నేనోరకం రివ్యూ... ఎంగేజింగ్ థ్రిల్లరే, కానీ... | Neno Rakam Review.

Teluguwishesh నేనోరకం నేనోరకం Neno Rakam Telugu Movie Review. Product #: 81530 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    నేనోరకం

  • బ్యానర్  :

    విబా ఎంటర్ టైన్ మెంట్

  • దర్శకుడు  :

    సుదర్శన్ సాలేంద్ర

  • నిర్మాత  :

    దేప శ్రీకాంత్

  • సంగీతం  :

    మహిత్ నారాయణన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • నటినటులు  :

    సాయిరామ్ శంకర్, రష్మీ మీనన్, శరత్ కుమార్, ఆదిత్య మీనన్, ఎమ్మెస్ నారాయణ, వైవా హర్ష

Neno Rakam Movie Review

విడుదల తేది :

2017-03-17

Cinema Story

కథ:

అనాథ అయిన గౌతమ్(సాయిరాం శంకర్) ఓ లోన్ ఏజెన్సీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. ఓ రోజు స్వేచ్ఛ(రేష్మి మీనన్) ను చూసి లవ్ లో పడిపోయి ఎలాగోలా ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఓ అపరిచితుడు(శరత్ కుమార్) స్వేచ్ఛను కిడ్నాప్ చేస్తాడు. తాను చెప్పిన పనులు చేస్తేనే స్వేచ్ఛను వదిలేస్తానన్న కండిషన్ పెట్టడంతో గౌతమ్ చిక్కుల్లో పడతాడు. మరి తన ప్రేయసి కోసం గౌతమ్ నేరాలు చేస్తాడా? ఆ కిడ్నాపర్ కు గౌతమ్-స్వేచ్ఛలనే ఎందుకు టార్గెట్ చేస్తాడు? చివరకు ఏం జరుగుతుంది అన్నదే కథ. 

 

cinima-reviews
నేనోరకం

పూరీ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయిరాం శంకర్ హీరోగా నిలదొక్కుకునేందుకు చేసిన యత్నాలన్నీ విఫలం అవుతూనే వస్తున్నాయి. వచ్చిన సినిమాలు వచ్చినట్లే షెడ్డుకెళ్లిపోవటంతో ఇక సాయి పని అయిపోయిందని అంతా భావించారు. అయితే కొత్త దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర తో కలిసి నేనో రకం అంటూ మన ముందుకు వచ్చాడు. చాలా కాలం క్రితమే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొందరు టాప్ స్టార్ల విషెష్ తో హైప్ పెంచుకున్న ఈ చిత్రం మరి అంచనాలను అందుకుందా? ఇప్పుడు చూద్దాం...

విశ్లేషణ:

ఓ రెగ్యులర్ లవ్ స్టోరీ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో దర్శకుడు తెరకెక్కించిన స్టోరీ యే నేనో రకం. సాధారణంగా ఇలాంటి స్క్రీన్ ప్లే తో హాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సినిమాకు ఆయువు పట్టులాంటి సెకండాఫ్ ను ఎంత బాగా తీర్చి దిద్దాడో దర్శకుడు సుదర్శన్ ఫస్ట్ హాఫ్ ను అంత నిర్లక్ష్యం చేశాడు. కేవలం పస లేని లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ లతో ఫస్టాఫ్ ను నడిపించాడు. అయితే ఇంటర్వెల్ లో హీరోయిన్ కిడ్నాప్ దగ్గరి నుంచి కథలో ఇంట్రెస్టింగ్ విషయాలు మొదలౌతుంటాయి. ముఖ్యంగా శరత్ కుమార్ పాత్ర సాయి మధ్య నడిచే ట్రాక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. లవర్ ను పెట్టుకుని ఆడుకునే విధానం ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు.


చివర్లో మళ్లీ కథ గాడి తప్పినట్లు అనిపించినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయటం, అది కాస్త కొత్తగా ఉండటం మళ్లీ సినిమాకు ఊపు తెస్తాయి. ఒక మంచి పాయింట్ ను ఢిపరెంట్ యాంగిల్ లో చూపించిన విధానం బాగుంది. అయితే ఎమ్మెస్ నారాయణ, వైవా హర్ష కామెడీ ఎంత మాత్రం పండలేదు కదా బోర్ కొట్టించకమానదు. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే రొమాన్స్ కూడా ఎబ్బెట్టుగా ఉంది. తొలి భాగంలో కాస్త ఇంట్రెస్టింగ్
ఎంటర్ టైన్ మెంట్ ను అందించి ఉంటే సినిమా ఇంకా బావుండేది.

 


నటీనటుల విషయానికొస్తే... సాయిరాం శంకర్ కెరీర్ లోనే బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంతకు ముందుకు చేసిన చిత్రాల కంటే మెచ్యూర్డ్ గా నటించాడు. అయితే సాంగ్స్ , కామెడీలో మాత్రం రెగ్యులర్ గానే కనిపించాడు. హీరోయిన్ రష్మి లుక్స్ తో ఆకట్టకుంది. పెద్దగా సీన్లు పడకపోవటంతో పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. ఇక కీలక పాత్రలో కనిపించిన కోలీవుడ్ సీనియర్
హీరో శరత్ కుమార్ ఫ్లస్ పాయింట్ అయ్యాడు. ఈ సీనియర్ నటుడి ఎంపికలో దర్శకుడిని అభినందించాల్సిందే. కనిపించకుండా హీరోను ఓ ఆట ఆడుకునే పాత్రలో మెప్పించాడు. ఒక రకంగా సెకండాఫ్ అంత బలంగా నిలవటానికి ఆ పాత్రే కీలకం అయ్యింది. ఓ పోలీసాఫీసర్ గా ఆదిత్య మీనన్ ఆకట్టుకున్నాడు. ఎమ్మెస్ చనిపోయి చాలా కాలం కావటంతో కామెడీ కూడా ఒక రకంగా అనిపిస్తుంది.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... మహిత్ నారాయణ్ అందించిన పాటలు అంతగా గుర్తుండవు. కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. డైలాగులు డీసెంట్ గా ఉన్నాయి. అనవసర సన్నివేశాలు ఎక్కువ ఉండటం ఎడిటింగ్ మైనస్ గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

 

తీర్పు:
ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో ఓ డీసెంట్ చిత్రాన్నే అందించాడు దర్శకుడు సుదర్శన్. సాయి రాంశంకర్, శరత్ కుమార్ ల నటన సినిమాకు అదనపు బలంగా నడిచాయి. అయితే ఫస్టాఫ్ పై కూడా దృష్టిసారించి ఉంటే ఫైనల్ అవుట్ ఫుట్ ఇంకోలా ఉండి ఉండేది.

చివరగా... నేనోరకం... థ్రిల్లింగ్ సెకంఢాఫ్ కోసం...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.