Inttelligent movie review and Rating | ఇంటిలిజెంట్ రివ్యూ.. పేలవమైన మాస్ డ్రామా

Teluguwishesh ఇంటిలిజెంట్ ఇంటిలిజెంట్ Sai Dharam Tej Inttelligent aka Intelligent Movie Review and Rating . Mass Director VV Vinayak fails to execute regular revenge Drama. Product #: 86807 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఇంటిలిజెంట్

  • బ్యానర్  :

    సీకే ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

  • దర్శకుడు  :

    వివి వినాయక్

  • నిర్మాత  :

    సీ కళ్యాణ్

  • సంగీతం  :

    ఎస్ ఎస్ థమన్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    విశ్వేశ్వర్

  • నటినటులు  :

    సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, రాహుల్ దేవ్, దేవ్ గిల్ తదితరులు

Intelligent Movie Review

విడుదల తేది :

2018-02-09

Cinema Story

సాయి ధరమ్ తేజ్(సాయి ధరమ్ తేజ్) ఓ అనాథ. ఓ పెద్ద మనిషి(నాజర్) అతన్ని చేరదీసి చదివించి తన కంపెనీలోనే ఉద్యోగం వేయిస్తాడు. అయితే ఆ వ్యాపారవేత్తతో పోటీ పడలేక కొందరు వ్యాపారస్థులు ఫ్లాన్ చేసి విక్కీ భాయ్ అనే మాఫియా డాన్ చేత చంపిస్తారు. కానీ, దాన్ని సూసైడ్ గా చిత్రీకరిస్తారు. అంతా అది సూసైడ్ అని నమ్మినా? సాయి మాత్రం నమ్మడు. తన గాడ్ ఫాదర్ ను చంపిన వారిని ఒక్కోక్కరిగా ఏరి చంపుతుంటాడు. ఈ క్రమంలో అతను తన ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తాడన్న మాట.

cinima-reviews
ఇంటిలిజెంట్

విశ్లేషణ..

తనకు కావాల్సిన వారిని చంపటం.. ఆ పగతో రగిలిపోయే హీరో వారిని ఏరేయటం... ఈ క్రమంలో చెడుకు ఎదురు తిరిగిన హీరోను ప్రజలు దేవుడిలా కొలవటం... 80 చివరి నుంచి అరిగిపోతున్న ట్రాక్ కథలే దాదాపు అన్నీ ఇవే. వీటికి కమర్షియల్ ఫార్మట్ ను అనుసరించి ఎప్పటికప్పుడు మన దర్శకులు కలరింగ్ ఇస్తూ వస్తున్నారు. కానీ, వినాయక్ మాత్రం ఇంటిలిజెన్స్ విషయంలో టోటల్ గా ట్రాక్ తప్పాడు.

విలన్లపై ఊగిపోతు విరుచుకుపడే హీరో.. ఇంటెలిజెన్స్ పేరుతో చేసే పనులు చాలా సిల్లీగా అనిపిస్తాయి. మొత్తం విలన్ నెట్ వర్క్ ను తన ఆధీనంలోకి తీసుకునే హీరో.. వాటిని నాశనం చేయటానికి నానుస్తుంటాడు. దీనికి తోడు దెబ్బ కొట్టిన ప్రతీసారి విలన్లు అతన్ని మేధావి అని పొగుడుతుండటం చికాకు తెప్పిస్తుంది. అన్నింటికన్నా దారుణమైన విషయం బ్రహ్మీ క్యారెక్టరైజేషన్ విషయంలో చేసిన పొరపాటు. తలా తోక లేకుండా అతని క్యారెక్టర్ ను హీరో సృష్టించటం.. దానికి హీరో ఫ్రెండ్స్ సూపర్ అనటం మరీ దారుణం.

ఇక కథ సాగే స్పీడులో కొత్తదనం ఏమైనా ఉందా? అంటే అది మచ్చుకైనా కనిపించదు. సీన్లే పరమ బోరింగ్ అంటే పాటలు అంతకన్నా దారుణం. ఎందుకొస్తాయో.. అర్థం కాకుండా ప్రేక్షకులను తికమకకు గురి చేస్తాయి. ఇలాంటి సినిమా ఎన్నేళ్ల ముందు వచ్చినా కూడా ఔట్ డేటెడ్ గా.. అర్థరహితంగానే అనిపిస్తుంది తప్పితే వేరే ఫీలింగ్ ఇవ్వదేమో.

నటీనటుల విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ పాటల్లో స్టెప్పులతో మెస్మరైజ్ చేశాడు. కానీ, ఎంత చేసినా సినిమాలో మ్యాటర్ లేకపోతే ఏం ఉండదు కదా. ఇక్కడా అదే జరిగింది. లుక్కు పరంగా మాత్రమే ఇందులో కాస్త కొత్తదనం కనిపించింది. చాలా వరకు సన్నివేశాల్లో పవన్, చిరులను ఇమిటేట్ చేశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాటల్లో తప్ప సీన్లలో కనిపించటం చాలా అరుదు. మిగతా పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.

టెక్నీకల్ విషయానికొస్తే... ఈ మధ్య కాలంలో మంచి ఆల్బమ్ లు ఇస్తు థమన్ ఫేయిల్యూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ పరమ రోటీన్. కెమెరా పనితనం పెద్దగా చెప్పుకోవటానికి ఏం లేదు. నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి.

 

చివరగా...
నాయక్ లాంటి మంచి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అందించిన ఆకుల శివ ఇంటలిజెంట్ కు చేసిన వర్క్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతకుముందు వినాయక్ ఎంత రొటీన్ సినిమాలు తీసినా.. కొన్ని అంశాల్లో అయినా ఆకట్టుకునేవాడు. కామెడీని బాగా డీల్ చేయడమో.. యాక్షన్ సన్నివేశాల్లో పనితనం చూపించడమో చేసేవాడు. కానీ ‘ఇంటిలిజెంట్’లో ఎక్కడా అది చిన్న మార్క్ కూడా కనిపించదు.

చివరగా.. ఇంటిలిజెంట్... పేలవమైన మాస్ డ్రామా