఛల్ మోహన్ రంగ Amidst a lot of expectations, young hero Nithiin and Megha Akash have teamed up for the second time after their first outing LIE. There are a lot of expectations on this film and also the combination. The film is carrying a good response from everyone and the makers also promoted it well. Product #: 87398 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఛల్ మోహన్‌రంగ

  • బ్యానర్  :

    శ్రేష్ఠ్ మూవీస్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌

  • దర్శకుడు  :

    కృష్ణ చైత‌న్య‌

  • నిర్మాత  :

    ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, పవన్ కల్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్

  • సంగీతం  :

    త‌మ‌న్‌.ఎస్‌

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    ఎన్‌.న‌ట‌రాజ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

  • ఎడిటర్  :

    ఎస్.ఆర్. శేఖర్

  • నటినటులు  :

    నితిన్‌, మేఘా ఆకాశ్‌, మ‌ధు నంద‌న్‌, ప్ర‌భాస్ శ్రీను, లిజి, సంజ‌య్ స్వ‌రూప్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, రోహిణి హ‌ట్టంగ‌డి త‌దిత‌రులు

Chal Mohan Ranga Movie Review

విడుదల తేది :

2018-04-05

Cinema Story

నితిన్ కెరీర్ లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఛల్ మోహ‌న్ రంగ ప్రత్యకం. దీనిని ఆయన అభిమానించే ముగ్గురు ప్రముఖలు నిర్మించడం. వారే పవర్ స్టార్ పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సినిమా ప్రోడ్యూసర్ తండ్రి అయిన సుధాకర్ రెడ్డి. ఈ చిత్రం కథ విషయానికి వస్తే రోటిన్ ప్రేమ కథే. కానీ ప్రేమికుల ఇద్దరి మధ్య సన్నివేశాలను వైవిధ్యంగారూపొందించడం.. హాస్యానికి ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల సినిమా హిట్ టాక్ ను సోంతం చేసుకుంది. జీవితంలో స్థిరపడాలని భావించే యువకుడు అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసిన డాలర్లలో సంపాదించాలని చేయాలనుకుంటారు. అతడి పేరు మోహన్ రంగా  (నితిన్‌).

మూడేళ్ళ పాటు ప్ర‌య‌త్నించినా వీసా మాత్రం లభించదు. నాలుగో పర్యాయం మాత్రం స‌రోజ‌ అనే బామ్మ (రోహిణి హ‌ట్టంగ‌డి) శ‌వాన్ని అడ్డం పెట్టుకుని అమెరికా వెళ‌తాడు. అక్క‌డ అత‌నికి విచిత్ర‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య‌ మేఘ (మేఘా ఆకాశ్‌) అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరుగుతుంది. అది కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఆ విష‌యాన్ని ఒక‌రితో ఒక‌రు పంచుకునేందుకు రెడీ అవుతారు. కానీ ఇంతలో వారిద్దరూ.. భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు ఉన్న త‌మ మ‌ధ్య రిలేష‌న్ నిల‌బ‌డ‌దు అనే కార‌ణంతో ఇద్ద‌రు ఒక‌రినొక‌రు క‌ల‌వ‌కుండానే విడిపోతారు.

ఇద్దరు వేర్వేరు కార‌ణాల‌తో వీరిద్దరూ ఇండియాకు తిరిగి వస్తారు. అనుకోకుండా ఒకరిని మరోకరు కలుసుకుంటారు.. అయితే ఒకరినోకరు కలవకుండానే వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ అమెరికాలో విడిపోయిన నేపథ్యంలో భారత్ ఇద్దరు కలుసుకున్న తరువాత చిగురిస్తుందా..? ఆ ఇద్ద‌రూ తిరిగి క‌లుకున్నారా? చిన్నప్పుడే త‌మ మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌న్న విష‌యాన్ని వాళ్ళు గుర్తించారా? మోహ‌న్ రంగ‌, మేఘ ప్రేమ‌క‌థ ఏ తీరాల‌కు చేరింది? అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.

cinima-reviews
ఛల్ మోహన్ రంగ

విశ్లేషణ

విధి ఆడే వింత నాటకంలో మనం ఎవరితో ఎప్పుడు ఎలా మసలుతామో తెలియదు కానీ అదే విధి అనుకూలంగా వ్యవహరిస్తే.. అనుకున్నది అనుకున్నట్లుగానే సాగుతుందన్నది మాత్రం సత్యం. ఇదే ఇతివృత్తంగా మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ త‌న స్టైల్‌లో రాసుకున్న క‌థే `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌`. హీరో హీరోయిన్స్ చుట్టూ ఉండే పాత్ర‌లు ఇంత‌కు ముందు త్రివిక్ర‌మ్ గ‌త చిత్రాల్లో క‌న‌ప‌డిన‌ట్టు అనిపిస్తాయి. జనరల్ కాన్సెప్ట్ అదేనండీ పేదింటి కుర్రాడు పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమెను ప్రేమ‌కు ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో కొత్తదనాన్ని నింపే ప్రయత్నాలు చేశాడు దర్శకుడు కృష్ణ చైతన్య.

