కాటమరాయుడు రివ్యూ: పవర్ ప్యాక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | Katamarayudu Review.

Teluguwishesh కాటమరాయుడు కాటమరాయుడు Pawan kalyan's Katamarayudu Movie Review. Product #: 81637 3.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  కాటమరాయుడు

 • బ్యానర్  :

  నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్

 • దర్శకుడు  :

  కిషోర్ కుమార్ పార్దసాని(బాబీ)

 • నిర్మాత  :

  శరత్ మరార్

 • సంగీతం  :

  అనూప్ రూబెన్స్

 • సినిమా రేటింగ్  :

  3.53.53.5  3.5

 • ఛాయాగ్రహణం  :

  ప్రసాద్ మూరెళ్ల

 • ఎడిటర్  :

  గౌతంరాజు

 • నటినటులు  :

  పనవ్ కళ్యాణ్, శృతీ హాసన్, అలీ, నాజర్, అజయ్, ప్రదీప్ రావత్; రావు రమేష్, తరుణ్ అరోరా తదితరులు

Katamarayudu Movie Review

విడుదల తేది :

2017-03-24

Cinema Story

కథ:
సీమలోని తాళ్లపాక గ్రామానికి కాటమరాయుడే(పవన్ కళ్యాణ్) పెద్ద దిక్కు. ప్రజలు, తన నలుగురు తమ్ముళ్లే(శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు, కృష్ణ చైతన్య) అతని లోకం. అందుకోసం పెళ్లికి కూడా దూరంగా ఉంటాడు. అయితే ప్రేమించిన అమ్మాయిలతో తమ పెళ్లిళ్లు కావాలంటే ముందు అన్నను ఓ ఇంటి వాడిని చేయాలని తమ్ముళ్లు ఫ్లాన్ వేస్తారు. ఇందుకోసం వాళ్ల లాయర్ లింగబాబు(అలీ) సాయం తీసుకుంటారు. ఆ ఊళ్లోకి వచ్చిన అవంతి (శృతీహాసన్) అనే క్లాసిక్ డాన్సర్ తో కాటమరాయుడిని కనెక్ట్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. అదే సమయంలో తనకు తెలీకుండానే అవంతికు రాయుడు కనెక్ట్ అయిపోతాడు. అయితే ఒక దాడిలో కాటమరాయుడు హింస రూపం చూసి అతని నుంచి దూరంగా వెళ్లిపోతుంది.

దీంతో అవంతి కోసం కాటమరాయుడు అండ్ బ్రదర్స్ ఆమె ఊరికి వెళ్లి అనూహ్య పరిణామాల మధ్య ఆమె ఇంట్లోనే తిష్ఠ వేస్తారు. ఆ కుటుంబానికి హింస అంటే నచ్చకపోవటంతో ఎలాగైనా వాళ్లను మెప్పించే యత్నం చేస్తుంటాడు. అదే సమయంలో ఎలసరి బాను(తరుణ్ ఆరోర్) అనే వ్యక్తి నుంచి అవంతి కుటుంబానికి పొంచి ఉన్న ముప్పును తెలుసుకున్న కాటమరాయుడు ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తాడు. చివరకు కాటమరాయుడి గురించి నిజం తెలుసుకున్న అవంతి తండ్రి(నాజర్) ఏం చేస్తాడు? ఎలసరి భాను కు ఆ కుటుంబం పై పగ ఎందుకు? చివరకు ఏమౌతుంది అన్నదే కథ...

cinima-reviews
కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్ తో మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో సేఫ్ సైడ్ ఫార్ములాకు ఓటేసి అజిత్ వీరమ్ ను కాటమరాయుడు గా రీమేక్ చేసేశారు. గోపాల గోపాల ఫేం డాలీ దీనికి దర్శకుడు. ఆకట్టుకునే పవన్ లుక్కు, సైలెంట్ గా అంచనాలు పెంచేసుకున్న ఈ మూవీ ఈరోజే భారీ ఎత్తున్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. మరి పవన్ ఆ అంచనాలను అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ...

కథలో పెద్ద బ్యాంగ్ లు లేకపోయినా సుత్తి లేకుండా సినిమాను తెరకెక్కించటం దర్శకుడికి కత్తి మీద సాములాంటిదే. పైగా ఇది రీమేక్, తెలిసిన కథే కావటంతో పెద్దగా మ్యాజిక్ లేం ఉండవని అనుకోవటం కామన్. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులే చేశాడు దర్శకుడు డాలీ. సినిమా స్టార్టింగ్ నుంచే ఫాస్ట్ గా మూవీ సాగిపోతుంటుంది. ప్రజల కోసం కాటమరాయుడి ఆరాటం, తమ్ముళ్లు తమ లవ్ కోసం ఆడాళ్లకు దూరంగా ఉండే అన్నను లవ్ లో పడేలా చేయటం, వాళ్ల కంట పడకుండా అదే అమ్మాయికి సైలెంట్ గా లైన్ వేయటం, అలీ కామెడీ ట్రాక్, మధ్య మధ్యలో ఫైట్లు ఇలా సరదాగా సాగిపోతుంటుంది సినిమా. అయితే ఇంటర్వెల్ నుంచి బ్యాంగ్ నుంచే కథలో ఎగ్జయిట్ మెంట్ తగ్గిపోతుంటుంది.

