Keshava Telugu Movie Review, Rating, Story, Cast and Crew

Teluguwishesh కేశవ కేశవ Find all about Nikhil's Keshava Movie Review and Rating. Along with story highlights in concise here. Product #: 82619 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  కేశవ

 • బ్యానర్  :

  అభిషేక్ పిక్చర్స్

 • దర్శకుడు  :

  సుధీర్ వర్మ

 • నిర్మాత  :

  అభిషేక్ నామా

 • సంగీతం  :

  సన్నీ ఎం ఆర్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  దివాకర్ మణి

 • ఎడిటర్  :

  ఎస్ ఆర్ శేఖర్

 • నటినటులు  :

  నిఖిల్, రీతూ వర్మ, ఇషా కొప్పికర్ తదితరులు

Keshava Movie Review

విడుదల తేది :

2017-05-19

Cinema Story

కథ:

తన కుటుంబం మొత్తం ఓ యాక్సిడెంట్ లో చనిపోవటంతో తానొక్కడే మిగిలి అనాథగా పెరుగుతాడు కేశవ(నిఖిల్). అందరితోపాటు సరదాగా గడిపే ఆ కుర్రాడికి ఓ అరుదైన వ్యాది ఉంటుంది. అందరిలా కాకుండా కుడిపక్క గుండె ఉండటమే కాదు,ఏదైనా ఉద్రేకానికి లోనైతే మాత్రం అతని ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కూడా.అయితే అవేవీ బయటి ప్రపంచానికి తెలీకుండా కాలేజీలో స్టడీస్ కంటిన్యూ చేస్తూ అక్కడే ఓ అమ్మాయిని(రీతూవర్మ) ప్రేమిస్తుంటాడు. ఇదిలా ఉంటే వరుసగా ముగ్గురు పోలీసాఫీసర్ లు అనుమానాదస్పద రీతిలో హత్యకు గురవుతారు. దీంతో రంగంలోకి దిగుతుంది షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్). 

ముందు కేశవనే అనుమానించి అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేస్తుంది.ఆపై ఆ హత్యాకాండలు కొనసాగుతూనే ఉంటాయి. ఇన్వెష్టిగేషన్ లో 12 ఏళ్ల క్రితం కేశవ కుటుంబం యాక్సిడెంట్ లో చనిపోలేదని, కొందరు కుట్ర చేసి వాళ్లను చంపారని తెలుసుకుంటుంది షర్మిలా. అతన్ని ఎలాగైనా నిలువరించాలని యత్నిస్తుంటుంది. అయితే తనకు తగిలిన దెబ్బకు ప్రతీకారంగా ఒక్కోక్కరిని చంపటం మాత్రం కేశవ ఆపడు. చివరకు తన మారణ కాండకు ఎలా పుల్ స్టాప్ పడింది? కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెరపై చూడాల్సిందే.

cinima-reviews
కేశవ

సినిమా సినిమాకు వైవిధ్యతతను చూపిస్తూ.. అదే టైంలో ఎంటర్ టైన్ మెంట్ పాలును మిస్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గత చిత్రం ఎక్కడికి పోతావ్ చిన్నవాడా.. నోట్ల రద్దు ఎఫెక్ట్ ను తట్టుకుని మరీ భారీ లాభాలను అందించింది. ఇప్పుడు తనకు కెరీర్ లో స్వామిరారాతో... మరిచిపోలేని టర్న్ అందించిన దర్శకుడు సుధీర్ వర్మతో కేశవగా మన ముందుకు వచ్చేశాడు. ట్రైలర్ వయొలెన్స్ పాలు ఎక్కువగా ఉండటం, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నట్లు అనిపించటంతో సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. మరి వాటిని కేశవ టీం అందుకుందా? రివ్యూలోకి వెళ్దాం...

 

విశ్లేషణ:

తన పేరేంట్స్ ను చంపిన విలన్లపై పగ తీర్చుకోవాలనుకోవటం, మధ్యలో ఓ సిన్సీయర్ పోలీస్ అడ్డుపడటం ఇలాంటి రివెంజ్ డ్రామా మనకు కొత్తేంకాదు.కానీ, అందుకు కావాల్సిన గ్రిప్పింగ్ నారేషన్, తర్వాత ఏం జరగబోతుందా? అన్న ఇంట్రస్ట్ ను చివరిదాకా మెయింటెన్ చేయటంలో మాత్రం దర్శకుడు సుధీర్ వర్మ సక్సెస్ అయ్యాడు. కాలేజీ వాతావరణం మధ్య మధ్యలో హత్యలు ఇలా ఫస్టాఫ్ ను ఊహించినట్లుగానే నడిపి,హీరో పోలీసులకు దొరికిపోవటమనే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఎంగేజ్ డ్రామాను నడిపాడు.

