Ninnu Kori Telugu Movie Review, Rating, Story

Teluguwishesh నిన్ను కోరి నిన్ను కోరి Nani starrer Ninnu Kori Movie Review and Rating. Complete Story Synopsis and Lead Roles Performances. Product #: 83509 3.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  నిన్ను కోరి

 • బ్యానర్  :

  డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్

 • దర్శకుడు  :

  శివ నిర్వానా

 • నిర్మాత  :

  డీవీవీ దానయ్య, కోన వెంకట్

 • సంగీతం  :

  గోపీ సుందర్

 • సినిమా రేటింగ్  :

  3.53.53.5  3.5

 • ఛాయాగ్రహణం  :

  కార్తీక్ ఘట్టమనేని

 • ఎడిటర్  :

  ప్రవీఫ్ పూడి

 • నటినటులు  :

  నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు

Ninnu Kori Movie Review

విడుదల తేది :

2017-07-07

Cinema Story

కథ...

వన్స్ అప్ అన్ ఏ టైంలో... వైజాగ్ లో పీహెచ్ డీ చదివే ఉమా మహేశ్వర రావు(నాని) యాక్సిడెంటల్ గా పల్లవి(నివేదా థామస్) అనే పిల్ల లవ్ లో పడిపోతాడు. ఉమా నచ్చటంతో పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇద్దరూ హ్యాపీగా ప్రేమించుకుంటూ పెళ్లి వైపు అడుగులు పడుతున్న టైంలో చిన్న మనస్పర్థలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి విడిపోతారు. తర్వాత ఉమా కెరీర్ కు అడ్డుతగలకూడదన్న ఉద్దేశ్యంతో పల్లవి అరుణ్ (ఆది పినిశెట్టి) అనే ఎన్నారై ను పెళ్లిచేసుకుని వెళ్లిపోగా, ఆ బాధలో మనోడు దేవదాసుగా మారిపోతాడు.


విధి వెక్కిరించటంతో ఉద్యోగ రీత్యా తర్వాత ఉమ కూడా పల్లవి ఉన్న ప్రాంతానికే వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మాజీ ప్రియుడు మందుకు బానిస అయ్యాడని తెలిసి అతనితో మాన్పించేందుకు పల్లవి ప్రయత్నిస్తుంటుంది. అయితే తన ప్రేమను చంపుకుని పల్లవి భర్తతో అడ్జస్ట్ అవుతుంటుందని ఉమ చెప్పటంతో పల్లవి ఓ ఆలోచన చేస్తుంది. తమ జంటతో కొన్నాళ్లు గడిపి తామెంత సంతోషంగా ఉంటున్నామో చూడాలంటూ ఇంటికి పిలుస్తుంది. మరి ఈ విషయంలో భర్తను పల్లవి ఎలా కన్విన్స్ చేసింది? నిజంగానే పల్లవి అరుణ్ తో సంతోషంగా ఉందా? చివరకు కథకు ఎలాంటి ముగింపు దక్కింది?

 

 

cinima-reviews
నిన్ను కోరి

వరుసగా ఆరు హిట్ల(డబుల్ హ్యాట్రిక్)తో నాని టాలీవుడ్ లో ఇప్పుడో సేన్సేషన్. త్వరగా మంచి కథలను ఎంచుకోవటం, అంతే త్వరగా సినిమాలు చేసేయటం, వాటితో వరుసగా హిట్లు కొడుతూ ప్రోడ్యూసర్లకు లాభాల్ని, ప్రేక్షకులకి ఎంటర్ టైన్ ని అందిస్తూ కెరీర్ ను దిగ్విజయంగా ముందుకు సాగించుకుంటున్నాడు. ఇప్పుడు డెబ్యూ డైరక్టర్ శివ నిర్వానాతో కలిసి నిన్ను కోరి అంటూ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మన ముందుకు తెచ్చాడు. మరి సినిమా నాని సక్సెస్ జర్నీని కంటిన్యూ చేశాడా? చూద్దాం...

విశ్లేషణ...

