విన్నర్ రివ్యూ: చప్పటి ఛాలెంజ్ సినిమా | Winner Movie Review.

Teluguwishesh విన్నర్ విన్నర్ Sai Dharam Tej Winner Movie Review. Product #: 81130 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    విన్నర్

  • బ్యానర్  :

    లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్‌

  • దర్శకుడు  :

    గోపీచంద్ మలినేని

  • నిర్మాత  :

    నల్లమల్లపు బుజ్జి, ఠాగూర్‌ మధు

  • సంగీతం  :

    ఎస్ ఎస్ థమన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    ఛోటా కే నాయుడు

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, ముకేష్ రుషి, ఠాకూర్ అనూప్ సింగ్

Winner Telugu Movie Review

విడుదల తేది :

2017-02-24

Cinema Story

కథ:

ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవటంతో బయటికి వెళ్లిపోతాడు ధనవంతుడైన మహేందర్ రెడ్డి(జగపతి బాబు). కోట్లాది ఆస్తిని వదులుకుని భార్య, కొడుకులతో ప్రశాంతంగా జీవిస్తుండటాడు. ఇంతలో తండ్రి సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్తాడు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య కొడుకు సిద్ధార్థ(సాయి ధరమ్ తేజ్) మాత్రం తన కుటుంబానికి దూరమవుతాడు. 

20 ఏళ్ల తర్వాత రామ్ గా పేరు మార్చుకుని జర్నలిస్ట్ గా ఎదుగుతాడు సిద్ధార్థ్. అదే సమయంలో సితార(రకుల్) ను చూసి ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉంటే ఆమె తాత యువ(థాకూర్ అనూప్ సింగ్) ను సిద్ధార్థ ప్లేస్ లోకి దించి సితారతో పెళ్లి కుదురుస్తాడు. అయితే ప్రేమించిన సితారను దక్కించుకోవటానికి రామ్ సొంత తండ్రితోనే గుర్రం రేస్ ఛాలెంజ్ చేస్తాడు. మరి చివరకు రామ్ గెలిచాడా? అతనే తప్పిపోయిన తన కొడుకు సిద్ధార్థ్ అని తెలుస్తుందా? చివరకు ఎలాంటి ముగింపు ఉంటుంది. అన్నదే కథ... 

cinima-reviews
విన్నర్

మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ టైంలోనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తో సాయి ధరమ్ తేజ్ స్టార్ గా వెలుగు వెలిగాడు. స్టార్ డమ్ కి కూసింత దూరంలో ఉన్న సమయంలో తిక్క సినిమా పెద్ద దెబ్బే వేసింది. అయినప్పటికీ కొత్త స్టైల్ తో విన్నర్ గా మన ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే...

విశ్లేషణ:

పాత కథకు.. కొత్త మెరుగులు దిద్దటం, తద్వారా మెరుగైన ఫలితం రాబట్టడం. ఇది ఈ మధ్య సాగుతున్న ట్రెండ్. అయితే ఏ మాత్రం అలాంటి ప్రయత్నం మచ్చుకైనా చేయకుండా సోదీ వ్యవహారంతో సక్సెస్ రాబట్టడం కానీ పని. సరిగ్గా విన్నర్ విషయంలో అదే జరిగింది. కొడుకు వ్యవహారం నచ్చని తండ్రి బిడ్డను దూరం చేయటం, అతను తిరిగొచ్చి తాతకు బుద్ధి చెప్పటం.. ఎప్పుడో తాత-మనవడు టైం నుంచి ఇదే తరహా కథలు.. అదే రోటీన్ వ్యవహారం.

రెగ్యులర్ కమర్షియల్ డ్రామాను ఏ మాత్రం ఆసక్తి లేకుండా తెరకెక్కించటమే కాదు, ఏ మాత్రం ప్రభావం చూపని ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు దర్శకుడు. సినిమా మొదలైన పావుగంటకే కథలో వ్యవహారం అర్థమైపోతుంది. దీంతో ప్రేక్షకుడి పెదవి విరుపులు అక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. చిన్నప్పుడు ఫ్యామిలీకి దూరమైన హీరో, తన మరదలినే ప్రేమలో పడేయటం, ఆపై తండ్రితోనే ఛాలెంజ్ చేసి ప్రేమను దక్కించుకోవటం లాంటి పాత చింతకాయ ఫార్ములాను లావీష్ గా తెరకిక్కించాడే తప్ప స్క్రీన్ ప్లేను ఆ కాలం స్టైల్ లోనే తెరకెక్కించాడు.

పైగా అవసరం లేని ఎంటర్ టైన్ మెంట్ సీన్లతో ఫస్టాఫ్ నింపేసిన దర్శకుడు, ఇంటర్వెల్ లో కాస్త క్యూరియాసిటీ పెంచినప్పటికీ, కథ పరంగా ఎలాంటి వండర్స్ చేయలేకపోయాడు. అసందర్భానుసారం వచ్చే పాటలు, పాత్రలు సినిమాను దారుణంగా దెబ్బ తీశాయి. ప్రీ క్లైమాక్స్ లో ఊరించిన దర్శకుడు మళ్లీ క్లైమాక్స్ ను తేల్చేసిన నిరుత్సాహపరిచాడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ ఫెర్ ఫార్మెన్స్ పరంగా మరోసారి ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్కులో డాన్సుల్లో ఇరగదీసినప్పటికీ, బహుశా కథ మూలానో ఏమో ఎమోషనల్ సీన్లలో ఎందుకో తడబడినట్లు అనిపించకమానదు. ఇక రకుల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అయితే గ్లామర్ షోతో మాత్రం మరోసారి ఆకట్టుకుంది. ట్రెండీ గర్ల్ గా అందాలను తెగ ఆరబోసింది. జగపతి బాబు పాత్ర కాస్త హైలెట్ గా నిలుస్తుంది. ముకేష్ రుషి, రఘుబాబు, అలీ, వెన్నెల కిషోర్ పరిధి మేర నటించారు. స్పెషల్ సాంగ్ లో అనసూయ ఆకట్టుకుంది.


టెక్నికల్ పరంగా... మ్యూజిక్ పరంగా తమన్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్ నెస్ ఎక్కువైంది. సినిమాటోగ్రఫర్ ఛోటా పనితనం బాగుంది. ముఖ్యంగా పాటల్లో లోకేషన్లను చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదు. ఆర్ట్ వర్క్ బావుంది. నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:

సాయి నటన, రకుల్ గ్లామర్

కామెడీ సీన్లు

 

మైనస్ పాయింట్లు:

రోటీన్ కథ, కథనం

దర్శకత్వం

అనవసరమైన సన్నివేశాలు

ఓవర్ ఫ్యామిలీ డ్రామా

 

తీర్పు...

సాధారణంగా ఒక సినిమాలోకి ఆడియన్స్ ఎంగేజ్ అవ్వాలంటే ఎంటర్ టైన్ మెంట్ అనే ఓ ఎలిమెంట్ ను అస్త్రంగా వాడాలి. కానీ, విన్నర్ కోసం ఆ యత్నం కాస్త కూడా చేయలేకపోయాడు గోపీచంద్. ఓ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాను కాస్త కూడా ఎమోషన్స్ లేకుండా తెరకెక్కించటంతో విన్నర్ ప్రేక్షకులకే నిరాశే కలిగిస్తుంది.


చివరగా.. విన్నర్... వీక్ స్టోరీ విత్ రోటీన్ అండ్ అవుట్ డేటెడ్ ఫార్ములా.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.