గురు రివ్యూ: ఎంగేజింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా | Guru Movie Review.

Teluguwishesh గురు గురు Venkatesh Guru Movie Review. Product #: 81765 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  గురు

 • బ్యానర్  :

  వై నాట్ స్డూడియోస్

 • దర్శకుడు  :

  సుధా కొంగర

 • నిర్మాత  :

  వై నాట్ స్టూడియోస్

 • సంగీతం  :

  సంతోష్ నారాయణ

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  కె ఎ శక్తివేల్

 • ఎడిటర్  :

  సతీస్ సూర్య

 • నటినటులు  :

  వెంకటేష్, రితికా సింగ్; నాజర్, ముంతాజ్ సర్కార్, జకీర్ హుస్సెన్, రఘుబాబు, అనితాచౌదరి తదితరులు

Guru Movie Review

విడుదల తేది :

2017-03-31

Cinema Story

కథ:

సెలక్షన్ కమిటీ రాజకీయాలతో దేశానికి మెడల్ సాదించాలన్న కలకు దూరమౌతాడు బాక్సర్ ఆదిత్య రావు(వెంకటేష్). అయితే రీఎంట్రీలో ఉమెన్ బాక్సింగ్ కోచ్ గా అతన్ని నియమిస్తారు. స్వతహాగా కోపిష్టి అయిన ఆది, స్టూడెంట్స్ తో కఠినంగా ప్రవర్తిస్తుండటంతో అతన్ని ఢిల్లీ నుంచి వైజాగ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఇదిలా ఉంటే ఓ కొట్లాటలో కూరగాయలు అమ్ముకునే రామేశ్వరి(రితికా సింగ్) ని చూసిన ఆది ఎలాగైనా ఆమెను బాక్సర్ చేయాలనుకుంటాడు. 

 

అప్పటికే రాముడు అక్కడ లక్ష్మీ(ముంతాజ్ సర్కార్) కూడా బాక్సింగ్ ట్రైనింగ్ లో ఉంటుంది. దీంతో ఆ ఇద్దరినీ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేలా ట్రైయినింగ్ ఇచ్చేందుకు తనతోపాటు తీసుకెళ్తాడు. అయితే సానబెట్టే క్రమంలో ఆది స్పెషల్ కేర్ తీసుకోవటం నచ్చని లక్ష్మీ రాముడును ఆదికి, ట్రైనింగ్ కు దూరం చేస్తుంది. కానీ, రాముడు మాత్రం తన ట్రైనింగ్ ను కొనసాగిస్తుంది. మరి ఆది, రాముడు మధ్య అపోహలు ఎలా తొలగిపోతాయి? రాముడు గురు దక్షిణ ఇస్తుందా? ఆది తన కల నెరవేరుతుందా? అన్నదే కథ. 

cinima-reviews
గురు

సీనియర్ హీరో సోలో హీరోగా హిట్ అందుకుని చాలా కాలమే అయ్యింది. అంచనాలతో వచ్చిన బాబు బంగారం నిరాశపరచటంతో మళ్లీ అచ్చొచ్చిన ఫ్యామిలీ డ్రామా తోనే సినిమా తీయాలని ముందుగా ఫ్లాన్ చేశాడు. అయితే మిగతా వారంతా ప్రయోగాలు చేస్తుండటంతో తాను మాత్రం ఎందుకు వెనకడుగు వేయటం అనుకుని ఓ రీమేక్ కు రెడీ అయిపోయాడు. అదే మాధవన్ హీరోగా కోలీవుడ్ లో వచ్చిన ఇరుద్ధి సుత్రు(హిందీలో సాలా ఖడ్డూస్). మాతృక దర్శకురాలు సుధా కొంగరే గురు పేరుతో దీనిని తెరకెక్కించింది. మరి ఈ చిత్రం వెంకీకి అవసరమైన సక్సెస్ అందించిందా? ఇప్పుడు చూద్దాం...

విశ్లేషణ...