ఇక పోలీసులనే హీరో ఎందుకు టార్గెట్ చేశాడు,తన కుటుంబంను ఎందుకు చంపారనే ఎలిమెంట్స్ మాములుగానే ఉన్నప్పటికీ, హీరోను పోలీసులను ఫ్రెండ్స్ సేవ్ చేయటం, క్లైమాక్స్ లో తనను పట్టుకోవటానికి వచ్చిన ఆఫీసర్ ప్రాణాలే హీరో కాపాడటం ఇలాంటి పాయింట్లతో ఆకట్టుకున్నాడు. చెప్పాలనుకున్న కథను సింపుల్ అండ్ ట్విస్ట్ లతో, సీరియస్ గా సాగే సెకండాఫ్ లోకొన్ని నవ్వులతో ఆకట్టుకున్నాడు. అయితే ట్రైలర్ లో చూపించిన కుడివైపు గుండె, ఎమోషనల్ అయితే ప్రాణాలకే ముప్పు అన్న కంటెంట్ పై అంచనాలు పెట్టుకుని వెళ్లితే మాత్రం కాస్త నిరాశ కలగొచ్చు. ఎందుకంటే దానిపై సినిమాలో పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేకపోాయాడు దర్శకుడు.


నటీనటుల విషయానికొస్తే... నిఖిల్ సినిమా సినిమాకు ఎంత డెవలప్ అవుతున్నాడో కేశవ మరోసారి ఫ్రూవ్ చేసుకుంది. కొత్త అవతారంతో సినిమాకు రైట్ ఛాయిస్ అన్న రీతిలో నటించాడు.ఇప్పటిదాకా జోవియల్ క్యారెక్టర్లకే పరిమితమైన నిఖిల్ సీరియస్ రోల్ లోనూ ఆకట్టుకుని సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా నిల్చున్నాడు. ఎమోషనల్ సీన్లలో నిఖిల్ యాక్టింగ్ సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్ రీతూ వర్మ కూడా బాగానే మెప్పించింది. అయితే ఆమెది లిమిట్ రోల్ మాత్రమే. ఇక చంద్రలేఖ తర్వాత చాలా ఏళ్ల గ్యాప్ తో నటించిన ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్ గా ఎనర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. నిఖిల్ కు, ఇషాకు వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, హీరో ఫ్రెండ్స్ గా సత్య, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ నవ్వులు పూయిస్తాయి.

 

టెక్నికల్ అంశాల పరంగా.. సన్నీ అందించిన పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పిస్తుంది. ఒకటి రెండు పాటలు ఫర్వాలేదు. ఇక సినిమాకు రన్నింగ్ టైం కూడా జస్ట్ 2 గంటల లోపే కావటం ఇంకా కలిసొచ్చింది. ఈ విషయంలో ఎడిటర్ శేఖర్ ను అభినందించొచ్చు. సీరియస్ గా సాగే సినిమాకు కెమెరా వర్క్ తో ప్రాణంపోశాడు దివాకర్ మణి. డైలాగులు సింపుల్ అండ్ షార్ప్ గా పేలాయి.టేకింగ్ పరంగా ఫుల్ మార్కులు సంపాదించేసుకున్నాడు సుధీర్. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.


ఫస్ల్ పాయింట్లు:
లీడ్ రోల్స్ నటన,
ఎంగేజింగ్ కథ అండ్ స్క్రీన్ ప్లే,
బలమైన సెకండాఫ్,
రన్నింగ్ టైం

 

 

మైనస్ పాయింట్లు:
రొటీన్ రివెంజ్ డ్రామా
సో.. సో... ఫస్టాఫ్


తీర్పు:

ఓ రోటీన్ రివెంజ్ డ్రామానే కాస్త టిపికల్ గా చూపించే యత్నం చేశాడు సుధీర్ వర్మ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోనే నారేషన్,హీరో కి అరుదైన వ్యాధి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డట్లు అనిపించకమానదు. ఓవరాల్ గా నిఖిల్ ఫెర్ ఫార్మెన్స్, టెక్నికల్ టీం వర్క్ సినిమాను నిలబెట్టగలిగాయి.

 

చివరగా... కేశవ... ఓ రోటీన్ రివెంజ్ డ్రామానే

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.