సింగం-3 (యముడు-3) రివ్యూ | S3 Aka Yamudu 3 Movie Review.

Teluguwishesh ఎస్‌-3 (యముడు 3) ఎస్‌-3 (యముడు 3) Suriya Singam 3 aka Yamudu 3 Movie Review. Product #: 80805 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఎస్‌-3 (యముడు 3)

  • బ్యానర్  :

    సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్ మీడియా, (స్టూడియో గ్రీన్)

  • దర్శకుడు  :

    హరి

  • నిర్మాత  :

    మల్కాపురం శివకుమార్‌, (జ్నానవేల్ రాజా)

  • సంగీతం  :

    హ్యారిస్ జైరాజ్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    ప్రియన్

  • ఎడిటర్  :

    విటి విజయన్‌, టి.ఎస్‌.జయ్‌

  • నటినటులు  :

    సూర్య, అనుష్క, శృతీహాసన్, రాధికా శరత్ కుమార్, నాజర్, రాధారవి, శరత్ సక్సేనా, పరోటా సూరి తదితరులు

Singam 3 Movie Review

విడుదల తేది :

2017-02-09

Cinema Story

కర్ణాటకకు చెందిన ఓ కమిషనర్ దారుణ హత్యతో సినిమా ఓపెన్ అవుతుంది. దీనిని డీల్ చేయడానికి ఏపీకి చెందిన పవర్ ఫుల్ ఆఫీసర్ నరసింహ(సూర్య)ను డిప్యూటేషన్ మీద అక్కడికి రప్పించుకుంటాడు హోం మినిస్టర్(శరత్ బాబు). ఓ గ్యాంగ్ దీని వెనక ఉందని పసిగట్టిన నరసింహ దాని వెనుక వేరే మాఫియా హస్తం ఉందని, విదేశాల్లో ఉండే బడా బిజినెస్ మెన్ విఠల్ (అనూప్ సింగ్) హస్తం ఉందని పసిగడతాడు. 

వెంటనే ఉన్నతాధికారుల సపోర్ట్ ఆస్ట్రేలియా కు బయలుదేరతాడు. అక్కడ నరసింహకు కొన్ని ఛాలెంజ్ లు ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాడు. కేసులో అగ్ని(శృతీహాసన్) ఎలా సాయం చేస్తుంది. అసలు అనూప్ కమిషనర్ ను ఎందుకు చంపుతాడు. నరసింహ వేట ఎలా ముగుస్తుంది అన్నదే కథ. 

cinima-reviews
ఎస్‌-3 (యముడు 3)

తాను ఫ్లాపుల్లో ఉన్నప్పుడల్లా సింగం సిరీస్ తో వచ్చి హిట్లు కొట్టడం సూర్యకి అలవాటు అయిపోయింది. ఇంతకు ముందు ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కూడా సేమ్ కాస్ట్ అండ్ క్రూ తో(విలన్లు తప్ప) వచ్చి బ్లాక్ బస్టర్లు అయినవే. ప్రస్తుతం సూర్యకు సరైన హిట్ పడక చాలా కాలమే అయ్యింది. దీంతో మూడో పార్ట్ ఎస్-3 అకా యముడు-3 తో రంగంలోకి దిగిపోయాడు. వాయిదాలు పడుతూ వస్తున్నప్పటికీ, దర్శకుడు హరి, సూర్య మీద నమ్మకం సినిమాపై అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా చేశాయ్. మరి యముడు 3 గా సూర్య ఏ రేంజ్ లో చెలరేగిపోయాడు, సింగం సిరీస్ సక్సెస్ ట్రాక్ ను దర్శకుడు హరి కొనసాగించాడా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ:

ఒక సిరీస్ సినిమాలు చేసినప్పడు ఒకే తరహా కథలను ఎంచుకోకుండా ముందుకు వెళ్లటం కత్తి మీద సాములాంటిదే. అయితే హరి మాత్రం గత రెండు సిరీస్ లలో ఇంచు మించు ఒకే తరహా ఉన్న కథలనే ఎంచుకున్నా సూర్య ఇమేజ్ తో మంచి ఫలితం రాబట్టగలిగాడు. అయితే సింగం-3 విషయానికొస్తేనే కథ విషయంలో మాత్రం రెండు పార్ట్ లతో పోల్చుకోక తప్పదు. ఎందుకంటే ఇందులో కేవలం హీరోయిజం మీదనే టోటల్ భారాన్ని వేసి నడిపించాడు డైరక్టర్. ఎలాంటి ట్విస్టులు లేకుండా, సింపుల్ గా సాగిపోయే కథకి, భారీ యాక్షన్ సీక్వెన్స్ జోడించి సాగదీసే యత్నం చేశాడు.