బాలీవుడ్ లో స్పోర్ట్స్ తరహా ఎమోషనల్ డ్రామాలు ఏడాదికి నాలుగైదు వస్తాయి. కానీ, తెలుగులో అలాంటి సినిమాలు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. చిన్న చిన్న సినిమాలు వచ్చినప్పటికీ ఓ స్టార్ హీరో ఇలాంటి ప్రయోగం చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇంతటి టఫ్ సబ్జెక్టును ప్రేక్షకులకు రీచ అయ్యేలా చేయటంలో దర్శకురాలు సుధా కొంగర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎంటర్ టైన్ మెంట్ అనే ఎలిమెంట్ లేకుండా కేవలం ఎమోషన్స్ తో చివరి దాకా కథను క్యారీ చేశాడు.

అయితే సెకండాఫ్ లో మాత్రం ఆ ఎమోషనల్ మరీ ఎక్కువైందేమో అనిపించకమానదు. సన్నివేశాల సాగదీత కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. బాక్సింగ్ మ్యాచ్ లు డ్రమటిక్ గా అనిపిస్తాయి. ఇక మాస్ ను మెప్పించే అంశాలు లేకపోవటం మరో మైనస్. అదిగాక వెంకీ నుంచి ఆశించే వినోదం లేకపోవటంతో ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోవటం కొంచెం కష్టమే. ఆ కంప్లైంట్ లను లైట్ తీస్కుంటే గురు బాగానే ఎక్కుతుంది.

నటీనటుల విషయానికొస్తే... ఎప్పుడూ ఫ్యామిలీ సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపించే వెంకీ సీరియస్ లో మెప్పించాడు. ఈ ఏజ్ లో కూడా కోచ్ పాత్ర కోసం పడ్డ కష్టం తెరపై కనిపిస్తోంది. ఇంతకు ముందు మాస్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఇందులో మాత్రం కొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించాడు. వెంకీ నోటి నుంచి వచ్చే డైలాగులు కాస్త షాకింగ్ కు గురిచేసినా, ఎంజాయ్ చేయొచ్చు. జింగిడి సాంగ్ కాస్త ఊపు తెప్పిస్తుంది.  ఇక హీరోయిన్ రితికా సింగ్ మాతృక మాదిరిగానే ఫెర్ ఫార్మెన్స్ తో చించేసింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. నెగటివ్ రోల్స్ ఉన్న పాత్రలో జకీర్ హుస్సేన్, ముంతాజ్ సర్కార్ ఆకట్టుకున్నారు. నాజర్ కామెడీ టైమింగ్ బావుంది. రఘుబాబు, అనితా చౌదరి లిమిట్ లో చేశారు. మిగతా రోల్స్ ను ఒరిజినల్ వర్షనల్ వాళ్లతోనే చేయించేశారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... కబాలి ఫేమ్ సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో బాగా క్యారీ అయ్యింది. నటుడు, రైటర్ హర్షవర్థన్ అందించిన డైలాగులు సింపుల్ గా పేలాయి. ఇక డార్క్ బ్యాగ్రౌండ్ లో ఓ డిఫరెంట్ టైప్ సినిమాటోగ్రఫీని అందించాడు కే ఏ శక్తివేల్. వై నాట్ వారి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
లీడ్ రోల్స్ నటన,
ఎమోషనల్ స్టోరీ,
ఇంటర్వెల్, క్లైమాక్స్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్లు:
నిదానంగా సాగే కథ,
సెకండాఫ్ లో కొన్ని సీన్లు


తీర్పు:

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా వెంకీ సినిమాలు చేసింది ఒక ఎత్తు అయితే గురు ఇంకో ఎత్తు. క్లాస్ టేకింగ్ తో దర్శకురాలు సుధా కొంగర ఓ డీసెంట్ స్పోర్ట్స్ సినిమాను ఆద్యంతం ఆసక్తిగా తెరకెక్కించింది. స్లో పేస్ నారేషన్ సంగతి పక్కనబెడితే మాస్ ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి మరి.

చివరగా... గురు ఓ ఎమోషనల్ స్పోర్ట్ డ్రామా

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.