Shamanthakamani Telugu Movie Review, Rating, Story

Teluguwishesh శమంతకమణి శమంతకమణి Shamanthakamani Movie Review and Rating. Complete Story Synopsis and Lead Roles Performances. Product #: 83636 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  శమంతకమణి

 • బ్యానర్  :

  భవ్య క్రియేషన్స్

 • దర్శకుడు  :

  శ్రీరామ్ ఆదిత్య

 • నిర్మాత  :

  ఆనంద్ ప్రసాద్

 • సంగీతం  :

  మణిశర్మ

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  సమీర్ రెడ్డి

 • నటినటులు  :

  నారా రోహిత్ - సుధీర్ బాబు - సందీప్ కిషన్ - ఆది - రాజేంద్ర ప్రసాద్ - చాందిని చౌదరి - అనన్య - జెన్నీ - తనికెళ్ల భరణి - హేమ - ఇంద్రజ - రఘు కారుమంచి - సత్యం రాజేష్ తదితరులు

Shamanthakamani Movie Review

విడుదల తేది :

2017-07-14

Cinema Story

కథ:

కృష్ణ (సుధీర్ బాబు) అనే రిచ్ గాయ్ తన తండ్రి మీద కోపంతో వేలంలో రూ.5 కోట్లు పెట్టి కొన్న ‘శమంతకమణి’అనే కారును తీసుకుని ఓ పార్టీకి వెళ్తాడు. బయటికి వచ్చేసరికి అక్కడ కారు మాయం అయిపోతుంది. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తే.. ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) కేసును సీరియస్ గా టేకప్ చేస్తాడు. పార్టీకి వచ్చిన శివ (సందీప్ కిషన్).. కార్తీక్ (ఆది).. ఉమామహేశ్వరరావు (రాజేంద్ర ప్రసాద్)లతో పాటు కృష్ణను కూడా అతను అనుమానిస్తాడు. 

అందరినీ తన స్టైల్లో లోపలేసి విచారణ చేస్తాడు. కానీ, ఎంతకు చిక్కుముడి వీడకపోవటంతో పిచ్చెక్కిపోతాడు. అసలు వాళ్లు రంజిత్ దగ్గర ఎలాంటి సమాధానాలు చెప్పారు. ఇంతకీ ఆ కారు అసలు దొంగ ఎవరు? చివరకు శమంతకమణి దొరికిందా లేదా? అన్నది తెరమీదే చూడాలి.

cinima-reviews
శమంతకమణి

భలే మంచి రోజు’తో మంచి గుర్తింపు సంపాదించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఏకంగా నలుగురు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ ‘శమంతకమణి’ని రూపొందించాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దాని రిజల్ట్ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్దాం.

విశ్లేషణ:

కారు బ్యాగ్రౌండ్ లో శమంతకమణి అనే టైటిల్, ట్రైలర్ లో అది చోరీకి గురవుతుందనే కాన్సెప్ట్ తో ఓ క్రైమ్ కామెడీ డ్రామా.. అన్నింటికి మించి నలుగురు యంగ్ హీరోలతో ఓ మల్టీస్టారర్ ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కానీ దర్శకుడు మాత్రం ఆ మార్క్ ను రీచ్ కాలేకపోయాడు. వేర్వేరు వ్యక్తుల్ని ఒక కామన్ పాయింట్ కు జత చేసి చివరకు ఓ సొల్యూషన్ చూపించటం మనమంతా లాంటి మూవీలో చూశాం. కానీ, ఇక్కడ కథ మాత్రం అంత స్ట్రాంగ్ గా లేదనే చెప్పాలి. చిన్న పాయింట్ తో అది కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా శ్రీరామ్ ఆదిత్య కథను డెవలప్ చేశాడు.

