దర్శకుడు రివ్యూ.. ఓ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ | Darsakudu Telugu Movie Review and Rating

Teluguwishesh దర్శకుడు దర్శకుడు Darsakudu Telugu Movie Review. Darsakudu Story and Synopsis Cast Performance. Product #: 84052 1.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    దర్శకుడు

  • బ్యానర్  :

    సుకుమార్ రైటింగ్స్

  • దర్శకుడు  :

    హరిప్రసాద్ జక్కా

  • నిర్మాత  :

    సుకుమార్

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    1.75  1.75

  • ఛాయాగ్రహణం  :

    ప్రవీణ్ అనుమోలు

  • నటినటులు  :

    అశోక్ బండ్రెడ్డి, ఈషా, పూజితా పొన్నాడా, నోయెల్, సుదర్శన్ తదితరులు

Darsakudu Telugu Movie Review

విడుదల తేది :

2017-08-04

Cinema Story

కథ:

మహేష్(అశోక్) అనే యువకుడికి చిన్నప్పటి నుంచి దర్శకుడు కావాలన్నదే కల. ఆ పిచ్చితోనే హైదరాబాద్ కు వచ్చిన అతనికి ఇక్కడి పరిస్థితులు అంత ఈజీ కాదనే చెబుతాయి. దీంతో లైట్ బాయ్ గా సెటిల్ అయి ఓ కథను రాసుకుంటాడు. ఓ నిర్మాతకు దానిని వినిపించగా, లవ్ ట్రాక్ గా దాన్ని మార్చి రాసుకురమ్మని సూచిస్తాడు. అయితే మహేష్ కు ప్రేమ గురించి పెద్దగా పరిచయం ఉండదు. అందుకే తాను ఎవరైనా అమ్మాయిని లవ్ చేసి ఆ అనుభూతితో కథ రాయాలని డిసైడ్ అవుతాడు. 

 

ఓరోజు రైలు ప్రయాణంలో ఫ్యాషన్ డిజైనర్ అయిన నమ్రతను చూసి ఇష్టపడ్డ అశోక్ మెల్లిగా లవ్ లోకి దింపటం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి వాళ్లిద్దరి మధ్య జరిగే ప్రతీ సిచ్యూయేషన్ ను సీన్ గా మలిచి కథ రాస్తుంటాడు. అయితే మహేష్ ఉద్దేశ్యం ఏంటో తెలిశాక నమ్రత అతన్ని అసహ్యించుకుంటుంది. మరి అక్కడి నుంచి కథను ముందుకు ఎలా నడిపించాడు? చివరకు ఆ కథను ఎలా ముగించాడు? అతని లక్ష్యం నెరవేరిందా? అన్నదే దర్శకుడు కథ. 

cinima-reviews
దర్శకుడు

ఓవైపు దర్శకుడిగానే కాకుండా సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రోడక్షన్ హౌజ్ ను ప్రారంభించి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు లెక్కల మాష్టార్ సుకుమార్. కుమారి 21 ఎఫ్ తర్వాత ఇప్పుడు ‘దర్శకుడు’ పేరుతో మరో మూవీతో మన ముందుకు వచ్చాడు. తన అన్న కొడుకు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ, సన్నిహితుడైన హరి ప్రసాద్ ను డైరక్టర్ గా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం, చెర్రీ, తారక్, బన్నీలతో ప్రచారం.. టోటల్ గా సినిమాపై అంచనాలు పెంచేశాడు సుకుమార్. మరి ఫలితం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

విశ్లేషణ:

దర్శకుడు కావాలనే కల.. అందుకోసం తన జీవితంలో జరిగే ఘటనలే ఎగ్జాంపుల్ గా తీసుకోవటం లాంటి కాన్సెప్ట్ తో గీతాంజలి లాంటి సినిమాను చూసే ఉన్నాం. అయితే దర్శకుడు కథ కూడా కాస్త ఇలాంటిదే అయినప్పటికీ కాన్సెప్ట్ దృష్ట్యా ఎమోషన్స్, ఫన్, రొమాంటిక్ ట్రాక్ ఇలా బోలెడు అంశాలతో ఎంటర్ టైనర్ గా మార్చేందుకు స్కోప్ ఉంది. కానీ, తన మార్క్ కథతో సుకుమార్ స్టోరీని డెవలప్ చేసినప్పటికీ దర్శకుడిని మలచటంలో దర్శకుడు హరి మాత్రం ఘోరంగా ఫేలయ్యాడు.

ప్రేమను పక్కన పెట్టి దర్శకుడు అవ్వాలనే ఆ లక్ష్యం సాధించటంలోనూ హీరో నిజాయితీని దర్శకుడు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. చివర్లో హీరోయిన్ తన చిన్నానాటి స్నేహితురాలేనని, ఆమెపై తాను పెంచుకున్న ఫీలింగ్స్ నిజమేనని ట్విస్ట్ అస్సలు కన్విన్సింగ్ గా లేదు. పోనీ మూవీ థీమ్ కు తగ్గట్లుగా అయినా ఎంటర్ టైన్ మెంట్ ఉందా? అంటే అదీ లేదు. ఉన్నదాంట్లో కాస్త ఉపశమనం ఏదైనా ఉందా అంటే.. సెకండాఫ్ మొదలు నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చే హీరో కథ రాసే సీన్లే. డైరక్టర్ కావాలన్న కలను మనసులో భావాలతో తెరకెక్కించే అవకాశాన్ని దర్శకుడు హరి ప్రసాద్ చేజేతులారా మిస్ చేసుకున్నాడేమో అనిపించకమానదు.


నటీనటుల విషయానికొస్తే... హీరోగా అశోక్ జస్ట్ ఓకే. యావరేజ్ లుక్ తో నటనపరంగా ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ ఈషా రెబ్బా క్యారెక్టర్ బాగా చేసింది. హీరో కంటే ఈమె క్యారెక్టరే బాగా ఎలివేట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్ సుదర్శన్ హీరో పక్కనే కనిపిస్తూ అలరించాడు. మిగతా పాత్రలు చేసిన వాళ్లు పెద్దగా పరిచయం లేని వాళ్లే.

టెక్నికల్ అంశాపరంగా.. సాయి కార్తీక్ దర్శకుడు థీమ్ మ్యూజిక్ తప్ప పాటలు ఏవీ గుర్తుండవు. ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ ఈ లో బడ్జెట్ సినిమాను కాస్త రిచ్ గానే చూపించే యత్నం చేశాడు. డైలాగులు అస్సలు గుర్తుండవు. ప్రోడక్షన్ వాల్యూస్ యావరేజ్ గా ఉన్నాయి.

 

ఫ్లస్ పాయింట్లు:

ఇంట్రెస్టింగ్ కథ
సెకండాఫ్

 

మైనస్ పాయింట్లు:
స్క్రీన్ ప్లే, డైరక్షన్


తీర్పు:

పూర్ స్క్రిప్ట్, యాక్టింగ్ స్కోప్ లేని హీరో, కామన్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ కాలేని రీతిలో సినిమాను దారుణంగా తెరకెక్కించాడు దర్శకుడు. పోనీ సుకుమార్ టైప్ చమ్మక్కులు ఏమైనా ఉంటాయో అని భావిస్తే మాత్రం దారుణమైన నిరాశే కలగటం ఖాయం.

చివరగా.. దర్శకుడు ఓ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.