విలన్లు హీరోయిన్ ఫ్యామిలీ వెంట పడటం, వారిని హీరో అడ్డుకుంటుండటం, అందుకోసం మూడు ఫైట్లు అదంతా డ్రమటిక్ గా అనిపిస్తుంది. రెండో భాగంలో కామెడీ పాలు తక్కువగా ఉండటం కూడా పెద్ద మైనస్ అయ్యింది. చివర్లో క్లైమాక్స్ కూడా పరమ రోటీన్ గానే ఉంటుంది. మాతృకలో బాగా పేలిన సీన్లు ఇక్కడ వర్కవుట్ కాకపోవటం విశేషం. జివ్వు జివ్వు కూడా అభిమానుల కోసమే అన్నట్లు ఉంది. పంచె కట్టులో పవన్ ఆకట్టుకున్నప్పటికీ పాటల్లో కాస్టూమ్స్ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టలేదనిపిస్తోంది. వెరసి ఫస్టాఫ్ లో ఆకట్టుకునే కథ ఉండగా, సెకండాఫ్ లో మాత్రం డ్రా బ్యాక్ అయ్యింది.

నటీనటుల విషయానికొస్తే... ఖచ్ఛితంగా ఇది పవన్ వన్ మ్యాన్ షోనే. పంచె కట్టు లుక్కుతోపాటు యాంగ్రీ మెన్ గా పవన్ నటన ఆకట్టుకుంటుంది. పంచ్ డైలాగ్స్, ఫైట్లు డెలివరీ పవన్ ను ఫర్ ఫెక్ట్ గా సూటయ్యాయి. ఓవైపు హుందా నటనతోపాటు రొమాంటిక్ యాంగిల్ లో చిలిపి తనం ప్రదర్శించాడు. అయితే డాన్సుల విషయంలో ఇంకాస్త శ్రద్ధపెట్టి ఉండాల్సి ఉంది. శృతీ యాక్టింగ్ పరంగా చేసిందేమీ లేకపోయినప్పటికీ, పాటల్లో మాత్రం చాలా క్యారెక్టరైజేషన్ కి దూరంగా టూమచ్ వైవిధ్యం(ఎక్స్ పోజింగ్) చూపించింది. హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ ఫుల్ గా వర్కవుట్ అయ్యింది. తమ్ముళ్లుగా అజయ్, శివ బాలాజీ, కమల్ కామరాజు, కృష్ణ చైతన్య లు ఫర్ ఫెక్ట్ గా సూటయ్యారు. అలీ కామెడీ ఫర్వాలేదు.

ఇక విలన్లుగా చేసిన తరుణ్ ఆరోరా, ప్రదీప్ సింగ్ రావత్, రావు రమేష్ లు పెద్దగా హెల్ప్ కాలేకపోయారు. వీక్ విలనిజం స్పష్టంగా కనిపించింది. నాజర్, పవిత్రా లోకేష్ ఓకే.

టెక్నికల్ విషయానికొస్తే.. మ్యూజిక్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అనూప్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లో వైవిధ్యం చూపించాడు. పాటలు ప్లేస్ మెంట్, విజువల్ గా బాగానే ఉన్నప్పటికీ అంతగా ఎక్కవు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. సెకండాఫ్ లో ఎడిటింగ్ కు పని చెప్పాల్సి ఉంది. అయితే రన్ టైం సినిమాకు ఫ్లస్ అయ్యింది. పవర్ పుల్ డైలాగులు పేలాయి. వాసువ‌ర్మ‌, దీప‌క్ రాజ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వ‌ర‌కు ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.ఫ్లస్ పాయింట్లు:
పవన్ కళ్యాణ్,
ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథ
పంచ్ డైలాగులు, ఫైట్లు
కెమెరావర్క్
కామెడీ

 

మైనస్ పాయింట్లు:
సెకండాఫ్
స్ట్రాంగ్ విలనిజం లేకపోవటం

తీర్పు:

ఓ తమిళ సినిమాను తెలుగు నెటివిటికి తగ్గట్లు పైగా పవన్ లాంటి స్టార్ హీరోతో కంప్లీట్ పల్లెటూరి వాతావరణంలో ఆహ్లదంగా తెరకెక్కించాడు దర్శకుడు డాలీ. ఫస్టాప్ వరకు బాగానే నడిచిన కథ సెకండాఫ్ లో కాస్త గాడి తప్పినట్లు అనిపించక మానదు. అయితే క్లాస్ ఫ్లస్ మాస్ ఫార్మాట్‌లో క‌థ‌నం న‌డిపించ‌డంతో సినిమాకు పెద్ద హెల్ప్ అయ్యింది.

చివరగా... కాటమరాయుడు... పవన్ కుమ్మేశాడు

 

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.