కథ కాస్త కన్విన్స్ గా లేకపోయినా ఓ క్లీన్ అండ్ క్లాసీ మూవీతో డెబ్యూ దర్శకుడు శివ నిర్వానా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ స్లో పేస్ లో సాగుతూ కాస్త బోర్ కొట్టించినప్పటికీ, సెకండాఫ్ లో ఎమోషనల్ కథను ఇంట్రెస్టింగ్ గా చుట్టేశాడు. బలమైన సంభాషణలు, మెలోడీయస్ సాంగ్స్, అన్ని సినిమాలకు బాగా కుదిరాయి. హీరో, హీరోయిన్ల మధ్య ఫస్టాఫ్ లో వచ్చే ప్రేమ సన్నివేశాల కన్నా, మెచ్యూర్డ్ లైఫ్ పేరిట సెకండాఫ్ లో వచ్చే సీన్లే బాగా పండాయి.

ప్రేమ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే క్రమంలో స్వేచ్ఛనే తీసుకున్నప్పటికీ, దాన్ని పాజిటివ్ గానే ఆడియన్స్ రిసీవ్ చేసకుంటారు. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. అదీగాక మాజీ ప్రియుడ్ని ఇంటికొచ్చే ఎపిసోడ్, ఆపై ప్రియుడితో కలిసి భర్తను ఆడుకునే సీన్లు అంత సిల్లీగా అనిపిస్తాయి. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ పీక్స్ లోకి వెళ్లిపోతుంది. క్లైమాక్స్ లోవచ్చే హీరో ఎమోషనల్ సీన్ ది బెస్ట్ పార్ట్ గా నిలిచింది. చివరగా సినిమాను ప్రేక్షకుడు క్యారీ చేసుకుంటూ వెళ్లగలిగే ఆహ్లదకరమైన ముగింపు ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు.

నటీనటుల పరంగా... నాని మరోసారి నేచురల్ నటనతోనే కట్టిపడేశాడు. కామిక్ టైమింగ్ తోపాటు ఎమోషనల్ సన్నివేశాల్లో తన శైలిలో జీవించేశాడు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశంలో సీన్ నాని కెరీర్ లోనే హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నటిగా నివేదా థామస్ ఛాయిస్ ఫర్ ఫెక్ట్ గా కుదిరింది. సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్లను నాని డామినేట్ చేస్తుంటాడు. కానీ, ఇక్కడ మాత్రం కళ్లతోనే హవాభావాలు పండించి నివేదానే హైలెట్ అయ్యింది.

భర్త రోల్ లో ఆది డీసెంట్ రోల్ చేశాడు. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ, బంధువుగా థర్టీ ఇయర్స్ పృథ్వీలు ఆకట్టుకున్నారు.


టెక్నికల్ అంశాల పరంగా.. ఆడియోతోనే మెస్మరైజ్ చేసిన గోపీ సుందర్ స్క్రీన్ మీద కూడా దాన్నేకంటిన్యూ చేశాడు. మెలోడీయస్ పాటలు.. అందుకు తగ్గట్లే బ్యాగ్రౌండ్ మాంచి ఫీలింగ్ ను ఇచ్చాయి. 60-70 శాతం షూటింగ్ ఫారిన్ లోకేషన్లలో షూటింగ్ జరుపుకోవటం, దానికి కార్తీక్ ఘట్టమనేని అందించిన కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ప్రవీణ్ పూడి అందించిన ఎడిటింగ్ వర్క్ 2.15 సినిమాల నిడివితో బాగా కుదిరింది. కోన స్క్రిప్ట్ తోపాటు రిచ్ ప్రోడక్షన్ వాల్యూస్ సినిమాను నిలబెట్టాయి.


ఫ్లస్ పాయింట్లు:

లీడ్ పెయిర్ ఫెర్ ఫార్మెన్స్
కథ, నారేషన్
సెకండాఫ్
మంచి ముగింపు

 

మైనస్ పాయింట్లు

ఫస్టాఫ్ స్లోగా సాగిపోవటం...


విశ్లేషణ...

ఏ మాత్రం అశ్లీలత లేకుండా ఓ మంచి ప్రేమ కథతో తొలి ప్రయత్నంతోనే సక్సెస్ సాధించాడు శివ. ఓవర్సీస్ తోపాటు ఏ క్లాస్ ఆడియన్స్ ను, ముఖ్యంగా ఫ్యామిలీస్ ను సినిమా బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి నాని కెరీర్ లో మరో సక్సెస్ పడిందనే చెప్పుకోవాలి.


చివరగా... నిన్ను కోరి... నాని మళ్లీ గట్టిగా కొట్టాడండోయ్...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.