Ami Tumi Telugu Movie Review and Rating

Teluguwishesh అమీ తుమీ అమీ తుమీ Ami Tumi Telugu Movie Review andf Rating. Complete Story, Cast Performance and Synopsis. Product #: 83009 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  అమీ తుమీ

 • దర్శకుడు  :

  ఇంద్రగంటి మోహన కృష్ణ

 • నిర్మాత  :

  కేసీ నరసింహరావు

 • సంగీతం  :

  మణిశర్మ

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  పీజీ విందా

 • నటినటులు  :

  అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈషా, తనికెళ్ల భరణి తదితరులు

Ami Tumi Movie Review

విడుదల తేది :

2017-06-09

Cinema Story

కథ... 

రెండు జంటలు తమ ప్రేమను సక్సెస్ చేసుకోవటం కోసం పడే పాట్లే క్లుప్తంగా అమీ తుమీ కథ. అనంత్(అడవి శేష్), దీపిక(ఇషా), విజయ్(అవసరాల), మాయ(అతిథి) లు ఒకరి నోకరు ప్రేమించుకుంటారు. కానీ, పెద్దలు మాత్రం వాళ్ల పెళ్లికి ఒప్పుకోరు. ఇంతలో సీన్ లోని దిగుతాడు శ్రీ చిలిపి(వెన్నెల కిషోర్). అతని ఓ ఆట ఆడుకుంటూనే చివరకు తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించుకుంటారు. ఇంతకీ శ్రీ చిలిపి ఎవరు? అతనికి తెలీకుండానే ఆ జంటలకు ఎలా సాయం చేస్తాడు? శుభం కార్డు ఎలా పడుతుంది అన్నదే కథ. 

 

cinima-reviews
అమీ తుమీ

ఫస్ట్ మూవీ గ్రహణంతోనే జాతీయ అవార్డు సినిమా సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తర్వాత క్లాస్ తరహా సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అష్టా చెమ్మా, గోల్కోండ హైస్కూల్, అంతకు ముందు ఆ తర్వాత బందిపోటుతో ఫ్లాప్ ను చవిచూశాడు. గతేదాడి జెంటిల్మెన్ తో మళ్లీ పెద్ద హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు అమీ తుమీ అంటూ మరో లవ్ స్టోరీ డ్రామాతో వచ్చాడు. టాలెంటెడ్ నటులు అడివిశేష్, అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా ఇషా, అతిథి మాయ్ కల్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

విశ్లేషణ..

ఇదో బకరా కామెడీ సినిమా అని ట్రైలర్ లోనే చూపించేశాడు దర్శకుడు ఇంద్రగంటి. రెగ్యులర్ గా ఇలాంటి డ్రామాలు చాలానే వచ్చినప్పటికీ, సినిమాకి కావాల్సిన వినోదం అందించటంలో మాత్రం ఎక్కడా తడబడలేదు. సినిమా ప్రారంభంలో స్లో గా మొదలై మెల్లిగా ఒక్కో క్యారెక్టర్ ను ఇన్ వాల్వ్ చేస్తూ అసలు కథలోకి ఎంటర్ అవుతాడు. అయితే ఎప్పుడైతే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో.. అప్పటి నుంచి సినిమా స్వరూపమే మారిపోతుంది.

ముఖ్యంగా ఫస్టాఫ్ లో అయితే కిషోర్ క్యారెక్టర్ మిగతా అందరిని డామినేట్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇంటర్వెల్ కు ముందు కూడా చిలిపి డామినేషన్ క్లియర్ గా కనిపిస్తూనే బోరింగ్ మూమెంట్లు లేకుండా ముందుకు సాగుతుంది. అయితే మిగతా పాత్రల ఓవరాక్షన్ అక్కడక్కడ సినిమాకు అడ్డుగా మారాయి. చివరకు తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఆర్టిస్ట్ తో కూడా ఇరిటేటింగ్ మూమెంట్స్ ఇప్పించాడు.

ఇక సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎంత పొదుపు పాటించారో కేవలం రెండే సెట్స్ లో సినిమా కంప్లీట్ చేసిన విధానంను మెచ్చుకోవచ్చు. కానీ, మాస్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవటంతో బీ, సీ ఆడియన్స్ కు అమీ తుమీ రీచ్ కావటం కొంచెం కష్టమే. అది పక్కన పెడితే ఇది ఓ క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్.


ఫెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే...

అడవి శేష్, అవసరాల వారి వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు. అవసరాల తెలంగాణ స్లాంగ్ లో కాస్త ఇబ్బందిగా ఫీలయినప్పటికీ యాక్టింగ్ పరంగా మాత్రం ఎటువంటి మైనస్ లేకుండా చూసుకున్నాడు. టెక్నికల్ గా వీరిద్దరు హీరోలు అయినప్పటికీ సినిమా మొత్తం నడిచేది మొత్తం వెన్నెల కిషోర్ చుట్టే. కెరీర్ లో లాంగ్ లెంగ్త్ రోల్ తో పాటు, కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు.

హీరోయిన్లలో ఇషా ఫర్వాలేదు. పోష్ పోరి ఫేం అతిథి మాత్రం ఇరిటేటింగ్ నటన ఇచ్చిందనే చెప్పాలి. తనికెళ్ల భరణి, మిగతా పాత్రలు జస్ట్ గుర్తుంటాయి అంతే.


టెక్నికల్ విషయానికొస్తే... మణిశర్మ అందించిన పాటలు అంతగా రిజిస్ట్రర్ కాకపోయినప్పటికీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఎప్పటిలాగే అదరగొట్టాడు. పీజీ విందా కెమెరా వర్క్, దానికి తగ్గట్లు ఇంద్రగంటి టేకింగ్ సినిమాను రిచ్ గా చూపించాయి. సినిమా 2 గంటలకే కుదించి ఎడిటింగ్ పని తనం చూపించాడు. లిమిట్ బడ్జెట్. ప్రోడక్షన్ వాల్యూస్ ను బాగా ఎలివేట్ చేశాడు.


ఫ్లస్ పాయింట్లు:
వెన్నెల కిషోర్ వన్ మ్యాన్ షో
డైలాగులు
బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్లు:
రోటీన్ బకరా కామెడీ,
కొన్ని చోట్ల ఓవరాక్షన్
పాటలు

విశ్లేషణ...

అమీ తుమీలో లాజిక్ లు ఉండవు. ఓ ఫ్లోలో కామెడీ వెళ్లిపోతూ ఉంటుంది. కానీ, మినిమమ్ బడ్జెట్ తో, షార్ట్ రన్నింగ్ టైంలో ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ నే అందించాడు దర్శకుడు ఇంద్రగంటి.

చివరగా... అమీ తుమీ జస్ట్ ఫర్ టైం పాస్.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.