మిస్టర్ రివ్యూ: పాత స్టోరీ.. అదే బకరా కామెడీ | Sreenu Vaitla Mister Movie Review.

Teluguwishesh మిస్టర్ మిస్టర్ Mister Telugu Movie Review. Product #: 82003 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  మిస్టర్

 • బ్యానర్  :

  లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్

 • దర్శకుడు  :

  శీనువైట్ల

 • నిర్మాత  :

  నల్లమల్లపు బుజ్జి, ఠాగూర్ మధు

 • సంగీతం  :

  మిక్కీ జే మేయర్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  గుహన్

 • నటినటులు  :

  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్, ఆనంద్, హరీశ్ ఉత్తమన్, ఈశ్వరి, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు

Mister Movie Review

విడుదల తేది :

2017-04-14

Cinema Story

కథ:

ఆంధ్రా కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామంలో పిచ్చయ్య నాయుడు(నాజర్) గుండప్ప నాయుడుకి ఏళ్లుగా పగ ప్రతీకారాలు ఉంటాయి. గొడవలకు దూరంగా తన కుటుంబ సభ్యులను విదేశాల్లో ఉంచుతాడు పిచ్చయ్య. ఓపెన్ చేస్తే మనవడు జై (వరుణ్ తేజ్) స్పెయిన్ లో జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే పేరెంట్స్ కోసం తిరిగి ఇండియాకు వస్తున్న క్రమంలో మీరాను (హెబ్బా పటేల్) తో ఫ్రెండ్ షిఫ్ చేసి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు.  

ఇక ఇండియాకు వచ్చాక అక్కడ చంద్రముఖి (లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే చూసి ప్రేమలో పడతాడు. ఇలా ఓవైపు ట్రై యాంగిల్ స్టోరీ నడుస్తున్న వేళలో తన ఊళ్లోని పెద్దల పగల మధ్య జై వేలు పెడతాడు. అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి పగవారి కూతురు అని తెలుస్తుంది. మరి వాళ్ల మధ్య గొడవలకు ఎలా ఫుల్ స్టాప్ పెడతాడు? చివరికి ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు జై సొంతం అవుతారు? అన్నదే కథ. 

cinima-reviews
మిస్టర్

ఓ స్టార్ దర్శకుడికి వరుసగా రెండు ఫ్లాపులు పడటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది స్టార్ హీరోలతో ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు భారీ డిజాస్టర్లు అందించాడు దర్శకుడు శీనువైట్ల. దీంతో కెరీర్ నిలదొక్కుకోవాలంటే ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ అవసరం. అలాంటి సమయంలోనే మిస్టర్ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైన్ డ్రామాను మన ముందుకు తెచ్చాడు. అల్లు అర్జున్ చేయాల్సిన ఈ కథ చివరకు మెగా కాంపౌండ్ లోని మరో యువ హీరో వరుణ్ తేజ్ చేతికి వెళ్లింది. మరీ ఈ మిస్టర్ వైట్లకు కావాల్సిన హిట్ ను అందించిందా? లోఫర్ ఫ్లాఫ్ తర్వాత వరుణ్ హిట్ అందుకున్నాడా? చూద్దాం. 

విశ్లేషణ..

పగలు, ప్రతీకారాలతో నలిగిపోయే పెద్దల మధ్య వైరాన్ని తొలగించటం, తన ప్రేమను సక్సెస్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ తో పుట్టగొడుగుల్లాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. మిస్టర్ విషయానికొస్తే శీనువైట్ల కథపరంగా పెద్దగా చేసింది ఏం లేదు. కేవలం ఫస్టాఫ్ మొత్తంను నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో నడపటం తప్పించి. అయితే ట్రైలర్ లు చూసి ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటాడని ఫీలయ్యే ప్రేక్షకులకు సెకండాఫ్ తో దారుణంగా దెబ్బేశాడు వైట్ల.

