Dj - Duvvada Jagannadham Telugu Movie Review, Rating, Story

Teluguwishesh దువ్వాడ జగన్నాథమ్ దువ్వాడ జగన్నాథమ్ Allu Arjun starrer Duvvada Jagannadham alias DJ Movie Review and Rating. Stroy Synopsis and Lead Roles Performances. Product #: 83258 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  దువ్వాడ జగన్నాథమ్

 • బ్యానర్  :

  శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్

 • దర్శకుడు  :

  హరీష్ శంకర్

 • నిర్మాత  :

  దిల్ రాజు

 • సంగీతం  :

  దేవీశ్రీప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  అయానంక బోస్

 • ఎడిటర్  :

  ఛోటా కే ప్రసాద్

 • నటినటులు  :

  అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పవిత్రా లోకేష్ తదితరులు

Duvvada Jagannadham Movie Review

విడుదల తేది :

2017-06-23

Cinema Story

కథ:

దువ్వాడ జగన్నాథమ్ శాస్త్రి అలియాస్ డీజే(అల్లు అర్జున్) ఓ డేరింగ్ అండ్ డాషింగ్ కుర్రాడు. సమాజంలోని అన్యాయాలను భరించలేని ఫైర్ అతనిలో గుర్తించిన ఓ సిన్సియర్ పోలీసాఫీసర్(మురళీశర్మ) అండర్ కవర్ పోలీస్ ను చేస్తాడు. ఓవైపు అన్నపూర్ణ ప్యూర్ వెజిటేరియన్ క్యాటరింగ్ నడుపుకుంటూనే మరోపక్క సీక్రెట్ గా ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు శాస్త్రి. మరోపక్క హీరోయిన్ తో (పూజాహెగ్డే) తో రొమాన్స్ సాగిస్తుంటాడు. ఇంతలో అనుకోని ట్విస్ట్ ఒకటి బయటపడుతుంది.

 

అగ్రి డైమండ్ పేరిట జరిగిన భారీ గోల్ మాల్ ను చేధించే పనిలో ఇన్ వాల్వ్ అవుతాడు డీజే. ఈ క్రమంలో రొయ్యల నాయుడు(రావు రమేష్) అనే వ్యాపారవేత్త, హోంమినిస్టర్(పోసాని) ఉన్నారని తెలుసుకుంటాడు. మరి చివరకు శత్రువుల ఆట కట్టించి బాధితులకు న్యాయం ఎలా చేశాడు? విలన్లతో డీజేకు ఉన్న పగేంటి? ఇదే కథ.

cinima-reviews
దువ్వాడ జగన్నాథమ్

టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ హీరో రేసుకు చేరువైన అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ గా మన ముందుకు వచ్చాడు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దర్శకుడు. ప్రతిష్టాత్మక దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై 25వ చిత్రంగా డీజే నిర్మించబడింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:

డీజే కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ చక్కటి స్క్రీన్ ప్లే‌తో కథను ముందుకు తీసుకువెళ్లాడు దర్శకుడు హరీష్. ఫస్టాఫ్‌తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త నెమ్మదించినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్, ఫన్నీ క్లైమాక్స్‌తో మళ్లీ ఊపు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ముగింపు ఫన్నీగా ఇవ్వటం బాగా కుదిరింది. అయితే కంటెంట్ పరంగా పెద్దగా మ్యాజిక్ ఏం చేయలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, యాక్షన్ తో కానిచ్చేసి ద్వితియార్థంలో మాత్రం అసలు కథకు వచ్చేసరికి రెగ్యులర్ ఫ్లేవర్ నే అందించాడు.

ఇక తనకు సూట్ కానీ బ్రహ్మిణ్ స్లాంగ్ తో బన్నీ బాగానే ఇబ్బందిపడ్డట్లు అనిపించకమానదు. పైగా అండర్ కవర్ అనే కాన్సెప్ట్ లో చాలా స్వేచ్ఛే తీసుకున్నాడు. సుబ్బరాజు చచ్చిన తన అమ్మతో మాట్లాడే ఎపిసోడ్ అంతగా పేలలేదు. వెన్నెల కిషోర్ టైమింగ్ ను పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది.

