• చిత్రం  :

  నేను లోకల్

 • బ్యానర్  :

  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

 • దర్శకుడు  :

  త్రినాథ రావు నక్కిన

 • నిర్మాత  :

  దిల్ రాజు

 • సంగీతం  :

  దేవీశ్రీప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  నిజార్ షఫీ

 • నటినటులు  :

  నాని, కీర్తి సురేష్, పోసాని, సచిన్ కేద్కర్, ఈశ్వరీరావు తదితరులు

Nenu Local Movie Review

విడుదల తేది :

2017-02-03

Cinema Story

కథ:

గ్రాడ్యుయేషన్ పూర్తయిన బాబు(నాని) అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాడు. ఓరోజు తొలిచూపులోనే కీర్తిని(కీర్తి సురేష్) చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఆకట్టుకునేందుకు తాను కూడా ఎంబీఏలో జాయిన్ అవుతాడు. ఇంప్రెస్ చేయడానికి బాబు చేసే పనులన్నీ కీర్తి అండ్ ఫ్యామిలీకి వెకిలి చేష్టలుగా కనిపిస్తుంటాయి. అయితేనేం చివరకు ఎలాగోలా తన ప్రేమలో పడేసుకుంటాడు బాబు. 

 

అయితే చిల్లరగా తిరిగే బాబంటే ఆ అమ్మాయి తండ్రి(సచిన్ కేద్కర్) కు ఇష్టం ఉండదు. ఇంతలో వేరే పోలీసాఫీసర్(నవీన్ చంద్ర) తో కీర్తి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు వాళ్ల నాన్న. ఆ గ్యాప్ లో కీర్తి తండ్రే తనను బతిమాలుకునేలా చేస్తానంటూ ఛాలెంజ్ చేస్తాడు బాబు. ఇంతలో అనుకోని ఓ ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? బాబు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు? అన్నదే కథ.  

cinima-reviews
నేను లోకల్

ఐదు హిట్లు కొట్టి టాలీవుడ్ లో మాంచి ఊపు మీద ఉన్న నేచురల్ స్టార్ నాని ఈ యేడాది తన ఫస్ట్ చిత్రాన్ని మన ముందుకు తెచ్చేశాడు. త్రినాథరావు దర్శకత్వంలో ఫస్ట్ టైం ఓ యాక్షన్ కథతో అది కూడా దిల్ రాజు లాంటి ఓ స్టార్ ప్రొడ్రూసర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. నేను లోకల్ అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టాడా? ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ:
నేనులోకల్ గురించి చెప్పాలంటే ఓ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ ప్రేమకథ.. రెండు-మూడు ట్విస్ట్ లు.. కలర్ ఫుల్ సాంగ్స్, ఎంటర్ టైనింగ్ గా సాగిపోయే స్టోరీ. కావాల్సినన్నీ కామెడీ సీన్లు, ఫైట్లు. రేసీగా సాగిపోయే స్క్రీన్ ప్లేను నడిపించిన దర్శకుడు త్రినాథరావు సినిమాను బాగా తెరకెక్కించాడు. సాధారణంగా ఇలాంటి కథలను ఎంచుకున్న దర్శకుడు ఫస్టాఫ్ లోనే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ను ఇరికించేసి, సెకండాఫ్ లో కాస్త స్లోగా నిదానించేలా చేస్తారు. కానీ, నేనులోకల్ కాస్త రివర్స్ అనిపించకమానదు.

పనిలేని హీరో అమ్మాయి వెంట పడటం, చివరకు ఫ్లాట్ అయిపోయి తాను లవ్ లో పడిపోవటం లాంటి రెగ్యులర్ సోదీ మినహాయిస్తే ఫస్టాఫ్ సో జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే కథ సెకండాఫ్ లో కూడా కంటిన్యూ అయి చివరకు ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్స్ లో సాగిపోయి మంచి ముగింపు ఇస్తుంది.

నటీనటుల విషయానికొస్తే... కామెడీ టైమింగ్ లో నానిని వంకపెట్టలేం ఇది తెలిసిందే. అయితే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ సీన్స్ లో నాని ఇందులో నటించాడు. ఫైట్స్ లో కాస్త అతి అనిపించినప్పటికీ, ఓవైపు స్టైలిష్ గా కనిపిస్తూనే, మరోవైపు మాస్ అవతార్ లో ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గకుండా కానిచ్చేశాడు. ఇక ఫస్ట్ టైం డాన్సులపై కూడా కాంసట్రేషన్ చేసినట్లు క్లియర్ గా తెలిసిపోతుంది. బహుశా దేవీ మాంచి బీట్స్ ఇవ్వటమే కారణం అయి ఉండొచ్చు. ఇది కీర్తి సురేష్ విషయానికొస్తే సింపుల్ గా కానిచ్చేసింది. పతాక సన్నివేశాలలో ఎక్కడా తప్పులు దొర్లకుండా క్యూట్ గా నటించింది. నాని పెరేంట్స్ గా పోసాని, ఈశ్వరీరావు, కీర్తి పాధర్ గా బాలీవుడ్ నటుడు సచిన్ కేద్కర్, పోలీసాఫీసర్ గా నవీన్ చంద్ర తమ పాత్రల్లో కానిచ్చేశారు. ఇక రావు రమేష్ నెగటివ్ పాత్రతో మరోసారి జీవించేశాడు. ఇంత వరకు రివీల్ కానీ ఈ రోల్ ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందనుకోవచ్చు.


టెక్నికల్ పరంగా... రిలీజ్ కు ముందే ఆడియన్స్ కు కనెక్ట్ అయిన ఆడియో, విజువల్స్ పరంగా కూడా ఆకట్టకుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో దేవీ పనితనం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. నాని లాంటి యంగ్ స్టర్ ఫస్ట్ టైం క్రేజీ ట్యూన్స్ ఇచ్చాడు దేవీ. సర్ ప్రైజ్ ఇస్తుంది. నిజార్ షఫీ కెమెరాపనితనం సినిమాకు రిచ్ నెస్స్ తీసుకొచ్చింది. పాటల్లో ముఖ్యంగా చంపేశావే సాంగ్.. లో అతని వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. ఎడిటింగ్ చక్కగా కుదిరింది. డైలాగులు సింపుల్ అండ్ స్వీట్ గా పేలాయి. ప్రతిష్టాత్మక బ్యానర్ కాబట్టి నిర్మాణ విలువలు అదే రేంజ్ లో ఉన్నాయి.

 

ఫ్లస్ పాయింట్లు:

యూత్ ఫుల్ స్టోరీ

నాని యాక్షన్

సంగీతం

కామెడీ

 

 

మైనస్ పాయింట్లు:
సెకండాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు


తీర్పు:
ఇప్పటిదాకా కేవలం క్లాసిక్ ఫెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న నానితో యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఓ మాస్ యాంగిల్ లో చూపిస్తూ మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అనుకున్న కథను అంతే ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించటంలో డైరక్టర్ త్రినాథరావు సక్సెస్ అయ్యాడు.


చివరగా... నేనులోకల్... ఓ కమర్షియల్ ఫుల్ టైంపాస్ మూవీ...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

X

Latest Reviews

porno