C/O Surya Movie Review and Rating | కేరాఫ్ సూర్య రివ్యూ... ఎంగేజింగ్ థ్రిల్లింగ్ డ్రామా

Teluguwishesh కేరాఫ్ సూర్య కేరాఫ్ సూర్య Sandeep Kishan's C/O Surya Movie Review and Rating. The Suseendran Directorial Venture Story and Synopsis Cast Performances. Product #: 85483 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కేరాఫ్ సూర్య

  • బ్యానర్  :

    లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్

  • దర్శకుడు  :

    సుశీంద్రన్

  • నిర్మాత  :

    చక్రి చిగురుపాటి

  • సంగీతం  :

    డీ ఇమ్మాన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    లక్ష్మన్ కుమార్

  • ఎడిటర్  :

    కాశీ విశ్వనాథన్

  • నటినటులు  :

    సందీప్ కిషన్, మెహ్రీన్, హరీశ్ ఉత్తమన్; తులసి, సత్య, ప్రవీణ్, తాగుబోతు రమేష్ తదితరులు

C O Surya Movie Review

విడుదల తేది :

2017-11-10

Cinema Story

కల్మషం లేని సూర్య ఫ్యామిలీతోపాటు ఫ్రెండ్స్ అంటే కూడా ప్రాణం. స్నేహితుల కారణంగా ఇంట్లో తరచూ తిట్టు కూడా తింటుంటాడు. ఇదిలా ఉండగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల తండ్రి ఉద్యోగం కోల్పోవటంతో కుటుంబ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే జననీ అనే అమ్మాయి ప్రేమలో సూర్య పడతాడు. ఇదిలా ఉండగా... బాలు(హరీశ్ ఉత్తమన్) అనే రౌడీ భూకబ్జాలు చేస్తూ ప్రజలను వణికిస్తుంటాడు. అనుకోకుండా ఓ గొడవలో సూర్య స్నేహితులపై బాలు మనుషులు దాడులు చేస్తారు. మరి ఆ సమయంలో సూర్య ఏం చేస్తాడు? కుటుంబాన్ని రక్షించుకుంటూనే బాలు భరతం ఎలా పడతాడు? ఈ క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు ఏంటి?

cinima-reviews
కేరాఫ్ సూర్య

యువ హీరో సందీప్ కిషన్ కు గత కొంత కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. దీనికితోడు కోలీవుడ్ లోనూ ఛాన్సులు అతనికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో నా పేరు శివ లాంటి డబ్ చిత్రంతో తెలుగు వాళ్లకు పరిచయస్తుడైన దర్శకుడు సుశీంద్రన్ కేరాఫ్ సూర్య అంటూ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను మన ముందుకు తీసుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టకున్న ఆ ద్విభాషా చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ : 

ఆవారాగా తిరిగే హీరో చిల్లర కథలు మనకు కొత్తేం కాదు. అయితే దానికి ఫ్రెండ్ షిప్ అనే ఎలిమెంట్ ను యాడ్ చేసి ఎంగేజింగ్ గా మలచటంలో దర్శకుడు సుశీంద్రన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. హీరో-విలన్ పోటాపోటీ నటన.. దానికి తోడు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. ఫర్ ఫెక్ట్ కాస్టింగ్ దానికితోడు సస్పెన్స్ డ్రామాను విజయ వంతంగా నడిపాడు.

అయితే మధ్య మధ్యలో వచ్చే పాటలు.. సెకండాఫ్ నేరేషన్ కాస్త కన్ఫ్యూజింగ్ గా, మధ్య మధ్యలో తమిళ ఛాయలు, డైలాగుల ఉచ్ఛారణ... మైనస్ పాయింట్లుగా చెప్పొచ్చు. మొత్తానికి సందీప్ కిషన్, హరీశ్ ఉత్తమన్ ల ఫెర్ ఫార్మెన్స్ సినిమాను బలంగా నిలబెట్టాయి.

 


కాస్టింగ్ ఫెర్ ఫార్మెన్స్... ప్రస్థానం తప్పించి ఇప్పటిదాకా తాను చేసిన సినిమాల్లో సందీప్ కిషన్ ఈ సినిమాలో ది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అందించాడు. ప్రియురాలి దగ్గర భయస్తుడిగా.. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిగా.. చివర్లో వారి కోసం చేసే సాహసాలు అన్నీ ఆకట్టుకుంటాయి. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా సందీప్ నటన మెప్పిస్తుంది. జననీ పాత్రలో నటి మెహ్రీన్ ఇంప్రెసివ్ లుక్ తో ఆకట్టుకుంది. అయితే ఫెర్ ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. వీరి తర్వాత విలన్ హరీశ్ ఉత్తమన్ గురించే చెప్పుకోవాలి. హీరో ఫ్రెండ్స్ పాత్రలు సత్య, తల్లి పాత్ర తులసి,, మిగతా వాళ్లు తమ పరిధి మేరకు చేశారు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ఇమ్మాన్ అందించిన స్వరాలు అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. ఇక సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది లక్ష్మణ్ కుమార్ అందించిన కెమెరా వర్క్. లోకేషన్లలో పలు యాంగిల్ లలో వాడిన కెమెరా వర్క్ ఆకట్టకుంది. డైలాగులు సింపుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.


తీర్పు...

నా పేరు శివ తరహాలో దర్శకుడు సుశీంద్రన్ ఇక్కడ కూడా క్రైమ్ తరహా కథతోనే వచ్చినప్పటికీ.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ ను చేస్తూ ఆ వర్గాన్ని కనెక్ట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. చిన్న సినిమాల వైపు ఎక్కువగా ప్రేక్షకులు మొగ్గు చూపుతున్న సమయంలో కేరాఫ్ సూర్య వండర్స్ క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మాస్ ను మెప్పించే అంశాలు పూర్తి స్థాయిలో లేకపోవటం.. ఉన్నా అవి అంతగా ఎక్కకపోవటం... దీనికి తోడు పోటీ సినిమాలు... థియేటర్ల కొరత ఈ సమస్యలన్నింటిని కేరాఫ్ సూర్య ఎలా అధిగమిస్తాడో చూడాలి.

చివరగా... కేరాఫ్ సూర్య ఓ ఎంగేజింగ్ థ్రిల్లింగ్ డ్రామా