ఇక ఎంటర్ టైనింగ్ విషయానికొస్తే.. గత రెండు సినిమాల్లో సిచ్యుయేషనల్ కామెడీని వాడుకున్న దర్శకుడు ఈసారి మాత్రం ఫేలయ్యాడు. ఎమోషనల్ తోపాటు, యాక్షన్ కి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చిన హరి ఈసారి దాన్ని పూర్తిగా వదిలేశాడు. పూర్తిగా పవర్ ఫుల్ యాక్షన్ సీన్లేనే తెరకెక్కించటంతో ఇది మిగతా వారికి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది డౌట్ గానే అనిపిస్తోంది.

నటీనటుల విషయానికొస్తే పోలీసాఫీసర్ పాత్రలో సూర్య ఏ రేంజ్ లో విజృంభిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసాఫీసర్ పాత్రలో మరోసారి రెచ్చిపోయాడు. మొదటి పార్ట్ లో ఎస్ ఐ, రెండో పార్ట్ లో ఏసీపీ, మూడో పార్ట్ లో డీసీపీ నరసింహగా, ఓ యూనివర్సల్ కాప్ గా సినిమాను పతాక స్థాయిలో నిలబెట్టాడు. డాన్స్, ఎమోషన్ సీన్లలో డైలాగులు అన్నింట్లోనూ విజృంభించాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ లౌడ్ నెస్ ఎక్కువ అనిపించక మానదు. ఇక గత రెండు సిరీస్ లో కేవలం లవర్ పాత్రకే పరిమితమైన అనుష్కను ఇందులో భార్యగా చూపించాడు దర్శకుడు. ఓ ఇంపార్టెంట్ పాత్రలో శృతీహాసన్ అలరించింది. అయితే కేవలం పాటలకు తప్ప కథ కోసం హీరోయిన్లను వాడినట్లు అనిపించదు.

రాధిక శరత్ కుమార్ శృతీ తల్లి పాత్రలో మెప్పించింది. కొత్తవాడైనా విలన్ గా ఠాగూర్ సింగ్ బాగా చేశాడు. కమెడియన్ పరోటా సూరి కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. నాజర్, శరత్ సక్సేనా, రాధారవి పరిధి మేరలో నటించారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మ్యూజిక్ పరంగా అంతా ఆకట్టుకోలేకపోయిన హ్యారిస్ జైరాస్ బ్యాగ్రౌండ్ లో మాత్రం తన మార్క్ ను చూపించాడు. ప్రియన్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఇద్దరు ఎడిటర్లు పని చేసినప్పటికీ ఎందుకనో అది అంతగా కుదరలేదు. చాలా సన్నివేశాలు కత్తిరించాల్సి ఉంది. యాక్షన్ సీక్వెన్స్ దుమ్మురేగిపోయేలా అద్భుతంగా ఉన్నాయి. డైలాగులు కూడా అదే రేంజ్ లో పేలిపోయాయి. అయితే దర్శకుడిగా మాత్రం హరి తన ముద్ర వేయలేకపోయాడు.


ఫ్లస్ పాయింట్లు:

సూర్య
ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్
యాక్షన్ సన్నివేశాలు

 

మైనస్ పాయింట్లు:
కథ, కథనం
సెకండాఫ్ సాగదీత
ఎంటర్ టైన్ మెంట్ లేకపోవటం

తీర్పు:

సింగం సిరీస్ అనగానే ఓ మాఫియా ముఠాను తన బుద్ధిబలంతో మట్టుబెట్టే నరసింహనే చూశాం. కానీ, ఈ పార్ట్ లో కేవలం భుజబలాన్ని మాత్రమే ఉపయోగించాడేమో అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినా లాజిక్ లేని హెవీ యాక్షన్ సన్నివేశాలతో నెట్టుకొద్దామని యత్నించాడు దర్శకుడు. పైగా సెకంఢాఫ్ లో లెంగ్తీనెస్ మరీ ఎక్కువ అయిపోవటం ప్రేక్షకుడి సహనాన్ని పరిక్షిస్తుంది. అయితే తమిళ జనాలకు తెగనచ్చే ఈ టైప్ ఆఫ్ జోనర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏ మేర అలరిస్తాయన్నది కాస్త డౌటే.

చివరగా.. ఎస్- (యముడు-3) కథ నిల్ యాక్షన్స్ ఫుల్...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.