తన రెగ్యులర్ సినిమాల్లోని బకరా కామెడీనే ఇక్కడా వాడాడు. అందుకోసం లావణ్య త్రిపాఠి శ్రీకృష్ణదేవరాయ ఫ్యామిలీ అంటూ ఓ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ కన్ఫూజ్యన్ డ్రామా మరీ దారుణంగా ఉండటం, ఫ్యామిలీ ఎమోషన్లు పెద్దగా పేలకపోవటం, ఒకానోక దశలో సినిమా అంతా గందరగోళంగా అనిపిస్తుంటుంది. ఫస్టాఫ్ లో వచ్చే రఘుబాబు ఊపిరి స్ఫూఫ్, డైరక్టర్ గా థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసే కామెడీ బాగా పేలాయి. కానీ, సెకండాఫ్ లో కామెడీ కాస్త కూడా పండలేదు.

ఇక కొన్ని పాటలు, రిచ్ ప్రొడక్షన్ వాల్య్సూ సినిమాను బలంగా నిలబెడితే, సెకండాఫ్ మొత్తం పేలవంగా తీర్చిదిద్దటం, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను సరిగ్గా డెవలప్ చేయకపోవటం పెద్ద మైనస్ గా మారింది.

నటీనటుల విషయానికొస్తే.. వరుణ్ తేజ్ మునుపటి సినిమాల కంటే ఇందులో అందంగా కనిపించాడు. యాక్టింగ్ ఫర్వాలేదనిపించేలా చేశాడు. డాన్సులు జస్ట్ ఓకే అయితే ఫైట్లలో మాత్రం ఎమోషన్ ను బాగా పండించాడు. ఇక హీరోయిన్లలో లావణ్య ఉన్నంతలో ఫర్వాలేదు. అయితే ప్రతీసారీ హీరోను హైలెట్ చేస్తూ చెప్పే డైలాగులు కాస్త అతిగా అనిపిస్తుంటాయి. హెబ్బా గెస్ట్ రోల్ అన్నట్లుగా కాసేపు మెరుస్తుంది. ఆనంద్, హరీశ్ ఉత్తమన్, చంద్రమోహన్ ఇలా అంతా ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... మిక్కీ జే మేయర్ పాటలతోపాటు బ్యాగ్రౌండ్ పరంగా పెద్దగా పని తనం చూపలేదనిపిస్తుంది. అయితే ప్రియ స్వాగతం, నీ మీద మనసాయేరా పాటలు మాత్రం కాస్త ఫర్వాలేదనిపిస్తాయి. ఫారిన్ లోకేషన్లతోపాటు పల్లెటూరి అందాలను కేవి గుహన్ సినిమాటోగ్రఫీలో బాగా చూడొచ్చు. శ్రీధర్ సీపాన అందించిన డైలాగులు ఫస్టాప్ ఆసాంతం కితకితలు పెట్టిస్తాయి. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ఫస్ట్ పాయింట్లు:

ఫస్టాఫ్
పాటలు
కెమెరా వర్క్

 

మైనస్ పాయింట్లు:
బోరింగ్ సెకండాఫ్

తీర్పు:

తన మార్క్ సినిమాతో వండర్స్ చేస్తాడనుకున్న శీనువైట్ల మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. పాత తెలుగు సినిమాలను రిఫరెన్స్ లు తీసుకుని ఏదో కొత్తగా ట్రై చేశాడన్న మాటే కానీ, తన మార్క్ ను మాత్రం వదల్లేకపోయాడు. మాస్ సంగతి పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కాస్త విసుగుపుట్టేంతగా ఓవర్ ఎమోషన్లతో నింపేయటంతో సినిమా తేడా కొట్టింది. కామెడీని స్టైల్ మార్చి ట్రై చేసుంటే ఫలితం మరోలా ఉండేదేమో.


చివరగా... జస్ట్ మాములుగానే ఉంది మిస్టర్.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.