హీరో.. హీరోయిన్ అనుకోకుండా చిన్న‌ప్పుడే క‌లుసుకోవ‌డం.. పెద్ద‌యిన త‌ర్వాత క‌లుసుకోవ‌డం. ఓ జ‌ర్నీలో హీరోయిన్ .. హీరో మ‌ధ్య ప‌రిచ‌యం పెర‌గ‌డం.. అది కాస్త ప్రేమ‌గా మార‌డం ఇవ‌న్నీ కామ‌న్ ల‌వ్ స్టోరీస్ లో చూసిన‌వే. సినిమా ఫ‌స్టాఫ్ అంతా అమెరికాలో ఉండ‌టం.. సెకండాఫ్ అంతా కునూర్ గెస్ట్ హౌస్ లో బాగా డ‌బ్బుల పాత్ర‌ల మ‌ధ్య సినిమా అంతా ర‌న్ అవ‌డంతో సినిమాలో అంత మాస్ యాంగిల్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. ఫ‌స్ట్ హాఫ్‌లో క‌న‌ప‌డే పెద్ద పులి సాంగ్ మాత్రం యూత్‌కు బాగా న‌చ్చ‌తుంది. ఇక త్రివిక్ర‌మ్ క‌థ‌ల్లో క‌న‌ప‌డే బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఈ సినిమాలో ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు.

నటీనటుల విషయానికోస్తే..

టైటిల్ పాత్ర పోషించిన నితిన్ ఫుల్ ఎన‌ర్జీతో న‌టించాడు. త‌న న‌ట‌న‌తో పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఇక మేఘా ఆకాశ్‌.. త‌న తొలి సినిమా ‘లై’ కంటే చ‌క్క‌గా న‌టించింది. చాలా ఏళ్ల త‌ర్వాత తెలుగులో న‌టించిన లిజి..హుందాగా క‌న‌ప‌డుతుంది. సంజ‌య్ స్వ‌రూప్ పాత్ర‌కు పెద్ద ప్రాముఖ్య‌త లేదు. ఇక సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌గ‌తి ఉన్న రెండు స‌న్నివేశాల్లో ఓకే అనిపించారు. ఇక హీరో ఫ్రెండ్‌గా న‌టించిన జ‌బ‌ర్‌ద‌స్త్ గ్యాంగ్‌లోని వ్య‌క్తి.. స‌త్య కామెడీ కాస్త న‌వ్విస్తుంది. మొత్తంగా చూస్తే కామెడీ, మేకింగ్‌లో క్వాలిటీ మిన‌హా కొత్త‌ద‌నం ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. మ‌ల్టీప్లెక్ ఆడియెన్స్‌ ఆద‌ర‌ణ పొందుతుంది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

దర్శకుడు కృష్ణ చైతన్య త్రివిక్రమ్ అందించిన కథను ఒక మంచి సినిమాకు సరిపడా స్థాయిలో అభివృద్ధి చేయడంలో కొంత తడబడ్డారు. ముఖ్యమైన ప్రేమ కథలో ఎమోషన్స్ సరిగా పండించలేకపోవడం, కీలకమైన బ్రేకప్, తిరిగి కలుసుకోవడం వంటి అంశాల వెనుక బలమైన కారణాలను చెప్పకపోవడం వంటి బలహీనతలతో కొంత నిరుత్సాహపరిచిన కృష్ణ చైతన్య హీరో పాత్రను భిన్నంగా డిజైన్ చేసి నితిన్ ను స్క్రీన్ పై కొత్తగా చూపడంలో, మంచి హాస్యాన్ని పండించడంలో మాత్రం సఫలమయ్యారు. న‌ట‌రాజ‌న్ సుబ్రమణియం సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. త‌మ‌న్ సంగీతం కూడా అకట్టుకుంది. ట్యూన్స్ విన‌డానికి బావున్నాయి. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన్న ఈ ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం కొంత ఆకట్టుకోని కొంత నిరుత్సాహపరిచింది. హీరో పాత్ర, అందులో నితిన్ నటన, ప్రాసలతో కూడిన మాటలు, రెగ్యులర్ గా వచ్చే కామెడీ సీన్స్, కొన్ని పాటలు ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా కథలో పూర్తిస్థాయి ఎమోషన్, రొమాన్స్ లోపించడం రొటీన్ గా అనిపించే కథనం, కీలకమైన ఘట్టాల వెనుక బలమైన కారణాలు లేకపోవడం డిసప్పాయింట్ చేసే అంశాలు. హాస్యానికి మాత్రం ప్రాధాన్యతను ఇవ్వడం.. ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు సాగిన కథనం సినిమాకు బలంగా మారింది. మొత్తం మీద ప్రేమ కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలన్నింటినీ హిట్ చేసే యువత ఈ చిత్రాన్ని ఎంతలా అదరిస్తారో వేచి చూడాలి.

చివరగా.. పాత కథతో వచ్చిన ఛల్ మోహన్ రంగ.. కొత్త కథనంతో.. విలువైన నిర్మాణ ప్రేక్షకులను అలరిస్తుంది.

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh