ద్వారక రివ్యూ | Dwaraka Movie Review.

Teluguwishesh ద్వారక ద్వారక Dwaraka Telugu Movie Review. Product #: 81268 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ద్వారక

 • బ్యానర్  :

  లెజెండ్ సినిమా

 • దర్శకుడు  :

  శ్రీనివాస్ రవీంద్ర

 • నిర్మాత  :

  ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెనుబోటు

 • సంగీతం  :

  సాయి కార్తీక్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  శ్యామ్ కే నాయుడు

 • ఎడిటర్  :

  ప్రవీణ్ పూడి

 • నటినటులు  :

  ప్రవీణ్ దేవరకొండ, పూజా జావేరీ, మురళి శర్మ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, కాలకేయ ప్రభాకర్, సాయి తదితరులు

Dwaraka Telugu Movie Review

విడుదల తేది :

2017-03-03

Cinema Story

కథ:

ఎర్ర శీను (విజయ్ దేవరకొండ) స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే యువకుడు. ఈ క్రమంలో ఓ రోజు ద్వారక అనే అపార్ట్ మెంట్ కు వెళ్తాడు. అక్కడ అనుకోని ఘటన కారణంగా కృష్ణానంద బాబాగా అవతారం ఎత్తుతాడు. జనాలందరూ శీనును బాబాగా నమ్ముతున్న టైంలో తాను ప్రేమించిన అమ్మాయిని(పూజా జావేరీ) తన వద్దకే తెస్తారు ఆమె తల్లిదండ్రులు. అది చూసి శీనుపై మరింత ద్వేషం పెంచుకుంటుంది హీరోయిన్. 

 

అదే టైంలో ఓ ముఠా హీరోను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన 2 వేల కోట్లను కొట్టేయాలని ఫ్లాన్ చేస్తుంటుంది. ఇది చాలదన్నట్లు ఓ నాస్తికుడు(మురళీ శర్మ) బాబా గుట్టు బయటపెట్టేందుకు ట్రై చేస్తుంటాడు. ఓవైపు ముఠా, మరోవైపు నాస్తికుడు... వీళ్ల మధ్య శీను ఎలా నలిగిపోయాడు. చివరికి ఎలా బయటపడ్డాడు. తానంటే అసహ్యించుకునే అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? చివరికి బాబా అవతారం ఎలా చాలిస్తాడు అన్నదే కథ.  

cinima-reviews
ద్వారక

పెళ్లి చూపులు సినిమాతో వన్ మూవీ సెన్సేషన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు. ఆ లిస్ట్ లో వచ్చిన తొలి సినిమా ద్వారక. నోట్ల రద్దు కారణంగా డిలే అయిన ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాస్త ఆలస్యంగా ఈ రోజు మన ముందుకు వచ్చింది. మరి బాబా అవతారంలో విజయ్ ఏ మేర ఆకట్టుకున్నాడు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే...  

విశ్లేషణ:

విజయ్ లాంటి యూత్ లో క్రేజ్ ఉన్న హీరోతో బాబా వేషం వేయించి దర్శకుడు శ్రీనివాస్‌ రవీంద్ర ఎలాంటి అవుట్ పుట్ రాబడతాడో కొన్ని డౌట్లు రేకెత్తాయి. అయితే కథలో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకులు లీనమయ్యేలా సినిమాని ముందుకు నడిపించారు. ఫస్టాఫ్ మొత్తం కామెడీ అండ్ లవ్ ట్రాక్ తో సాగిపోగా ద్వితీయార్థంలో కథగా చెప్పడానికి దర్శకుడి దగ్గర ఏమీ మిగలదు. అందుకే స్లో అండ్ సీరియస్ గా సాగిపోయే కథలో తెలివిగా అక్కడ కూడా ఎంటర్ టైన్ మెంట్ నే ఎలివేట్ చేశాడు.

తర్వాతి సన్నివేశాల్లో ఏం జరగబోతోంది? అనేది ప్రేక్షకుడు ముందుగానే వూహించినప్పటికీ అది ఎక్కడా ఆగకుండా స్పీడ్ గా వెళ్లిపోతుంటుంది. దొంగ శీను, బాబాగా మారే పరిస్థితులు, అతని విన్యాసాలు, జనాల మూఢ భక్తి, మీడియా చేసే అతి ఇలా వీటితో కూడిన సన్నివేశాలతో సినిమా నాన్ స్టాప్ గా సాగిపోతుంది. ఇక బాబా గుట్టురట్టు చేయడానికి వచ్చే నాస్తికుడిగా మురళీశర్మ ఎంట్రీతో కథ మరింత ఆసక్తిగా తయారవుతుంది. కథానాయకుడు దొరికిపోతాడా.. లేదా? అనే ఎగ్జయిట్ మెంట్ ఆడియన్స్ లో క్రియేట్ చేయటంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.

నటీనటుల విషయానికొస్తే... పెళ్లిచూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ రెండు సినిమాల మధ్య నటనలో వ్యత్యాసం చూపించగలిగాడు విజయ్‌. పాత్రకు తగ్గట్టు హుషారుగా నటించారు. వినోదం చేయగలనని నిరూపించుకున్నారు. కథనాయిక పాత్రకు అంతగా స్కోప్‌ లేదు. కానీ ఉన్నంతలో తను కూడా మెప్పించారు. మురళీ శర్మ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. పృథ్వీతో సహా కామెడీ గ్యాంగ్‌ అంతానవ్వులు పంచింది. ప్రకాశ్‌రాజ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్రను కథలో కీలకం చేసుకున్నారు దర్శకుడు. హీరో ఫ్రెండ్స్ సహా మిగతా పాత్రలు బాగా పండాయి.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. సాయి కార్తీక్ పాటలు వినడానికి ఓకే అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ లో మాత్రం మంచి ఫలితం ఇచ్చాడు. చిత్రీకరణ పరంగా ఎక్కువ మార్కులు పడతాయి. విజువల్‌గా శ్యామ్ కే నాయుడు సినిమాను రిచ్‌గా చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. 

 

ఫ్లస్ పాయింట్లు:

విజయ్‌ దేవరకొండ నటన
ఎంటర్ టైనింగ్ స్టోరీ

మైనస్ పాయింట్లు:
సెకండాఫ్ లో స్లో నారేషన్
స్ట్రాంగ్ విలనిజం లేకపోవటం

 

తీర్పు:

ఓ ప్రెష్ ఫ్లాట్ తో నేరేషన్ చేసుకుంటూ కథను తెరకెక్కించాడు దర్శకుడు.


చివరగా.. ద్వారక.. కలర్ పుల్ గా సాగిపోయే ఓ కామెడీ ఎంటర్ టైనర్..

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.