అయితే హీరోయిజం, పవర్ ఫుల్ డైలాగులతో సినిమాను పీక్స్ లోకి తీసుకెళ్లిన డైరక్టర్ రెగ్యులర్ ప్లేవర్ నే ఇంట్రెస్టింగ్ గా అందించే అటెంప్ట్ చేశాడు. చివరి 20 నిమిషాల్లో డీజేగా హైపర్ యాక్టింగ్ తో విలన్లను ఆడుకోవటం, చివర్లో కొడుకు చేతిలోనే రొయ్యల నాయుడు చనిపోయే సీన్ బావుంటుంది.

 క్యారెక్టర్ల విషయానికొస్తే... డీజే గా బన్నీ టూ షేడ్స్ ఉన్న పాత్రల్లో అదరగొట్టాడు. బ్రహ్మిణ్ పాత్రలో యాక్టింగ్ లో కాస్త తడబడ్డప్పటికీ , స్టైలిష్ డీజే గెటప్ లో మాత్రం ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందించాడు. డాన్సుల్లో మరోసారి తానెంటో సీటి మార్ సాంగ్ చూస్తే తెలిసిపోతుంది. ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా వన్ మెన్ షోతో సినిమాను నిలబెట్టాడు.

ఇక హీరోయిన్ పూజా కావాల్సినంత గ్లామర్ డోస్ ను అందించేసింది. బికినీ సీన్ తోపాటు స్పైసీ డైలాగులు, సీన్లు మొహమాటం లేకుండా చేసేసింది. క్యారెక్టర్ పరంగా అంత స్కోప్ లేకుండా పోయింది. వీరి తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించే. డిఫరెంట్ స్లాంగ్ తో పవర్ ఫుల్ విలనీ రోల్ లో మరోసారి తానెంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. పోలీసాఫీసర్ గా మురళీ శర్మ, ఇక క్లైమాక్స్ తన భుజాలపై నడిపించుకున్న సుబ్బరాజు పాత్రలు హైలెట్ గా నిలిచాయి. మిగతా పాత్రలు ఓకే.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... ఆడియోతోనే హిట్ కొట్టిన దేవీశ్రీ ప్రసాద్ పాటలు స్క్రీన్ మీద కూడా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ ఫైట్ నుంచే బ్యాగ్రౌండ్ మొదలుపెట్టిన దేవీ చివరి దాకా ఆఊపును కొనసాగించాడు. పతాక సన్నివేశాల్లో తన స్లైల్ మ్యూజిక్ నే అందించాడు. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ అయానంక బోస్ పిక్చరైజేషన్ ఎంతో అద్భుతంగా ఉంది. డాన్స్, యాక్షన్ ఇలా అన్ని విషయాల్లోనూ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే. మెచ్చుకో.. బడిలో.. సీటి మార్ సాంగ్ కొరియోగ్రఫీ ఎక్సలెంట్. హరీశ్ అందించిన బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు.. పులిని గెలకొద్దనే డైలాగులు బాగా పేలగా, సభ్యసమాజానికి.. డైలాగ్ మాత్రం ఓ పదిసార్లు వచ్చి ఇరిటేట్ చేస్తుంది. ప్రోడక్షన్ వాల్యూస్ చాలా చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్లు:

డీజేగా అల్లు అర్జున్,

ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్,

మ్యూజిక్,

ఇంటర్వెల్ ట్విస్ట్, కామెడీ క్లైమాక్స్

 

 

 

మైనస్ పాయింట్లు:

 రోటీన్ కథ,

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు,

యావరేజ్ సెకండాఫ్

 

తీర్పు:

దువ్వాడ జగన్నాథమ్ తో ఓ డీసెంట్ కామెడీ అండ్ యాక్షన్ మూవీనే అందించాడు హరీష్ శంకర్. కథపరంగా అది అంచనాలు అందుకునే స్థాయిలో లేకపోయినా ఎంటర్ టైనింగ్ స్క్రీన్ ప్లేతో కవర్ చేసే యత్నం చేశాడు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసి 9 వేల కోట్లు కొట్టేసిన ఓ కంపెనీ భ‌ర‌తం హీరో ప‌ట్ట‌డం ఇదే డీజే మెయిన్ స్టోరీ. రొటీన్ కాన్సెప్టే అయినా బ్రహ్మిణ్ ఫ్రేమ్ వర్క్ లో ఇదో టిపికల్ రివెంజ్ డ్రామా.

 

చివరగా... డీజే.. మాములుగానే దంచాడు

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.