గత చిత్రం భలే మంచి రోజు ఫార్ములానే ఇక్కడా ఫాలో అయ్యాడు. కథ ఏం లేకుండా జస్ట్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేద్దామనుకున్నప్పటికీ అది అంత పేలలేదు. ఇలాంటి క్రైం కామెడీ లో వేగం ఉంటేనే మజా ఉంటుంది. కానీ, ఫస్టాఫ్ మొత్తం కథ నత్తనడకనే సాగుతుంది. కథల్ని మార్చి మార్చి చూపించే క్రమంలో క్రియేటివిటీ చూపించాడు కానీ.. ఆ పాత్రల్ని మాత్రం వైవిధ్యంగా తీర్చిదిద్దలేకపోయాడు.
అయితే ఎప్పుడైతే ద్వితీయార్ధం నుంచి అసలు కథ చెప్పడం మొదలుపెట్టాక దర్శకుడి టేకింగ్ టాలెంట్ కనిపిస్తుంది.

ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగుతుంది. ఒక్కో పాత్ర ద్వారా జరిగిన సంఘటనల్ని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో.. చివర్లో థ్రిల్ చేయడంలో విజయవంతమయ్యాడు. కారు ట్విస్టు ఓకే అనిపిస్తుంది.


కాస్టింగ్ విషయానికొస్తే.. మల్టీస్టారర్ అనగానే ఎవరి క్యారెక్టర్ హైలెట్ అవుతుందా? అని అంచనాలు ఉంటాయి. కానీ, ఇక్కడ నలుగురితో కథను బ్యాలెన్స్ చేయించాడు దర్శకుడు. ముందుగా నారా రోహిత్ గురించి చెప్పుకుంటే పోలీస్ క్యారెక్టర్లు అలవాటు కావటంతో చాలా ఈజీగా చేసుకుపోయాడు. పతాక సన్నివేశాల్లో అతడి నటన మెప్పిస్తుంది. సీరియస్ ఉంటూనే అక్కడక్కడ నవ్విస్తాడు. సందీప్ కిషన్ కూడా తనకు అలవాటైన జులాయి కుర్రాడి పాత్రలో మెప్పించాడు. అతడి నటన సహజంగా సాగింది. సుధీర్ బాబు ఎక్కువగా సీరియస్ గా సాగే పాత్ర చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. ఆది బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో కనిపించాడు. అక్కడక్కడా అతను చూపించిన అత్యుత్సాహం కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా ఓకే అనిపిస్తాడు ఆది.

రాజేంద్ర ప్రసాద్ ఉన్నంతలో బాగా చేశారు. సుమన్ పాత్రకు తగ్గట్లుగా నటించాడు. లేడీ క్యారెక్టర్లకు ప్రాధాన్యం లేదు. తనికెళ్ల భరణి, హేమ ఫర్వాలేదు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఉన్న ఒక్క పాటకు కూడా మంచి బాణీనే అందించాడు. సమీర్ రెడ్డి స్టైలిష్ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన మీద పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతను కథ కంటే స్క్రీన్ ప్లేకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని.. దాని మీదే సినిమాను నడిపిస్తాడని తొలి సినిమాతోనే తేలిపోయింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. డైలాగులు మాములుగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది.

ఫ్లస్ పాయింట్లు:
లీడ్ రోల్స్ నటన
సెకండాఫ్
మ్యూజిక్

 

మైనస్ పాయింట్లు:
పేలని కామెడీ
బోరింగ్ ఫస్టాఫ్


తీర్పు:

రెగ్యులర్ కథలే అయినప్పటిక ఎంగేజింగ్ తోపాటు ఎంటర్ టైన్ మెంట్ అందించిన కథలు హిట్లు కొట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఇక్కడ కథలోనే స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం, పైగా బోరింగ్ ఫస్టాఫ్ సినిమాకు మైనస్ అయ్యాయి. అయితే కీలకమైన సెకండాఫ్ మాత్రం సినిమాను కొంతవరకు నిలబెట్టడంతో బయటకు వచ్చే ప్రేక్షకుడు మిశ్రమ స్పందనతో వస్తాడు.


చివరగా... శమంతకమణి సో.. సో.. థ్రిల్లింగ్ రైడ్

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.